Search
  • Follow NativePlanet
Share
» »హోటల్ రొమాన్స్ - పూల్ సైడ్ డిన్నర్ ?

హోటల్ రొమాన్స్ - పూల్ సైడ్ డిన్నర్ ?

రొమాన్స్ కు హద్దులు లేవు. అది ఇండియా కాని లేక విదేశం కానీ రోమ్నాన్సు చేసేవారు వారి ప్రియతముల ఆకర్షణలో వుండి ఆనందిస్తారు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక వ్యక్తులు కొన్ని ప్రత్యేక ప్రాంతాలను కూడా ఎంచుకుంటారు. బర్త్ డే లు, వాలెంటైన్ డే లు, హనీమూన్, వివాహ వార్షిక రోజులు వంటి సందర్భాలకు మీ ప్రియతములను వదిలి మీరు ఉండలేరు. పర్యటనలలో మనం ప్రేమించే వారు పక్కన వుండటం ఎంతో ఆనందం కలిగిస్తుంది. వివిధ ప్రదేశాలలో వివిధ ఆకర్షణలు వుంటాయి. పూర్వ కాలం నుండి ఇండియా లోని ప్రదేశాలు రొమాన్స్ కు ప్రసిద్ధి. వాటిలో రాజస్తాన్ రాష్ట్రం ఒకటి. రాజస్తాన్ లోని హోటల్స్ రొమాన్స్ కే కాదు మీ విశ్రాంతి పర్యటనలకు సైతం అద్భుత వాతావరణం కల్పిస్తాయి.

రాజస్తాన్ పర్యాటకంలో రొమాంటిక్ హోటల్స్ ఒక భాగం. ఈ హోటల్స్ అన్నీ ఈ ప్రాంతాన్ని గతంలో పాలించిన రాజుల రాచరికపు ప్రేమలు, హంగులు కలిగి వుంటాయి. మీ కేండిల్ లైట్ డిన్నర్ ను ఒక బోటు డెక్ పై తీసుకొని ఆనందించండి లేదా మీ ప్రేయసి చేతిలో సరసు ఒడ్డున కులాసాగా నడవండి. ఇక మీ ఇష్టం. అందమైన ఒక గార్డెన్ లో ఒక గుడారం కూడా మరువలేని అనుభూతి. ఇక్కడ గుడారాలకు వాడే బట్టపై చేతితో అల్లబడిన ఏమ్బ్రాయిడరి కలిగి వుంటుంది. అది ఇక్కడి ప్రజల సంస్కృతి వైభవం తెలియచేస్తుంది.

మీ పర్యటనలో ఆనందించేందుకు కొన్ని రొమాంటిక్ రాజస్తాన్ హోటల్స్ సూచిస్తున్నాం. మీ ప్రియమైన వారితో కలసి ఈ రొమాంటిక్ హోటల్స్ లో విహరించండి.

అమన్ బాగ్ రిసార్ట్, ఆళ్వార్

అమన్ బాగ్ రిసార్ట్, ఆళ్వార్

రాజస్తాన్ లో ఇది ఒక లక్సరీ హోటల్. అమన్ బాగ్ రిసార్ట్ మీకు రొమాంటిక్ వాతావరణం కలిగిస్తుంది. గ్రీన్ మార్బుల్ తో చేయబడిన బాత్ టబ్ లు, వ్యక్తిగత బార్ వంటి ప్రత్యేకతలు మీకు మీ ప్రియమైన వారికి వుంటాయి. రిసార్ట్ గార్డెన్ లో ప్రకృతి నడకలు చేయవచ్చు. ఒక మొగల్ పాలస్ లా వుండే ఈ రిసార్ట్ ప్రశాంత వాతావరణంలో ఒక జంటకు అవసరమైన ప్రైవేటు సమయం అందిస్తుంది. డైనింగ్ కూడా ప్రైవేటుగా చాత్రి అనబడే ఒక కొండ ప్రాంతంలో చేయవచ్చు.

సామోడ్ హవేలీ, జైపూర్

సామోడ్ హవేలీ, జైపూర్

సామోడ్ హవేలీ హోటల్ గతంలో ఒక రాయల్ పాలస్. ఆరావళి కొండల దిగువ భాగంలో కలదు. దీనిని రాజ కుటుంబీకులు ఎంతో బాగా మైంటైన్ చేసారు. ఈ హోటల్ వెలుపలి ప్రదేశాలు బాగా లేకపోయినా, హవేలీ లోని అలంకరణలు అద్భుతంగా వుంటాయి. హోటల్ గార్డెన్, లేదా అద్దాల తలుపులు, కారిడార్ లు కన్నుల విందుగా వుంటాయి. ఇక్కడ హోటల్ సౌకర్యాలతో పాటు మీరు ఒక ఒంటె సవారి కూడా ఆనందించి అసలైన హనీ మూన్ అనిపించుకోనవచ్చు.

 ది లీలా పాలస్, ఉదయపూర్

ది లీలా పాలస్, ఉదయపూర్

ఈ హోటల్ సమీపంలో కల అందమైన పిచోలా సరస్సు, పక్కన కల ఆరావళి కొండలు ఈ హోటల్ ను జంటలు ఎంపిక చేసేలా చేస్తాయి. విలాసవంతమైన ఈ హోటల్ లో స్టైలిస్ట్ గా రూపొందించిన సూట్లు, రూములు స్వాగతిస్తాయి. గదులలోనుండే మీరు అక్కడ కల సరస్సు దృశ్యాలను చూడవచ్చు. అక్కడ కల ఎన్నో రెస్టారెంట్ లలో మీ ఎంపిక మేరకు తినవచ్చు, తాగవచ్చు. పూల్ పక్కన కేండిల్ లైట్ డిన్నర్ మీ ప్రేయసితో కలసి చేయవచ్చు. ఈ రాజ వైభోగాల మధ్య పెండ్లి కాని వారైతే, వివాహపు ఏర్పాట్లు కూడా చేసికొనవచ్చు.

గజ నేర పాలస్, బికనేర్

గజ నేర పాలస్, బికనేర్

గజ నేర పాలస్ అక్కడ కల అద్భుత తాల ఎడారి, ఒక సరస్సు ల దృశ్యాలకు ఎంపిక చేయబడుతుంది. ఇది ఒక హెరిటేజ్ హోటల్, విస్తారమైన బాల్కనీలు, టెర్రస్ లు, వంటి వాటితో క్షణ క్షణం శృంగార భరితంగా గడపవచ్చు. డెసర్ట్ సఫారి, బోటు రైడ్, సంక్చురి డిన్నర్ లు, నేచర్ వాక్ లు, వంటివి మీ ప్రైవసీ లో చేయవచ్చు. ప్రశాంత వాతావరణంలో కల ఈ హోటల్ మీ డైలీ లైఫ్ లో గల మూడ్ ను తొలగించి మరొక్క సారి శృంగార భరిత జీవనం అందిస్తుంది.

 ది ఒబెరాయ్, ఉదయ విలాస్, ఉదయపూర్

ది ఒబెరాయ్, ఉదయ విలాస్, ఉదయపూర్

ప్రపంచ స్థాయి రొమాంటిక్ హోటల్స్ లో ఒబెరాయ్ ఒకటి. గతించిన కాలం నాటి రాజ వైభోగాలను హోటల్ ఒబెరాయ్ ఉదయ విలాస్ మీకు అందిస్తుంది. ప్రైవేటు డిన్నర్లు, మీ రూమ్ లేదా స్విమ్మింగ్ పూల్ వద్ద లేదా స్పా కోర్టు యార్డ్ లో చేయవచ్చు. ఉదయ విలాస్ లో సూట్లు కూడా ప్రైవేటు పూల్, గార్డెన్, కోర్టు యార్డ్ లు కలిగి వున్నాయి. మీ ప్రియమైన వారితో పూర్తి ప్రైవసి లో ఆనందించవచ్చు.

 సూర్యగ్రహ , జైసల్మేర్

సూర్యగ్రహ , జైసల్మేర్

జైసల్మేర్ లోని రాజస్థాన్ హోటల్ అయిన సూర్య గ్రహ హోటల్ లో లక్సరీ గారంటీ. ఈ హోటల్ రొమాన్స్ కు విలాసాలకు పెట్టింది పేరు. ఇసుక తిన్నెల వద్ద రొమాంటిక్ డిన్నర్ లు, వైల్డ్ లైఫ్ అన్వేషణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్పా, బార్, ఎక్స్కర్షన్ లు వంటి ప్రైవేటు ప్రోగ్రాం లు వంటివి మీ ప్రియమైన వారితో కలసి ఆనందించవచ్చు.

తాజ్ లేక్ పాలస్, ఉదయపూర్

తాజ్ లేక్ పాలస్, ఉదయపూర్

తాజ్ లేక్ పాలస్ లో మీ రొమాంటిక్ సమయాలు అద్భుతంగా వుంటాయి. ప్రైవసి అధికం. మేవార్ టెర్రస్ లేదా లిల్లీ పాండ్ వంటి ప్రదేశాలు పూర్తిగా మీకు ప్రైవసీ కల్పించి ఆనందింప చేస్తాయి. మేవార్ టెర్రస్ అందమైన పిచోలా సరస్సు ఎదురుగా వుంటుంది. ఈ ప్రదేశంలో ఏ రకమైన అడ్డంకులు లేకుండా మీరు గంటలు గడపవచ్చు. లిల్లీ పాండ్ చుట్టూ కల వృక్ష సంపద, అక్కడ కల అందమైన ఫౌంటెన్ చక్కటి వెన్నెల వెలుగులు మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

ది గేటు వే హోటల్, జోద్ పూర్

ది గేటు వే హోటల్, జోద్ పూర్

ఈ హోటల్ లో మీకు సుందర దృశ్యాల పచ్చిక మైదానాలు, విలాసవంతమైన కోర్ట్ యార్డులు, సాంప్రదాయ, ఆధునిక మిలిత సంస్కృతి కనపడుతుంది. ఇక్కడ కల సూట్లు, రూమ్ లు మీకు ఎంతో సౌకర్యవంతంగా మీ రొమాన్స్ కు అడ్డం లేని రీతి లో వుంటాయి. కేమేల్ , విలేజ్ సఫారి, సాలోన్, మసాజ్ లు, వంటివి మీలో ఉల్లాసం రేకెత్తిస్తాయి. గేటు వే హోటల్ సమీపంలో ఇంకా అనేక అందమైన ప్రదేశాలు కలవు.

శివ నివాస్ పాలస్, ఉదయపూర్

శివ నివాస్ పాలస్, ఉదయపూర్

ఈ రొమాంటిక్ హోటల్ దాని నెలవంక ఆకారంతో ఒక ప్రత్యేకత కలిగి వుంది. రాయల్ ఫర్నిచర్, సూట్లు, రూములు మీరు ఊహించిన దానికంటే అధిక ఆనందాలు ఇస్తాయి. శ్రుంగార భరితమైన ఉదయపూర్ నగరం లో మీరు ఇక్కడ గడిపే మధుర క్షణాలు మరచిపోలేనివిగా వుంటాయి. వ్యక్త్లిగత సేవలు, చక్కటి ఆతిధ్యం వంటివి మీ ఇంటిని గుర్తు చేస్తాయి. పూల్ సైడ్ లో కేండిల్ లైట్ డిన్నర్ ఆనందాన్ని ఇస్తుంది.

 ఉమైద్ భవన్ పాలస్, జోద్ పూర్

ఉమైద్ భవన్ పాలస్, జోద్ పూర్

జోద్ పూర్ రాచనగరంలో ఇది ఒక తాజ్ ప్రాపర్టీ. రాజస్తాన్ లోని అన్ని రొమాంటిక్ హోటల్స్ లో ఇది ఉత్తమమైనది. ప్రపంచంలోని అత్యధిక పెద్దవైన ప్రైవేటు రెసిడెన్స్ లు ఇక్కడ వున్నాయి. దట్టమైన పచ్చటి గార్డెన్ లు, లక్సరీ రూమ్ లు, కలవు. వీటిలోని సౌకర్యాలు మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. ఇక్కడ కల తాజ్ స్పా ఆకర్షనీయం. సన్నిహిత, ప్రైవేటు డైనింగ్ ఏర్పాట్లు కలవు. చక్కని సుగంధ ద్రవ్యాల సువాసనలు, వీనుల విందైన మ్యూజిక్, మీ లోని రొమాన్స్ ను మరింత అధికం చేస్తాయి.

 నైలా బాగ్ పాలస్, జైపూర్

నైలా బాగ్ పాలస్, జైపూర్

నైలా బాగ్ పాలస్ చుట్టూ కల ప్రశాంతమైన పర్యావరణం, ఈ హోటల్ ను రొమాన్స్ కు ఎంపిక చేస్తుంది. మీరు ఏదైనా ఇక్కడ చూస్తున్నారంటే అది డాన్స్ చేసే నెమళ్ళు. కొలను వద్డకల దృశ్యాలు మంత్ర ముగ్ధులను చేస్తాయి. రాజ ప్రాసాదాల వలే వుండే ఇక్కడి సూట్లు, రూములు మిమ్మల్ని ఒక్కసారి పూర్వపు రాజ వైభోగాలవైపు తీసుకు వెళతాయి. ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుతాలతో మీ విహారం గడిచి పోతుంది.

 హోటల్ విక్టోరియ, జైసల్మేర్

హోటల్ విక్టోరియ, జైసల్మేర్

జైసల్మేర్ లోని హోటల్ విక్టోరియా ఒక మంచి కోట. కనుక ఇది రొమాన్స్ కు ఒక ప్రత్యేక హోటల్ గా వుంటుంది. ఫోర్ట్ అంతా గోడలపై అందమైన అలంకరణలు చేసారు. ఇక్కడ మీరు సూర్యాస్తమయ దృశ్యాలు ఆనందించవచ్చు. రొమాంటిక్ జంటలకు అచ్చం అరేబియన్ నైట్ కధలలో వలే వుంటుంది. టెర్రస్ అంతా రంగు రంగుల కుషన్ల తో వుండి మీరు కూర్చుని అక్కడ నుండే జైసల్మేర్ టవున్ అంతా చూసి ఆనందించేదిగా వుంటుంది.

 ఉదయ విలాస్ పాలస్, దుంగార్పూర్

ఉదయ విలాస్ పాలస్, దుంగార్పూర్

ప్రశాంతమైన గిబ్ స్దాగర్ సరస్సు ప్రదేశంలో కల ఈ హోటల్ ఒక ప్రైవేటు రిజర్వు ఫారెస్ట్ లో కలదు. పరిసరాలు, హనీమూన్ కు బాగా సరిపోతాయి. విశాలమైన బెడ్ రూములు, ఆధునిక వసతులు కలవు. కేండిల్ లైట్ డిన్నర్లు, ఈ ప్రాంతంలోకల సరస్సు ఒడ్డున ఎక్కడ చేసినా అద్భుతంగా వుండి మీ ప్రియమైన వారు ఎప్పటికి మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది. మీరు కనుక పక్షుల పట్ల ఆసక్తి కలవారైతే, ఈ ఉదయ విలాస్ పాలస్ మీ ఆనందాలకు సరైన హోటల్ గా చెప్పాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X