Search
  • Follow NativePlanet
Share
» »మున్నార్ ...ఒక ముచ్చటైన ప్రకృతి సందర్శన!!

మున్నార్ ...ఒక ముచ్చటైన ప్రకృతి సందర్శన!!

కేరళ రాష్ట్ర పర్యాటనలో మున్నార్ ప్రదేశం ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఇండియా లో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తున్నారు. కేరళ కు వచ్చే ఏ పర్యాట కుడైనా సరే, మున్నార్ తప్పక చూడవలసిందే. అక్కడ కల దృశ్యాలు, వాతావరణం వారిని కట్టి పడేస్తాయి.మున్నార్ ను 24 గంటలలో పర్యటించేందుకు గాను మీకు ఒక ప్రణాళిక ఇస్తున్నాము. పరిశీలించండి. పడమటి కనుమలలో కల మున్నార్ కు సరిహద్దులుగా పచ్చటి పర్వత ప్రదేశాలు, తేయాకు తోటలు కలవు. మున్నార్ కు అర్ధం చెప్పాలంటే, మూడు నదులు అని అర్ధం. అవి మధుర పూజ, నల్లతాని మరియు కుండలి. ఈ మూడు నదులు ఈ ప్రాంతం లో కలుస్తాయి. కేరళ లోని ఇడుక్కి జిల్లాలో మున్నార్ ప్రధాన పర్యాటక ప్రదేశం. మున్నార్ ను పూర్తిగా చూసే సమయం లేదనుకుంటే, ఇక్కడ మేము అందిస్తున్న ప్రదేశాలను మాత్రం తప్పక చూడండి.

ఎరావికులం నేషనల్ పార్క్

ఎరావికులం నేషనల్ పార్క్

ఎరావికులం నేషనల్ పార్క్ లో మీరు నేడు కనుమరుగు అవుతున్న నీల గిరి తార జింకలను చూడవచ్చు. అంతేకాక, సుమారు 26 రకాల వన్య జంతువులను, 132 రకాల పక్షులను కూడా చూడవచ్చు.

ఎరావికులం నేషనల్ పార్క్

ఎరావికులం నేషనల్ పార్క్

ఇక్కడి వన్య జీవులకు వర్ష రుతువు సంతానోత్పత్తి సమయం. కనుక ఈ సమయంలో నేషనల్ పార్క్ యాజమాన్యం సందర్శకులను పార్క్ లోపలి కి అనుమతించాడు. ప్రధానంగా జనవరి - ఫిబ్రవరి నెలలు సందర్శనకు నిషేధం గా వుంటాయి.

రాజమల

రాజమల

మీ ఇరవై నాలుగు గంటల సమయంలో మీరు రాజమల కూడా చూడవచ్చు. ఇది ఎరావికులం నేషనల్ పార్క్ సమీపంలో వుంటుంది.

రాజమల

రాజమల

ఈప్రాంతంలో కూడా మీరు నీల గిరి థార్ జింకలను చూడవచ్చు. నివేదికల మేరకు నీలగిరి థార్ లలో సగానికి పైగా నటినల్ పార్క్ లోను, రాజమల లోను వున్నట్లు వెల్లడి అయింది.

రాజమల

రాజమల

రాజమలకు చుట్టూ పచ్చటి పర్వత శ్రేణులు ఎత్తుగా వుండి ప్రకృతి ప్రియులను రంజింప చేస్తే. హనీ మూన్ జంటలకు ఇది ఒక మంచి ప్రదేశం. ఫ్యామిలీ ట్రిప్ లు, విద్యార్ధుల ఎక్స్ కర్షన్ లు కూడా అధికంగానే వుంటాయి. సాహస ప్రియులకు ఇక్కడ ట్రెక్కింగ్ ఏర్పాట్లు కూడా కలవు.
Photo Courtesy: Jiths

ఎకో పాయింట్

ఎకో పాయింట్

మున్నార్ లో ఎకో పాయింట్ ఒక విశిష్ట మైన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం మున్నార్ టవున్ కు 13 కి. మీ. ల దూరంలో కలదు. ఇది ఒక నది ఒడ్డున కలదు. ఇక్కడ మీరు చప్పట్లు చరిస్తే, వాటి ప్రతి ధ్వని ఎంతో బాగా వినిపిస్తుంది.
Photo Courtesy: Vinayaraj

అనయరంకాల్

అనయరంకాల్

అనయరంకాల్ ప్రదేశం మున్నార్ నుండి 22 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ ఒక ప్రసిద్ధ డాం, సరస్సు, పచ్చటి తేయాకు తోటలు వుంటాయి.
Photo Courtesy: Rameshng

అనయరంకాల్

అనయరంకాల్

అనయరంకాల్ డాము కు పర్యాటకులు ఇండియా లోని దూర ప్రదేశాలనుండి కూడా వస్తారు.
Photo Courtesy: Rameshng

అనయరంకాల్

అనయరంకాల్

ఇక్కడ మీరు అందమైన ఏనుగుల గుంపులు చూడవచ్చు. అవి సమీప సరస్సులో నీటిని తాగుతూ వుంటాయి.

అనయరంకాల్

అనయరంకాల్

అనరయన్కాల్ డాము ము చుట్టూ దట్టమైన అడవులు , తేయాకు తోటలు కలవు. చక్కటి ప్రకృతి దృశ్యాలు, ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. తేయాకు తోటల నుండి వచ్చ్కే సువాసనలు ఈ ప్రదేశ అందాలతో బాటు మీకు మరింత ఆనందం కలిగిస్తాయి.
Photo Courtesy: Rameshng

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X