Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల తో ముడిపడి ఉన్న వెంకటేశ్వర ఆలయాలు !

తిరుమల తో ముడిపడి ఉన్న వెంకటేశ్వర ఆలయాలు !

By Mohammad

వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్ర ప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతి లో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు.

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలు కలిగిన ఆలయాలు మరో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ద్వారకా తిరుమల ఉండగా, మరొకటి తూర్పు గోదావరి కి చెందిన అప్పనపల్లి లో ఉన్నది. విశేషం ఏమిటంటే రెండు ఆలయాలు కూడా ఉభయగోదావరి జిల్లా లో ఉండటం.

ఇది కూడా చదవండి : ఏపి లో ఫ్యామిలీ తో వెళ్ళవలసిన ప్రదేశాలు !

తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు పై రెండు ఆలయాలను దర్శిస్తే సకలశుభాలు, శుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అసలే సెలవులు అయిపోతున్నాయ్ ..! దసరా వరకు వేచి చూడాలంటే మనవాళ్ళ కాదు కనుక ఈ తీర్థయాత్ర ట్రిప్ ను ఇప్పుడే మొదలుపెట్టి శ్రీనివాసున్ని దర్శించుకుందాం పదండి ..!

ట్రిప్ వేయండి ఇలా ..!

ట్రిప్ వేయండి ఇలా ..!

ట్రిప్ ఒక్కరు వెళితే బోర్ గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, కాలనీ లోని వారితో ఒక బృదంగా (5-10 మంది) ఏర్పడి వెళ్ళండి. సొంత వాహనాలు ఉన్నవారైతే ప్రాబ్లం లేదు లేకుంటే బస్సులు, రైళ్ళలో ప్రయానించండి. వీలైతే తూఫాన్ వాహనాన్ని, టాటా క్వాలిస్ వాహనాన్ని, ట్రావెల్ వాహనాలను అద్దెకు తీసుకొని బయలుదేరండి.. !

చిత్ర కృప : chrispit1955

ముందుగా తిరుపతి దర్శనం

ముందుగా తిరుపతి దర్శనం

తిరుపతి కి దేశంలోని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు / రైలు / విమాన సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు వ్యవస్థ కూడా చక్కగా ఉన్నది. తిరుపతి చేరుకున్నాక అక్కడ గల ఆలయాలను తప్పక సందర్శించండి.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి తిరుపతి రోడ్ ట్రిప్ జర్ని !

చిత్ర కృప : Click Away With Canon

గోవిందా .. గోవిందా !

గోవిందా .. గోవిందా !

తిరుపతి, తిరుమల పేర్లు వేరేమో కానీ ... రెండింటి ఆత్మ ఒక్కటే..! వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి గాంచినది. ఈ ఆలయం పురాతనమైనది మరియు దీని నిర్మాణ శైలి ద్రవిడ సంప్రదాయాన్ని పోలి ఉంటుంది.

చిత్ర కృప : Christian Lagat

గోవిందా .. గోవిందా !

గోవిందా .. గోవిందా !

సుమారు రెండున్నర ఎకరాల్లో విస్తరించిన ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నది. ఈ విగ్రహం జాతి రాళ్ళతో అలంకరించబడి ఉంటుంది.

చిత్ర కృప : desibantu db

గోవిందా .. గోవిందా !

గోవిందా .. గోవిందా !

తిరుమల కు కాలినడకన వెళ్ళే వారు ఉదయాన్నే వెళితే చుట్టూ ప్రకృతి దృశ్యాలను, ఘాట్ రోడ్, కొండ చరియలు చూసి ఆనందించవచ్చు. దారి పొడవునా విష్ణువు అవతారాలను, ఆంజనేయస్వామి ప్రతిమలను గమనించవచ్చు.

ఇది కూడా చదవండి : తిరుపతి మెట్ల మార్గం !

చిత్ర కృప : Praveen Kaliga

గోవిందా .. గోవిందా !

గోవిందా .. గోవిందా !

కాలినడకన వెళ్ళే టప్పుడు మీకు దర్శనం కౌంటర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి దర్శనం టికెట్ ను కొనుగోలు చేయవచ్చు. గాలిగోపురం, శ్రీవారి పాదాలు, నారాయణ స్వామి ఆలయాలు కాస్త ముందుకు వెళితే కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సెల్ ఫోన్, కెమెరా లు లోనికి తీసుకొని వెళ్ళరాదు. అవి పూర్తిగా నిషేధం.

చిత్ర కృప : surendra katta

శ్రీవారి దర్శనం

శ్రీవారి దర్శనం

శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు కంపార్ట్ మెంట్ లలో, క్యూ లైన్ లలో నిల్చుంటారు. కాలినడకన వచ్చే వారికి ఒక కంపార్ట్ మెంట్, లఘు దర్శనం, సర్వ దర్శనం .. ఇలా ఎన్నో దర్శనాలకి ఇంకొన్ని కంపార్ట్ మెంట్ లు ఉంటాయి. ఎలా పోయినా దేవుణ్ణి మాత్రం దర్శించుకుంటారు. తేడా ఒక్కటే చూడటంలో దగ్గర .. దూరం అంతే ..!

చిత్ర కృప : RadhaKrishna Balla

వీలుంటే చూడండి

వీలుంటే చూడండి

శ్రీవారి దర్శనం ముగించుకున్నాక సమయం ఉంటె కపిల తీర్థం, తలకోన చూడటం మరవద్దు. జలపాత సోయగాలు అద్భుతంగా ఉంటాయి. కపిల తీర్థంలో శివుని ఆలయం ఒక్కటే ఉంది. ఇక్కడికి ప్రవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే తలకోనకి కూడా ..!

ఇది కూడా చదవండి : అద్భుత జలపాతం ... తలకోన జలపాతం !

చిత్ర కృప : R Muthusamy

చిన్న తిరుపతి

చిన్న తిరుపతి

దర్శనం అయిపోయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 'చిన్న తిరుపతి' గా పిలువబడే ద్వారకా తిరుమల కి వెళ్ళండి. ద్వారకా తిరుమల కి విజయవాడ (100 కి. మీ), రాజమండ్రి (75 కి. మీ) నగరాలు దగ్గరలో ఉన్నాయి. అక్కడి నుండి ప్రభుత్వ బస్సులు సులభంగా లభ్యమవుతాయి.

చిత్ర కృప : Mahendra Patnaik

ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల ఆలయం దేశంలోని ఆలయాలన్నింటి లోకి భిన్నంగా ఉంటుంది. తిరుమల తిరుపతి (పెద్ద తిరుపతి) లో స్వామి వారికి మొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) లో తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతి లో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని భక్తులు, స్థానికుల నమ్మకం.

చిత్ర కృప : ajrao

ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల

తిరుపతి తో పోలిస్తే ద్వారకా తిరుమలలో దర్శనం కాస్త త్వరగానే జరుగుతుంది. గుడిలో ప్రవేశించేటప్పుడు ముందు తిరుపతి వలే శ్రీవారి పాదాలను నమస్కరించి మెట్లు ఎక్కాలి. ప్రధాన ఆలయానికి వెళ్ళేటప్పుడు మెట్ల పొడవునా ఆళ్వారుల ప్రతిమలు, అన్నమాచార్య విగ్రహం, సత్రాలు, కళ్యాణ మండపాలు గమనించవచ్చు.

చిత్ర కృప : Raghuram Pandugayala

ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల

ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు, గరుడ విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ గా వెలసిన వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వర స్వామి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయరు. ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత అడగండి..!

చిత్ర కృప : Kalyan Konduri

ద్వారకా తిరుమల దర్శనం

ద్వారకా తిరుమల దర్శనం

ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఆ రోజే స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవలు జరుగుతాయి. ఆలయానికి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కు మూసి 3 గంటలకు తెరుస్తారు.

ఇది కూడా చదవండి : ద్వారకా తిరుమల గురించి మరింత సమాచారం !

చిత్ర కృప : Manoj Kurup

బాల తిరుపతి

బాల తిరుపతి

పెద్ద తిరుపతి , చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా. దీనికి సమాధానం వైనతేయ నదీ తీరం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కలదు. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నాన మాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు.

చిత్ర కృప : syam_sundar_b

బాల తిరుపతి

బాల తిరుపతి

అప్పనపల్లి కాకినాడ కు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 85 కి. మీ ల దూరంలో మరియు అమలాపురం కు 35 కి. మీ ల దూరంలో కలదు. కాకినాడ నుండి నిత్యం ఒక ప్రభుత్వ బస్సు అప్పనపల్లి వరకు (కాకినాడ వయా యానాం మరియు బోడసకుర్రు మీదుగా) నడుస్తుంది. అలాగే కాకినాడ నుండి రేవులపాలెం మీదుగా (110 కి.మీ) కూడా అప్పనపల్లి చేరుకోవచ్చు.

చిత్ర కృప : apasar

బాల తిరుపతి

బాల తిరుపతి

అమలాపురం మీదుగా వచ్చే వారు వయా అంబాజీపేట మీదుగా 35 కి. మీ ల దూరం ప్రయాణించి అప్పనపల్లి చేరుకోవచ్చు. అన్నట్లు ఫెర్రీ సౌకర్యం కూడా ఉన్నది. అమలాపురం నుండి బోడసకుర్రు ఫెర్రి ఎక్కి 13 కి. మీ దూరంలో ఉన్న అప్పనపల్లి చేరుకోవచ్చు.

చిత్ర కృప : InternationalMissions

బాల తిరుపతి

బాల తిరుపతి

అప్పనపల్లి దేవాలయం మూడువైపులా గోదావరి నది తో, మరోవైపు బంగాళాఖాతం సముద్రంతో చుట్టబడి ఉంటుంది. చుట్టూ అందమైన పంట పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, తాటి చెట్లు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి. శ్రీ బాల బాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని, అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లి ని దర్శించి పునీతులవుతున్నారని యాత్రికుల విశ్వాసం.

చిత్ర కృప : apasar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X