Search
  • Follow NativePlanet
Share
» »అతి తక్కువ ధరలలో మిమ్మల్ని ఆకర్షించే గోవా షాపింగ్ మార్కెట్లు...

అతి తక్కువ ధరలలో మిమ్మల్ని ఆకర్షించే గోవా షాపింగ్ మార్కెట్లు...

షాపింగ్ చేయాలంటే సామాన్యంగా అందరికీ ఎంతో ఇష్టంగా వుంటుంది. అందులోనూ యువతీయువకులకు ఇష్టమైనది షాపింగ్. వారాంతం వచ్చిందంటే చాలు ఆ షాపింగ్ మాల్ కు ఈ షాపింగ్ మాల్ కు అని తిరుగుతూ వుంటారు.

By Venkatakarunasri

షాపింగ్ చేయాలంటే సామాన్యంగా అందరికీ ఎంతో ఇష్టంగా వుంటుంది. అందులోనూ యువతీయువకులకు ఇష్టమైనది షాపింగ్. వారాంతం వచ్చిందంటే చాలు ఆ షాపింగ్ మాల్ కు ఈ షాపింగ్ మాల్ కు అని తిరుగుతూ వుంటారు.

గోవా తన అద్భుత సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గోవా కర్ణాటకకు దగ్గరలో వున్న రాష్టం. కాబట్టి పర్యాటకులు తమ అమూల్య సమయాన్ని గోవా అనే అందమైన ప్రదేశంలో గడపటానికి ఇష్టపడతారు.

గోవా అంటే కేవలం బీచ్ లు, పార్టీలు, హోటల్లే కాకుండా కొన్ని అనువైన షాపింగ్ మాల్స్ కూడా వున్నాయి.గోవాలో షాపింగ్ అని ప్రసిద్ధి పొందిన నిర్దిష్టమైన స్థాలాలు వున్నాయి. ఇక్కడ చేసే షాపింగ్ మీకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.

ప్రస్తుత వ్యాసంలో గోవాలో కొన్ని ప్రసిద్ధమైన షాపింగ్ మార్కెట్ లు గురించి తెలుసుకుంటాం. ఒక్కసారి గోవాకి తప్పకుండా వెళ్లి ఈ షాపింగ్ మార్కెట్ కు వెళ్లి ఆనందించండి

అతి తక్కువ ధరలలో మిమ్మల్ని ఆకర్షించే గోవా షాపింగ్ మార్కెట్లు...

అంజునా మార్కెట్

అంజునా మార్కెట్

ఈ అంజునా మార్కెట్ లో వారంలో బుధవారం రోజు మాత్రమే షాపింగ్ చేయటానికి అవకాశం వుంటుంది. ఈ మార్కెట్ గోవాలో మొదటి అత్యుత్తమమైన షాపింగ్ మార్కెట్.

అంజునా మార్కెట్

అంజునా మార్కెట్

ఈ మార్కెట్లో కాశ్మీరీ, గుజరాతి మరియు టిబెటియన్ అంగళ్ళ యొక్క సమాహారం ఇక్కడ చూడవచ్చును.ఇక్కడ దొరకని వస్తువు లేదంట. అతి తక్కువ ధరలలో అతి ఎక్కువ వస్తువులను షాపింగ్ చేయవచ్చును.

పి. ఎం నైట్ మార్కెట్

పి. ఎం నైట్ మార్కెట్

బీచ్ యొక్క సమీపంలో ఈ అందమైన పి. ఎం మార్కెట్ వుంది. ఈ మార్కెట్ లో అనేక ధగ ధగమైన వస్తువులు అదేవిధంగా పదార్ధాలు అమ్ముతారు. ఈ పి. ఎం నైట్ మార్కెట్ వారంలో శనివారం మాత్రం తెరుస్తారు.

పి. ఎం నైట్ మార్కెట్

పి. ఎం నైట్ మార్కెట్

ఈ మార్కెట్ లో షాపింగ్ చేసేవారికి అనేక విధాలైన దుస్తులు, ఆభరణాలు, బ్యాగ్స్, సాంబారు పదార్ధాలు ఇంకా అనేక రకాలైన వస్తువులు షాపింగ్ చేయవచ్చును.

PC:Ipshita B

మార్ గోవా మార్కెట్

మార్ గోవా మార్కెట్

ఈ మార్ గోవా మార్కెట్ లో ఏ వస్తువులు షాపింగ్ చేయాలో మీకు అర్థం కాదు. అంటే ఆ వస్తువులను చూసి మైమరచిపోతారు. ఆ వస్తువులు చూడటానికి కన్నులపండువగా వుంటుంది.

మార్ గోవా మార్కెట్

మార్ గోవా మార్కెట్

ఇక్కడ మసాలా పదార్ధాలు, ఆభరణాలు, దుస్తులు, గిఫ్ట్ ఐటమ్స్ మొదలైనవి ఇక్కడ షాపింగ్ చేయవచ్చును. ఈ మార్కెట్ గోవాలో వుండే అత్యుత్తమ మార్కెట్లలో ఒకటి. దీనినే గాంధి మార్కెట్ అని కూడా పిలుస్తారు.

PC:sara marlowe

క్యాలంగుట్ మార్కెట్

క్యాలంగుట్ మార్కెట్

క్యాలంగుట్ మార్కెట్ లో షాపింగ్ చేసేవారికి ఒక స్వర్గంలాగా వుంటుంది. ఈ మార్కెట్ లో దుస్తులకు సరిపోయే ఆభరణాలు, ఇంకా అనేక విధాలైన వస్తువులు కొనుగోలు చేయవచ్చును.

ఇక్కడ లోహము, చర్మం అదేవిధంగా మట్టితో తయారుచేసిన ధగ ధగమైన అలంకారిక వస్తువులు అలాగే దస్తులు కొనుగోలు చేయావచ్చును.

PC:Extempore

క్యాలంగుట్ మార్కెట్

క్యాలంగుట్ మార్కెట్

ఇక్కడ అన్ని విధాలైన వస్తువులు వుండటం చేత దేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ స్థలానికి వచ్చి శాపింగ చేస్తారు. విశేషమేమిటంటే ఈ షాపింగ్ మార్కెట్ లో నిరంతరం షాపింగ్ చేయటం వల్ల రక రకాలైన కొత్త వస్తువులు తెచ్చి అమ్ముతారు.

పనజిం మార్కెట్

పనజిం మార్కెట్

షాపింగ్ ఆహ్లాదంగా మరింతగా ఎంజాయ్ చేయాలని మీ మనస్సులో వుంటే పనజిం మార్కెట్ కు ఒకసారి వెళ్ళండి. ఈ మార్కెట్ లో వివిధ వ్యాపారస్థులు వారు తయారుచేసిన అత్యంత అందమైన వస్తువులను అతి తక్కువ ధరలకే విక్రయించే అత్యుత్తమ మార్కెట్ ఇది.

PC:Pixelmattic WordPress Agency

 పనాజీ మార్కెట్

పనాజీ మార్కెట్

ఈ మార్కెట్లో ఆభరణాల నుంచి రోజువారీ అవసరమైన ఆహారపదార్ధాలు కూడా ప్రతిఒక్కటీ కొనుగోలు చేయవచ్చును. ఈ పనాజీ మార్కెట్ లో గోవా యొక్క అద్భుత షాపింగ్ జ్ఞాపకాలుగా వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X