Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు సమీపంలోని 8 ఉత్తమ వారాంతపు పర్యాటక ప్రదేశాలు !

బెంగళూరు సమీపంలోని 8 ఉత్తమ వారాంతపు పర్యాటక ప్రదేశాలు !

By Super Admin

మీకు తెలియని చూడని ఇండియాలోని 6 దేవాలయాలు ఇవే !మీకు తెలియని చూడని ఇండియాలోని 6 దేవాలయాలు ఇవే !

బెంగళూరు మహానగరం నేడు ప్రపంచస్థాయి పర్యాటకులకు ఉత్తమ గమ్య స్థానంగా ఉన్నది. దేశ, విదేశాల నుండి వచ్చే యాత్రికులు బెంగళూరు నగరంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో పర్యటించడానికి ఆసక్తిని చూపుతుంటారు. ఇది ఓ రకంగా బెంగళూరు పర్యాటకానికి ఊతమిచ్చే అంశమే !

బెంగళూరు నగరం చుట్టుపక్కల సందర్శించటానికి, సాహసాలు చేయటానికి ఎన్నో అత్యుత్తమ ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటకులు వీకెండ్ లలో కుటుంబసభ్యలతో, స్నేహితులతో ఇక్కడికి వచ్చి సరదాగా గడిపివెళుతుంటారు. మరి బెంగళూరు సమీపంలో ఉన్న ఆ పర్యాటక స్థలాలు ఏవో మీకు తెలుసుకోవాలని లేదూ ..!

దండేలి

దండేలి

దండేలి ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న కుగ్రామం. ఎప్పుడైనా ఒత్తిడి తగ్గించుకునేందుకు ఒంటరి ప్రదేశాలకు వెళ్లాలనిపిస్తే దండేలి చక్కటి పరిష్కారం. ఇది దట్టమైన అడవి, విభిన్నమైన జీవ సముదాయాలకు నిలయం. సాహస యాత్రికులకు జంగల్ సఫారీ, రివర్ రాప్టింగ్ వంటి క్రీడలు కలవు. ఇక్కడి రిసార్టులు లు, హోటళ్లు సొంత ఇంటిని తలపిస్తాయి.

చిత్ర కృప : Naveen Kumar

దండేలి ఎలా చేరుకోవాలి ?

దండేలి ఎలా చేరుకోవాలి ?

దండేలి చేరుకోవటం ఎలా ?

దండేలి హోటళ్ల వసతి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Karthik Narayana

గండి కోట

గండి కోట

గండికోట బెంగళూరు మహానగరానికి 280 కిలోమీటర్ల దూరంలో కలదు. గండికోట కడప జిల్లాకే తలమానికం. మూడువైపుల కొండలు, లోయలు, ఇంకోవైపు పెన్నా నది ఎల్లలుగా ఉన్నాయి. ఇటువంటి అపురూప, అద్భుత దృశ్యకావ్యం గండికోట సొంతం. 40 అడుగుల సింహ ద్వారం, చెక్కుచెదరని తలుపులు, ఉక్కు కవచాలు కోట పటిష్టతకు నిలువుటద్దాలు. ట్రెక్కింగ్ ద్వారా చేరుకొనే ఈ కోట మార్గం మిమ్మలను ఎంతగానో మైమరిపిస్తుంది.

చిత్ర కృప : KRISHNA SRIVATSA NIMMARAJU

గండికోట చేరుకోవటం ఎలా ?

గండికోట చేరుకోవటం ఎలా ?

గండి కోట ఎలా చేరుకోవాలి

కడప హోటళ్లు కొరకు ఇక్కడ క్లిక్క్ చేయండి

చిత్ర కృప : rkashyap

హొన్నెమర్దు

హొన్నెమర్దు

హొన్నెమర్దు ప్రఖ్యాత జోగ్ ఫాల్స్ కు 20 కిలోమీటర్ల దూరంలో కలదు. సాహస క్రీడలు, నీటి క్రీడలు ఇష్టపడేవారికి ఈ ప్రదేశం ఎంతో ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ రాప్టింగ్ , స్విమ్మింగ్, ట్రెక్కింగ్ వంటి క్రీడలను ఆచరించవచ్చు. సమీపంలో చిత్తర ఆర్ట్ వర్క్ కి ప్రసిద్ధి గాంచిన గడిమనే వీలుంటే సందర్శించండి.

చిత్ర కృప : agnisagar

హొన్నెమర్దు చేరుకోవటం ఎలా ?

హొన్నెమర్దు చేరుకోవటం ఎలా ?

హొన్నెమర్దు ఎలా చేరుకోవాలి ?

హొన్నెమర్దు సమీప హోటళ్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : toufeeq hussain

బైలకుప్పే

బైలకుప్పే

బైలకుప్పే కూర్గ్ లేదా కొడుగు జిల్లాలో ఉన్నది. ఇండియాలో ధర్మస్ధల తర్వాత ఇది టిబెటన్ల రెండవ అతి పెద్ద స్ధావరంగా చెప్పవచ్చు. ఇక్కడ వేలాది టిబెట్ దేశీయులు శరణార్ధులుగా ఆశ్రయం పొందుతున్నారు. బైల కుప్పేలో ప్రధాన ఆకర్షణ గోల్డెన్ టెంపుల్ లేదా నండ్రోలింగ్ మొనాస్టరీ. బంగారు రంగులో ఉన్న 40 అడుగుల పొడవైన పద్మసంభవ, బుద్ధ, అమితాయుస్ విగ్రహాలు చక్కగా అలంకరించబడి చూసేందుకు అందంగా ఉంటాయి.

చిత్ర కృప : Mikhail Esteves

బైలుకుప్పే చేరుకోవటం ఎలా ?

బైలుకుప్పే చేరుకోవటం ఎలా ?

బైలుకుప్పే ఎలా చేరుకోవాలి ?

బైలుకుప్పే సమీప హోటళ్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Self Drive Trips

కాబిని

కాబిని

బెంగళూరు నగరం నుండి 163 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాబిని వన్య జంతువులకు ప్రసిద్ధి గాంచినది. దట్టమైన అడవులు, నది ప్రవాహాలు, ఎత్తుపల్లాలు వెరసి ఈ ప్రదేశాన్ని మరింత రమణీయంగా చెప్పబడుతున్నది. ఎలెఫెంటా సఫారీ, జంగల్ సఫారీ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.

చిత్ర కృప : Sumeet Malhotra

కాబిని చేరుకోవటం ఎలా ?

కాబిని చేరుకోవటం ఎలా ?

కాబిని ఎలా చేరుకోవాలి ?

కాబిని హోటళ్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Vinoth Chandar

కలపెట్ట

కలపెట్ట

కలపెట్ట బెంగళూరు నగరానికి 285 కిలోమీటర్ల దూరంలో కేరళలోని వాయనాడ్ జిల్లాలో కలదు. అందమైన ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, విశాలమైన కాఫీ తోటలు కలిగి ఉన్నది ఈ ప్రదేశం. మతపర అభిమానులకు పూజలు చేసేందుకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. లవ్ సింబల్ లో ఉన్న సరస్సు (చెంబుర శిఖరం) తప్పక సందర్శించాలి.

చిత్ర కృప : Sankara Subramanian

కలపెట్ట చేరుకోవటం ఎలా ?

కలపెట్ట చేరుకోవటం ఎలా ?

కలపెట్ట ఎలా చేరుకోవాలి ?

కలపెట్ట హోటళ్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : kiran kumar

కుద్రేముఖ్

కుద్రేముఖ్

కుద్రేముఖ్ బెంగళూరు నగరానికి 285 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కుద్రేముఖ్ లో ప్రకృతిని వర్ణించటం సబబు కాదు. ఇక్కడ పచ్చని మైదానాలు, ప్రకృతి, పశ్చిమ కనుమలు, జలపాతాలు, పర్వతాలు ఉండటంతో జీవ వైవిధ్యతతో విరాజిల్లుతున్నది. గర బిజి జీవితాలతో విసిగి వేసారిన వారికి ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించి పూర్తి విశ్రాంతిని అందిస్తుంది.

చిత్ర కృప : Arun Keerthi K. Barboza

కుద్రేముఖ్ చేరుకోవటం ఎలా ?

కుద్రేముఖ్ చేరుకోవటం ఎలా ?

కుద్రేముఖ్ ఎలా చేరుకోవాలి ?

కుద్రేముఖ్ హోటళ్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చిత్ర కృప : Dhruvaraj S

నృత్య గ్రామ్

నృత్య గ్రామ్

బెంగళూరు చుట్టుపక్కల ఉన్న వీకెండ్ ప్రదేశాలలో నృత్య గ్రామ్ ఒకటి. నృత్యగ్రామ్ పరిసరాలు ఎంతో కళాత్మకంగా, అద్భుతంగా చూడముచ్చటగా ఉంటాయి. ఆల్రెడీ చూసేసిన వారికి కూడా ఇది ఒక కొత్త ప్రదేశంగానే కనిపిస్తుంది. బెంగళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో, హీసర ఘట్ట గ్రామానికి చేరువలో ఈ గ్రామం ఉన్నది. బెంగళూరు నుండి ప్రతి ఒక్కరూ సులభంగా నృత్యగ్రామ్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : pupilinblow

నృత్యగ్రామ్ చేరుకోవటం ఎలా ?

నృత్యగ్రామ్ చేరుకోవటం ఎలా ?

నృత్యగ్రామ్ ఎలా చేరుకోవాలి ?

చిత్ర కృప : pupilinblow

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X