బెంగుళూర్ లో మహాదేవుని ఆలయాలు అనేకం ఉన్నాయి. కొన్ని పాత శకానికి చెందినవి మరికొన్ని ఆధునిక రోజులకు చెందిన ఆలయాలు వున్నాయి. శివరాత్రి 2017 ఆలయ పర్యటన కోసం మీరు దేవాలయాల జాబితాను చూడండి.
బెంగుళూర్ లో గల ప్రసిద్ధ మత పర్యాటక ప్రదేశాలలో కొన్ని ఇవ్వబడ్డాయి. అవి గవి గంగాధరేశ్వరాలయం, కెంప్ ఫోర్ట్ శివ ఆలయం మరియు కాడు మల్లేశ్వరాలయం.
ఇక్కడ వివిధ శివ ఆలయాలు మరియు ఆలయ వివరాలు ఇవ్వబడ్డాయి!
హలసూరు సోమేశ్వర ఆలయం:
ఉల్సూర్ లో గల హలసూరు సోమేశ్వర ఆలయం సందర్శనలో మీకు మొట్టమొదటి ఆలయం. ఈ ఆలయం చోళుల కాలం నాటిది. బెంగుళూర్ లో ఇది అతి ప్రాచీన దేవాలయం. దేవాలయంలో విజయనగర కాలం నాటి శిల్ప శైలి ప్రభావం కనిపిస్తుంది.
Photo Courtesy: Dineshkannambadi
గవి గంగాధరేశ్వరాలయం :
గవి పురంలో గల ఒక పురాతన గుహ దేవాలయం గవి గంగాధరేశ్వరాలయం. ఆలయంలో మరో ఆసక్తికరమైన దృగ్విషయం ఏమిటంటే మకర సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం నంది విగ్రహం కొమ్ములు గుండా సూర్యకాంతి నేరుగా లింగం మీద ప్రసరిస్తుంది. ఈ దృశ్యము పండుగ రోజున ప్రతి సంవత్సరం జరుగుతుంది.
Photo Courtesy: Pavithrah
కెంప్ ఫోర్ట్ శివ ఆలయం :
కెంప్ ఫోర్ట్ శివ ఆలయం బెంగుళూర్ లో ప్రసిద్ధి చెందిన శివ ఆలయం. ఈ విగ్రహం సుమారు 65 అడుగుల ఎత్తు వుంది. ఈ ఆలయంలో ఇంకా ఒక పెద్ద వినాయకుడి విగ్రహం, శివుని యొక్క ఇతర రూపాలు కూడా ఉన్నాయి. ఇది బెంగళూరు ఓల్డ్ విమానాశ్రయం రోడ్ లో గలదు. శివరాత్రికి ప్రతి ఒక్కరు తప్పక సందర్శించవలసిన దేవాలయాలలో ఇది ఒకటి.
Photo Courtesy: Rameshng
ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం :
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో 12 చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి. ఇది భారతదేశం అంతటా గల ఇతర జ్యోతిర్లింగ దేవాలయాలను సూచిస్తుంది. శ్రీనివాసపుర ఓంకార్ హిల్స్ వద్ద ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం వుంది.
Photo Courtesy: Sagar Sakre
కాడు మల్లేశ్వరాలయం :
ఈ ఆలయం మల్లేశ్వరంలో వుండటం వల్ల దీనికి కాడు మల్లేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. పరమశివుడికి అంకితమైన 17 వ శతాబ్దం నాటి ఆలయం. నందీశ్వర తీర్థం ఈ ఆలయంకు మరో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నీరు నిరంతరం నంది విగ్రహం నోటి నుండి ప్రవహిస్తూ శివలింగం మీద పడుతుంది. ఈ నీరు వృషభవతి నది మూలం అని చెప్తారు.
బేగూర్లో గల నాగేశ్వర ఆలయం :
నాగేశ్వర ఆలయం గంగా రాజవంశం పాలనలో నిర్మించారు. కొన్ని కన్నడ శాసనాలు బెంగుళూరు నగరం గురించి చెపుతాయి. ఈ పురాతన ఆలయానికి 890 ఎ.డి కి చెందిన శాసనాలలో చారిత్రక ఆధారం ఉంది. తరువాతి కాలంలో చోళ రాజవంశం యొక్క పాలనలో కొన్ని మరమత్తులు జరిగినవి.
Photo Courtesy: Dineshkannambadi
కోటే జలకంఠేశ్వర స్వామి ఆలయం :
కోటే జలకంఠేశ్వర స్వామి ఆలయం చోళ రాజవంశానికి చెందిన బెంగుళూర్ లో గల మరో ఆలయం. ఇది కలాసిపాల్య బస్ స్టాండ్ కు సమీపంలో ఉంది. ఆలయంలో జలకంఠేశ్వర స్వామి, పార్వతి మరియు కైలాసనాథార్ అనే ముగ్గురు దేవుళ్ళు గల పవిత్ర స్థలం.
Photo Courtesy: Siddhartha Sahu
ధర్మగిరి మంజునాథ స్వామి ఆలయం :
ధర్మగిరి ఆలయం బనశంకరి బిడిఎ కాంప్లెక్స్ కి సమీపంలో వుంది మరియు ఇది ఒక ప్రసిద్ధ సీరియల్ షూటింగ్ స్థానం. ఈ ప్రదేశం అనేక కన్నడ సీరియల్స్ లో ప్రజాదరణ పొందింది.