Search
  • Follow NativePlanet
Share
» »బన్నెరఘట్ట నేషనల్ పార్క్ కు ఒక రోజు విహారయాత్ర

బన్నెరఘట్ట నేషనల్ పార్క్ కు ఒక రోజు విహారయాత్ర

చెన్నై దక్షిణ భారతదేశంలో గల ప్రధాన పర్యాటక స్థలము. భారతదేశంలో ఉత్తమ ప్రయాణ గమ్యస్థానాలలో ఒకటి. ఆకర్షణీయమైన బీచ్ లు, దేవాలయాలు, స్మారక అద్భుతాలు మరియు ఆధునిక ఆకర్షణలు చెన్నైలో ఉన్నాయి.

By Venkata Karunasri Nalluru

బన్నెరఘట్ట నేషనల్ పార్క్

ఇది నెలాఖరు, ఖర్చులు తగ్గించుకొనవలసిన సమయం. కానీ చాలా తక్కువ ఖర్చుతో కొత్త ప్రదేశాలను చూడాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే మా మనస్సులో కూడా ఒక రోజు ఎక్కడికైనా పార్క్ కు విహారయాత్ర వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. అలాంటి ఒక ప్రదేశం కోసం మా అన్వేషణ ప్రారంభమైంది. మేము, నగర పరిధిలో ఉన్న బన్నెరఘట్ట నేషనల్ పార్క్ చూడాలని నిర్ణయించుకున్నాము.

ఇక్కడ బన్నెరఘట్ట గురించి మరింత తెలుసుకోవచ్చు:

బెంగళూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం దేశంలోనే తొలి సీతాకోకచిలుక పార్క్ హౌస్. 1971 లో స్థాపించబడిన ఈ పార్క్ 104,25 కి.మీ లు విస్తీర్ణత కలిగి వుంది.

Bannerghatta National Park

PC: wikipedia.org

మేము ఉదయం 8:30 గం. లకు బయలుదేరాము. బన్నెరఘట్ట నేషనల్ పార్క్ చేరుకోటానికి నగరం నుండి 45 లేక 60 ని. సమయం పడుతుంది. జాతీయ పార్క్ కు వెళ్ళే మార్గమధ్యంలో మేము "మీనాక్షి టెంపుల్" ను చూడాలని నిర్ణయించుకున్నాం.

దేవాలయంలో గోపుర శిఖరాలు చాలా పెద్దవిగా మధురైలోని ప్రసిద్ధి చెందిన మీనాక్షి ఆలయంలో మాదిరిగా ఉన్నాయి. ఆలయం లోపల కూడా భక్తులకు స్వాగతం పలుకుతూ ఒక పెద్ద గోపురం ఉంది.

Bannerghatta National Park

PC: wikipedia.org

భక్తితో ఆలయంను దర్శించుకొన్న తర్వాత మేము చాలా త్వరగానే మా గమ్యం చేరుకున్నాం. పార్క్ లో మా వాహనం నిలుపుటకు పార్కింగ్ టికెట్ తీసుకున్నాం. తర్వాత మేము ఎంట్రీ టిక్కెట్లు తీసుకొనుటకు టికెట్ కౌంటర్ వైపు వెళ్లాం.

జాతీయ పార్క్ లో పర్యాటకులకు సఫారీ తీసుకొని జూ సందర్శించడం చాలా ఆనందాన్ని అందిస్తుంది, మేము అదే ఎంచుకున్నాం. టికెట్ సఫారీ మరియు జూ ప్రవేశానికి టిక్కెట్ ధర 260 రు.

మేము టిక్కెట్లు తీసుకొని సందర్శకులను ఎక్కించుకోటానికి సిద్ధంగా వున్న బస్సుల వైపుకు మేము వెళ్లాం. బస్సు ఎక్కిన తర్వాత జంతువులను దగ్గర నుండి చూచుటకు వీలుగా కిటికీలకు సమీపంలో కూర్చున్నాం. తల, చేతులు బయట పెట్టకుండా కిటికీలకు గ్రిల్ల్స్ వుంటాయి.

బన్నెరఘట్ట టూరిజం గురించి మరింత సమాచారం:

Bannerghatta National Park

PC: wikipedia.org

గ్రాండ్ సఫారి:
సఫారీ సమయంలో, మేము చాలా సమీపంలో సింహాలు, పులులు, జింకలు, ఎలుగుబంట్లును చూశాము. ఈ సమయంలో మాకు ఇలా అనిపించింది. మేము బోనులో ఉన్నాం కానీ జంతువులం కాదు అని అనిపించింది. సఫారీ వ్యవధి రెండు గంటలు. ఈ రెండు గంటల సమయం చూసిన తర్వాత మనల్ని జూ ఎంట్రీ పాయింట్ కు తిరిగి చేరుస్తారు .

జంతుప్రదర్శనశాల:
ఇక్కడ వివిధ రకాల జంతువులు, పక్షులు మరియు సరీసృపాలు వుంటాయి. మొట్టమొదటగా మేము ఇక్కడ చూడవలసినది జాతీయ పక్షి నెమలి. నెమలి పురివిప్పిన అందాలు మేము చాలా దగ్గర నుండి చూశాం. ఇది ఎంతో ఆనందాన్ని కల్గించింది. ఇక్కడికి రావటం వల్ల ప్రకృతిలో గల ఇన్ని అందాలు చూడగలిగామని అనిపించింది.

Bannerghatta National Park

PC: wikipedia.org

ఇప్పుడు మేము కొంచెం సేపు నిశ్చేష్టులయ్యాం. మేము అలా నడుచుకుంటూ పులులు వున్న స్థలం వైపుకు దగ్గరగా వెళ్లాం. మేము అలా నడుచుకుంటూ వెళ్లి 3, 4 పులులను చూశాం. కొన్ని అందులో నిద్రపోతున్న పులులు కూడా వున్నాయి.

ఇప్పుడు చూడబోయేది భారతదేశ మరియు ఇతరదేశాలకు సంతతికి చెందిన వివిధ పక్షుల ఆవరణము. అక్కడ వివిధ రంగులతో కూడిన మకాక్స్ చాలా అధ్బుతంగా వున్నాయి. మేము తర్వాత వివిధ రకాల జింకలు, ఎమూ పక్షులు వున్న దిశగా కదిలాం. ఇది దాదాపుగా హిమాలయ ఎలుగుబంట్లు వున్న ఆవరణానికి దగ్గరగా వుంది. నాకు సడన్ గా జంగిల్ బుక్ లో బాలూ పరుగులు గుర్తుకు వచ్చాయి.

జూ ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఈ పార్క్ అంతా చూస్తుంటే మాకు చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. మేము ఉయ్యాలలూగటం, విశాల ఆవరణంలో స్వేచ్చగా పరుగులు తీయటం మొదలైన తియ్యని జ్ఞాపకాలు వచ్చాయి.

Bannerghatta National Park

PC: wikipedia.org

సీతాకోక చిలుకల పార్క్:
తరువాత మేము సీతాకోకచిలుక పార్క్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. సీతాకోకచిలుక పార్క్ ను సులభంగా గుర్తించవచ్చు, పార్క్ ప్రవేశ ద్వారంలో ఒక రెక్కలు విప్పిన సీతాకోకచిలుక ఆకారంలో ఒక బొమ్మ ఉంటుంది.

మేము అలా నడుచుకుంటూ వెళ్లాం. అక్కడ అన్ని వైపుల నుండి సీతాకోకచిలుకలు చుట్టుముట్టి ఉన్నాయి. ఇది చూసిన తర్వాత మాకు మరిచిపోలేని ఒక అందమైన అనుభవాన్ని కలిగించింది. క్రింద సూచించిన లింక్ ద్వారా మీరు దీని గురించి మరింత సమాచారం తెలుసుకొనవచ్చును.

భారతదేశంలో చూడవలసిన నాలుగు సీతాకోక చిలుకల పార్క్ లు :

సీతాకోకచిలుకలు యొక్క వివిధ రకాల శిలాజాలను తప్పక చూడవలసిన ఒక మ్యూజియం. ఈ పార్క్ ఫోటోలు తీయటానికి ఒక అద్భుతమైన ప్రదేశం. మీ చుట్టూతా సీతాకోకచిలుకలు గుమికూడి వుంటాయి. ఇది మీకు చెప్పలేని ఆనండం కలిగిస్తుంది. చూడటానికి ఎంతో సహజంగా, అందంగా వుంటుంది.

ఈ నేషనల్ పార్క్ మాకు చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. ఈ పార్క్ మాకు ఎంతో ఎంజాయ్ మెంట్ ను కలిగించింది. మేము ఇక్కడ చూసిన అన్ని ప్రదేశాల జ్ఞాపకాలను మా వెంట తీసుకొని మా స్థలానికి తిరిగి వెళ్లాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X