Search
  • Follow NativePlanet
Share
» »అగర నరసింహ స్వామి ఆలయానికి ఒకరోజు ట్రిప్

అగర నరసింహ స్వామి ఆలయానికి ఒకరోజు ట్రిప్

అగర నరసింహ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో కొల్లెగలలో గల పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం గూర్చి చాలా మందికి తెలీదు. ఈ ఆలయం బెంగుళూర్ నుండి 150 కి.మీ ల దూరంలో గల "మాంబల్లి" అనే గ్రామంలో ఉన్నది.

By Venkata Karunasri Nalluru

రూట్ 1 (NH948): బెంగుళూర్ - కనకపురా - మాలవల్లి - కొల్లెగల - మాంబల్లి

రూట్ 2 (NH275): బెంగుళూర్ - రాంనగర - మద్దూరు - కె.యం దొడ్డి - మాలవల్లి - శివనసముద్ర - మాంబల్లి

దూరం మరియు సమయం : బెంగుళూర్ నుండి 150 కి.మీ; 3 గంటల (ట్రాఫిక్ ఆధారంగా)

మీరు ఈ వారాంతంలో ఫ్రీగా ఉంటారా? అయితే మీరు కొల్లెగలలో గల "మాంబల్లి" అనే గ్రామంలో వున్న పురాతన మరియు ఏకైక నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేసుకోండి. ఈ ఆలయం గురించి చాలామందికి తెలియదు. మీకు పురాతన ఆలయ చరిత్రను అన్వేషించడం మీద ఆసక్తి ఉంటే ఈ ఆలయం చాలా ఉపయోగపడుతుంది. మీరు NH275 మీదుగా వెళ్తే అనేక ఇతర దేవాలయాలు చూడొచ్చు.

నరసింహ స్వామి దేవాలయం గురించి మరింత వివరాలు:

agara narsimha swamy temple

తెల్లవారుజాములో ప్రయాణం ప్రారంభించటం ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో బెంగుళూర్ నగరంలో ట్రాఫిక్ చాలా తక్కువగా వుంటుంది. మీరు మార్గమధ్యంలో మైసూర్ రోడ్లోని ఏ రెస్టారెంట్లు వద్దనైనా ఆగి అల్పాహారం తిని బయల్దేరవచ్చు. మీరు వెరైటీ రుచిని కోరుకుంటే "కామత్ లోకరుచి" లో అల్పాహారం తీసుకోవటం ఉత్తమం. అంతేకాకుండా మీరు అడిగాస్ లేదా కదంబంలో కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఇక్కడ వేడి ఇడ్లీలతో పాటు రుచికరమైన సాంబార్ మరియు మంచిగా పెళుసైన వడలు వడ్డిస్తారు.

agara narsimha swamy temple

PC: Pratheepps

మీ వాహనం మార్గ మధ్యంలో ఆపడానికి సమయం ఉంటే మాలూర్ అప్రమేయ స్వామిని సందర్శించి కెంగల్ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా దర్శించవచ్చు. ఈ ఆలయాలు చాలా అద్భుతంగా వుంటాయి. మీరు మాంబల్లిలోని బసవన్న గుడి వీధి చేరుకోవడానికి అలా ప్రయాణిస్తూ వుంటే కుడివైపున ఆలయ వివరాలతో ఒక బోర్డు కనిపిస్తుంది. అదే అగర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.

బ్రాహ్మణ సమాజానికి చెందిన పూజారులు ఆధిపత్యం వహించటం వల్ల ఈ ఆలయంను "అగర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం" అంటారు. పాతకాలం నాటి ఇళ్లు మీకు పురాతన కాలం నాటి సంగతులు గుర్తుచేస్తూ కనువిందు చేస్తాయి.

agara narsimha swamy temple

PC : Brunda Nagaraj

అగర నరసింహ స్వామి ఆలయ నిర్మాణం:

ఈ ఆలయం చోళ రాజవంశ కాలంలో నిర్మించారు. ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉంది. మీరు ఆలయం చుట్టూ దర్శిస్తే దేవాలయ గోడలపై విష్ణుమూర్తి పది అవతారాలు చెక్కి వుండటం గమనించవచ్చు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి యొక్క చిన్న ఆలయం ఉంది. అయితే ఈ ఆలయం పాములు కారణంగా మూసివేయబడినది ఇక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఉంది. దాని క్రింద అనేక నాగదేవతలు ప్రతిష్ట చేయబడినది.

agara narsimha swamy temple

PC : Brunda Nagaraj

అగర నరసింహ స్వామి విగ్రహం:

అగర నరసింహస్వామి విగ్రహం త్రేతా యుగానికి చెందినది. ఈ స్థలం సందర్శించడం 15 పవిత్ర పుణ్యక్షేత్రాలు సందర్శించడంతో సమానం అని నమ్ముతారు. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఒక యోగ భంగిమలో డేగ మీద కూర్చొని నాలుక పెద్దగా తీసి "హిరణ్యకశ్యప" అనే రాక్షస రాజును సంహరిస్తున్నట్లుగా దర్శనమిస్తూ వుంటుంది. కుడివైపున నరసింహస్వామి యొక్క గాన శ్లోకాలను భక్తితో ఆలపిస్తూ వుండే నారద మహర్షి యొక్క శిల్పంను చూడచ్చు మరియు ఎడమవైపున నరసింహస్వామి యొక్క కీర్తిని కొనియాడుతూ వుండే ప్రహ్లాదుని శిల్పంను చూడచ్చు. నరసింహస్వామి హృదయంలో కొలువున్న లక్ష్మీదేవి తన భక్తులను ఆశీర్వదిస్తూ వుంటుంది.

agara narsimha swamy temple

PC : Brunda Nagaraj

తలకాడులోని పంచాలింగేశ్వరస్వామి ఆలయం:

ఈ ఆలయాన్ని సందర్శించేటప్పుడు అవసరమైన పూజాసామాగ్రిని మీ వెంట తీసుకొని వెళ్ళండి. అక్కడ పూజా సామాగ్రి, పూలు అమ్మే అంగళ్లు చాలా తక్కువగా వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X