Search
  • Follow NativePlanet
Share
» »అమర్ కంటక్ - నర్మదా నది జన్మస్థలం !

అమర్ కంటక్ - నర్మదా నది జన్మస్థలం !

By Super Admin

ఆ ఆలయంలో శివలింగం కంటికి కనపడదట !ఆ ఆలయంలో శివలింగం కంటికి కనపడదట !

చుట్టూ దట్టమైన అడవి ... దాటుకుంటూ ముందుకు వెళితే దేవదారు, టేకు వంటి పెద్ద పెద్ద వృక్షాలు .. ఇంకా ఏవో పేర్లు తెలియని చెట్లు, పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు. ఉదయం పూట వెళ్లాలంటేనే గుండెల్లో దడ, వణుకు పుడుతుంది. కటిక చీకటి, గంభీరంగా కనపడే వాతావరణం ... ధైర్యం చేసి అలాగే ముందుకు వెళితే కనుచూపు మేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చని సౌందర్యం మీ కళ్ళముందర కానవస్తాయి. దాన్ని చూస్తే అంతవరకు మీరు పడ్డ శ్రమ దిగదుడుపే ! ఇంతటి అందాన్ని ఒకే చోట దాచుకున్న ఆ ప్రదేశమే అమర్ కంటక్.

అమర్ కంటక్ హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది జన్మ స్థలం. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో కలదు. ఉవెత్తున ఎగిసి పడే జలపాత అందాలతో, అద్భుత శిల్పకళ లతో ఉట్టిపడే దేవాలయాలతో అమర్ కంటక్ అలరారుతున్నది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : మధ్య ప్రదేశ్ లోని ఆకర్షణలు ... సంక్షిప్తంగా !

పురాణ గాధ

పురాణ గాధ

పాపపరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే.. శివుడు ప్రత్యక్షమై ‘నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. మరి, నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవర'ని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వత రాజు తన కుమారుడైన అమర్‌ కంటక్‌ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమతల్లి దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ.

చిత్ర కృప : LRBurdak

నర్మదా నది

నర్మదా నది

నర్మదా నది స్థానిక మైకల్‌ కొండల్లో పుట్టి వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.

చిత్ర కృప : Mani M

నర్మదామాత గుడి

నర్మదామాత గుడి

నర్మదానది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. నర్మదామాత ఆలయం క్రీ. శ 10-11 వ శతాబ్దం మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది.

చిత్ర కృప : Uttam Kumar Chatterjee

నర్మదామాత గుడి

నర్మదామాత గుడి

ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. శివరాత్రి ఇక్కడ జరిగే జాతరలలో పెద్దది. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Wietse Jongsma

నర్మదామాత గుడి

నర్మదామాత గుడి

నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుంది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

చిత్ర కృప : R Singh

కపిలధార

కపిలధార

అమర్‌ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కపిల ధార అనే జలపాతం ఉన్నది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. 100 అడుగుల ఎత్తు నుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

చిత్ర కృప : Yajuvendra Upadhyaya

ఆధ్యాత్మక కేంద్రాలు

ఆధ్యాత్మక కేంద్రాలు

నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్‌ జైన్‌ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతాలనూ వీక్షించవచ్చు.

చిత్ర కృప : LRBurdak

అమర్ కంటక్ ఎలా చేరుకోవాలి ?

అమర్ కంటక్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బిలాస్పూర్ విమానాశ్రయం(117 కి. మీ) అమర్ కంటక్ కు సమీపాన ఉన్నది.

రైలు మార్గం

పేంద్ర రోడ్డు(17 కి. మీ) అమర్ కాంటక్ కు సమీపాన ఉన్నది. ఇదేకాక అమర్ కంటక్ కు సమీపాన కరొంజి అనే మరో రైల్వే స్టేషన్(245 కి. మీ) కలదు. ఇక్కడి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం

అమర్ కంటక్ కు అనుప్పూర్(48 కి. మీ) నుండి రెగ్యూలర్ బస్సులు, టాక్సీ లు లభ్యమవుతాయి. షాదోల్, ఉమారియా, బిలాస్పూర్ , జబల్పూర్, రేవా ప్రాంతాల నుండి కూడా బస్సు సర్వీసులు నడుస్తాయి.

చిత్ర కృప : buddha13684

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X