Search
  • Follow NativePlanet
Share
» »షిర్డీకి భక్తుల యాత్ర - శ్రీ సాయిబాబా నివాసం

షిర్డీకి భక్తుల యాత్ర - శ్రీ సాయిబాబా నివాసం

షిర్డీ మహారాష్ట్రలో అహమ్మద్ నగర్ జిల్లాలో ఉన్నది. షిర్డీకి వెళ్ళటం అనేది ప్రతి సాయి భక్తుడు యొక్క కల, వారి జీవితకాలంలో ఒకసారి అయినా ఈ దివ్య స్థలాన్ని సందర్శించాలని కోరుకుంటారు.

By Venkata Karunasri Nalluru

అంతుచిక్కని సోన్ భండార్ గుహ రహస్యం !అంతుచిక్కని సోన్ భండార్ గుహ రహస్యం !

షిర్డీకి వెళ్ళటం అనేది ప్రతి సాయి భక్తుడు యొక్క కల, వారి జీవితకాలంలో ఒకసారి అయినా ఈ దివ్య స్థలాన్ని సందర్శిస్తారు. ప్రతి ఒక్కరూ సాయి బాబా యొక్క దీవెనలను కోరుకుంటారు. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు తరలి వస్తారు. షిర్డీ మహారాష్ట్రలో అహమ్మద్ నగర్ జిల్లాలో ఉన్నది. షిర్డీ కోపర్గావ్ నుండి 15 కి.మీ. దూరంలో ఉంది మరియు అహమ్మద్ నగర్ నుండి 83 కి.మీ. దూరంలో ఉంది. షిర్డీ ఒకప్పుడు ఒక చిన్న గ్రామం, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు దర్శించుకొనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. భక్తులు ఒక సారి షిర్డీ గడ్డపై అడుగుపెడితే వారి కర్మలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా వారి అన్ని ప్రార్థనలు సాయిబాబాకు వినిపిస్తుంది మరియు వారి కోరికలన్నీ తీరుతాయి.

shirdi trip

Image Courtesy : Brunda Nagaraj

షిర్డీ చేరుకోవడానికి:

పాత రోజులలో షిర్డీ వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నది. కానీ ఈ రోజుల్లో షిర్డీ చేరుకోటానికి అనేక మార్గాలు వున్నాయి. షిర్డీకి డైరెక్ట్ గా ట్రైన్స్ వున్నాయి. లేకపోతే పూనేకి విమానంలో వెళ్లి అక్కడ్నుంచి టాక్సీ లేదా సొంత కార్లలో ప్రయాణించవచ్చు. అలాగే షిర్డీ నాసిక్ కు చాలా దగ్గరగా వుంది. నాసిక్ నుండి చాలా సిటీబస్సులు షిర్డీకి అందుబాటులో ఉన్నాయి. షిర్డీ లోపల ప్రయాణించటానికి రిక్షా లేదా టాంగాలో వెళ్ళవచ్చును.

పూణే నుండి షిర్డీ దూరం: 199.9 కి.మీ

నాశిక్ నుండి షిర్డీ దూరం: 87.5 కి.మీ

shirdi trip

Image Courtesy : Brunda Nagaraj

షిర్డీలో గల వసతులు:

శ్రీ సాయిబాబా సంస్థాన్ వారు సాయిబాబా భక్తులకు అనేక వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మీరు షిర్డీ సందర్శించటానికి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారి గదులు కోసం ఎదురుచూస్తూ ఉంటే ముందుగా మీరు ఒక ప్లాన్ (ప్రణాళిక) ప్రకారంగా గదులు బుక్ చేసుకోవాలి. షిర్డీ సంస్థాన్ వారు భక్తుల కోసం ఆన్ లైన్ లో గదులు బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించారు. రూములు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి మరియు షిర్డీ ఆలయానికి మీరు నడచివెళ్లేంత దూరంలో ఉన్నాయి.

షిర్డీలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు వారి సాయి ఆశ్రమం, ద్వారవటి మరియు న్యూ భక్తి నివాస్ వంటి హోటల్సే కాకుండా ఆలయం చుట్టూ పుష్కలంగా ఇతర హోటల్స్ కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో మీరు బస చేసిన గదుల నుండి ప్రయాణం చేయడానికి అందుబాటులో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలు ఉన్నాయి.

shirdi trip

Image Courtesy : Photographer in Shirdi

షిర్డీలో ఫుడ్ :

సాయిబాబా సంస్థాన్ వారు షిర్డీ సందర్శించే ప్రతి ఒక్కరి కోసం ఆలయ ప్రాంగణంలో తినేందుకు నామమాత్రపు ధరకు ఆహారాన్ని భక్తులకు అందిస్తోంది. ఆహారంలో రొట్టెలు (రోటీస్), వెజిటబుల్ కర్రీ, దాల్ మరియు రైస్ వుంటాయి. అంతేకాకుండా మీకు అద్భుతమైన ఉత్తర-భారత, దక్షిణ-భారత ఆహార సేవలందించే ఇతర హోటళ్లు కూడా అందుబాటులో వున్నాయి.

shirdi trip

Image Courtesy : Brunda Nagaraj

షిర్డిలో చేయవలసినది:

షిర్డికి వెళ్ళినప్పుడు "ద్వారకామాయి"ని తప్పక దర్శించాలి. ఇక్కడ సాయిబాబా వున్నప్పుడు ఉపయోగించిన వస్తువులు అన్నీ ప్రత్యక్షంగా చూడవచ్చు. సాయిబాబా ధరించిన కఫ్నీ, వంట చేయటానికి ఉపయోగించిన వంట పాత్రలు, మరియు సాయిబాబా వెలిగించిన ధుని (పవిత్రమైన అగ్ని) చూడవచ్చు. ఈ ధుని ఇప్పటికీ వెలుగుతూనే వుంటుంది. ధునిలోని విబూధిని బాబా భక్తులకు ప్రసాదంగా అందించేవారు. దీని వల్ల అనేక బాధలు, రోగాలు మటుమాయమయ్యేవి.

సాయిబాబా చివరి రోజుల్లో విశ్రాంతి తీసుకొన్న మంచం మరియు స్నానం చేయుటకు ఉపయోగించిన బండ, ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక "చావడి"ని దర్శించాలి.

1. షిర్డీలో పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి దేవాలయం మరియు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తప్పక సందర్శించాలి.

2. సాయి ఆలయం నుంచి నడచివెళ్ళగల దూరంలో వున్న "ఖండోబా" ఆలయాన్ని సందర్శించండి. ఇక్కడ ఈశ్వరుడు ఖండోబా రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటాడు.

3. పురాణాల ప్రకారం సాయిబాబా షిర్డీలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదట "మహాల్సాపతి" సాయిబాబాని దర్శించుకున్నాడు.

4. షిర్డీలో జరిగే హారతిని మిస్ కాకుండా హారతిలో పాల్గొనండి.

5. సాయిబాబా జీవిత చరిత్రను మరాఠీలో లయబద్ధంగా పాడే భక్తిగీతాలు చెవులకు వినటానికి శ్రావ్యంగా వుంటాయి.

6. సమాధి మందిరంలో గల సాయిబాబా యొక్క నవ్వుతూ వుండే విగ్రహాన్ని ఒక్క షిర్డీవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి దర్శించుకుంటారు. బాబా రూపం చాలా మనోహరమైన తేజస్సు కలిగి వుంటుంది. బాబాను చూసిన ఆనందంలో మీకు తెలీకుండానే మీ కాళ్ళ వెంట నీరు కారుతుంటుంది అంటే ఆశ్చర్యపడనక్కరలేదు.

7. హారతి వివరాలు ఆన్లైన్లో లభ్యమవుతాయి. భక్తులు వారి సౌలభ్యం ప్రకారం సమయం ఎంచుకొని హారతిలో పాల్గొనవచ్చును.

మీరు షిర్డీలో గుర్తించుకోవలసిన సాధారణ విషయాలు:

1. ఆలయం లోపల నడిచి వెళ్ళే ప్రతి భక్తుడు ఖచ్చితంగా "సాయి రామ్" అనే పదాన్ని ఉచ్ఛరించాలి.

2. మీరు షిర్డీ సందర్శించినప్పుడు వీధి కుక్కలకు పాలు పోస్తే మీరు చేసిన కర్మలు తీరుతాయి.

3. ఇతర నగరంలో ధరలు చాలా ఎక్కువ వున్న దానిమ్మ పండ్లు షిర్డీలో చాలా తక్కువ ధరకే అమ్ముతారు.

వేల కొలదీ భక్తులు షిర్డీ వచ్చి సాయిబాబాను దర్శించుకుంటారు. షిర్డీ యాత్ర ఒక ఆధ్యాత్మిక యాత్ర.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X