Search
  • Follow NativePlanet
Share
» »మార్గోవా - నమ్మలేని ఆశ్చర్యాల పుట్ట !!

మార్గోవా - నమ్మలేని ఆశ్చర్యాల పుట్ట !!

మార్గోవా దక్షిణ గోవాలో ఒక చిన్న పట్టణం. గోవాలోని అనేక బీచ్ లకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక పేరొందిన చర్చిలు మరియు దేవాలయాలు కలవు. ఈ ప్రదేశాన్ని ముస్లింలు కూడా ఇష్టపడతారు. షియా ఇమాం ఇస్మాయిలి ఖోజా జమత్కానా మరియు అక్వేమ్ లకు ముస్లిం పర్యాటకులు తరచుగా వస్తారు. బెనాలిం, కోల్వా, వర్కి, బీటుల్, మజోర్డా బీచ్ లకు దగ్గరగా ఉంటుంది. కొనుగోళ్ళకు అనుకూలం. ఇక్కడి రెస్టరెంట్లలో అసలైన గోవా ఆహారాలు లభిస్తాయి. ఈ ప్రదేశంలో రుచికరమైన గోవా సముద్ర ఆహారాలు దొరుకుతాయి. వసతి తేలికగా దొరుకుతుంది. సమీపంలోని ఫిషర్ మాన్ వార్ఫ్ కూడా చూడవచ్చు. ఇక్కడున్న ప్రధాన ఆకర్షణలలో దూద్ సాగర్ మిక్కిలి ఖ్యాతి గడించినది.

మార్గోవా - నమ్మలేని ఆశ్చర్యాల పుట్ట !!

గోవా అసలుసిసలైన వంటకం

Photo Courtesy: GoaHolidayHomes.com

నేటి ఫ్రీ కూపన్లు : బుక్కింగ్ ఖజానా వద్ద హోటళ్లు బుక్కింగ్ ల మీద 50 % ఆఫర్ పొందండి

దూద్ సాగర్ జలపాతాలు

ఈ ఆకట్టుకునే జలపాతం పేరుకి అనువాదం ‘పాల సముద్రం', ఇది సముచితమైన పేరు, నీళ్ళలాగా కాకుండా పాల వాలే కనిపించే ఈ జలపాతం రాళ్ళ కింద ఉదృతంగా ప్రవహిస్తుంది. పానాజీ నుండి షుమారు 60 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక-గోవా సరిహద్దు మధ్య ఉన్న ఈ జలపాతం చాలా అందమైన ప్రదేశం, ఇది ఈ ప్రాంతంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ.

దీనికి సంబంధించిన పురాణం

పురాణాల ప్రకారం, దూద్‌ సాగర్ సమీపంలోని ఒక ఆవిలోని రాజభవనంలో అందమైన యువరాణి నివసించేదని చెప్తారు, ఆమె దీనికి సమీపంలో ఉన్న సరస్సులో స్నానం చేసేది, స్నానం చేసిన తరువాత ఆమె తన బంగారపు జగ్గులో తియ్యటి పాలు తాగేది. అదేసమయంలో, ఒక యువరాజు ఆమె స్నానం చేస్తున్నపుడు చూస్తున్నట్లు గమనించి ఇబ్బంది పడింది, తనను చూడకుండా అతనిని నిరోధించింది, ఆమె అతని దృష్టిని నిరోధించడానికి జగ్గు నుండి పరిశుభ్రమైన పాలతో ఒక తెరను ఏర్పాటుచేసింది. అవే తియ్యని పాలు దూద్‌ సాగర్ జలపాతాల వలె ఈరోజుకీ ఈ రాళ్ళ కింద ప్రవహిస్తున్నట్లు చెప్తారు.

మార్గోవా - నమ్మలేని ఆశ్చర్యాల పుట్ట !!

దూద్ సాగర్ జలపాతం వద్ద పర్యాటకులు

Photo Courtesy: Premnath Thirumalaisamy

జలపాతం, దాని పరిసరాలు

దూద్ సాగర్ జలపాతాలు, రోడ్ల పరిసరాలు గోవా అటవీ శాఖ వారిచే నిర్వహించబడతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన జలపాతాలలో ఒకటిగా పేర్కొనబడింది, ఇది భారతదేశంలోని ఐదవ అతిపొడవైన జలపాతం, దీని మొత్తం ఎత్తు 310 మీటర్లు. ఇది ప్రత్యేకంగా వర్షాకాల సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే, వర్షాకాలంలో రహదారులు నీటితో మూసుకుపోతాయి, అక్టోబర్ తరువాత మాత్రమే ప్రజా రవాణాకు అనువుగా ఉంటుంది. ఒక కొలనుగా తయారైన ఈ ప్రవహించే నీరు ప్రజలు వారి స్వంత పూచీకత్తుతో స్నానాలు ఆచరించవచ్చు. ఈ జలపాతాలు సౌత్ గోవా లోని కొల్లెం లో భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉంది, ఇది వివిధ రకాల జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులకు నిలయమైన ఈ అడవి దట్టమైన ఆకురాల్పులతో చుట్టబడి ఉంది.

ఈ జలపాతం మీదుగా ఓ రైల్వే బ్రిడ్జ్ ఉంది ఉంది. రైల్లో ప్రయాణిస్తూ... బ్రిడ్జి పై నుండి దూద్‌సాగర్‌ అందాలను వీక్షిస్తే... కలిగే అనుభూతి అంతాఇంతా కాదు. దూద్‌సాగర్‌ చేరుకోవాలంటే.. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులెమ్‌ రెైల్వే స్టేషన్‌ నుండి వెళ్లాలి. ఇక్కడికి బస్సుమార్గం కూడా ఉంది. లోండా, మడ్‌గాఁవ్‌ రెైల్వేమార్గంలో ఉంది కులెమ్‌ రెైల్వే స్టేషన్‌. ఇక్కడికి దగ్గరలోని మిరాజ్‌ జంక్షన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రెైళ్ళు ఆగుతాయి. అంతేకాకుండా... వాటర్‌ఫాల్స్‌ దగ్గర్లో కూడా ఓ చిన్న రైల్వే స్టేషన్‌ ఉంది. ఇక్కడ కొన్ని ప్యాసింజర్‌ రెైళ్ళు అతితక్కువ సమయం పాటు (రెండు నిమిషాలు మాత్రమే) ఆగుతాయి.

మార్గోవా - నమ్మలేని ఆశ్చర్యాల పుట్ట !!

దూద్ సాగర్ జలపాతం వద్ద రెండు నిమిషాలపాటు నించున్న రైలు

Photo Courtesy: Rajesh Warange

దూద్‌ సాగర్‌ వద్ద పర్వతారోహణ కూడా ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. పర్వహతా రోహాకులు విశ్రాంతి తీసుకునే ఆశ్రాయలు ఉన్న ఈ జలపాతానికి సమీపంలో ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది. అయితే, ముందుగా వచ్చిన పర్వతారోహకులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి.

హోలీ స్పిరిట్ చర్చ్

దూద్ సాగర్ జలపాతానికి దగ్గరలో ఉన్న హోలీ స్పిరిట్ చర్చ్ మొదటగా 1564 సంవత్సరంలో నిర్మాణం చేశారు. ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే చాలు హోలీ స్పిరిట్ చర్చి ఫీస్ట్ వేడుకలు, మాస్ ప్రార్ధనలు నిర్వహిస్తుంది. ఈ వేడుకలు చుట్టూ ప్రక్కలతో పాటుగా , దగ్గరలో ఉన్న మార్గోవా పట్టణం సైతం అంతా ఖ్యాతి గాంచాయి. వర్షాకాలం మొదలైందంటే, గోవాలోని ప్రజలు చాలావరకు ఈ ఫీస్ట్ కు హాజరై అక్కడ అందించబడే, ఎండు చేపలు, కూరలు, ఇతర ఆహార పదార్ధాలు ఆరగిస్తారు. సాధారణంగా ఈ వేడుకలు అయిదు నుండి ఆరో రోజులపాటు జరుగుతాయి. బోరోక్ శిల్పశైలి తో నిర్మించబడిన ఈ చర్చి పొడవైన గోపురాలు కలిగి ఉంటుంది. పరిశుభ్రమైన తెల్లని ప్రాంగణం, లోపలి భాగాలు క్రిస్టల్స్ తో అలంకరించబడి ఉంటాయి.ఈ చర్చి సుమారుగా 3000 క్రిస్టియన్ కుటుంబాలచే ప్రార్ధించబడుతూంటుంది.

మార్గోవా - నమ్మలేని ఆశ్చర్యాల పుట్ట !!

ప్రఖ్యాతి గాంచిన స్పిరిట్ చర్చి

Photo Courtesy: Ashley Monteiro

యాత్రికులు, పర్యాటకులు ఈ చర్చిని వారంలోని ఏడు రోజులపాటు దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశానికి చేరటం కూడా తేలికే. క్యాబ్లు, బస్సులు పనాజిం, వాస్కోడా గామా ల నుండి మార్గోవా కు అందుబాటులో ఉంటాయి. నార్త్ గోవా లోని ప్రాంతాలు అంటే కండోలిం, బాగా మరియు కాలన్ గూటే, మాపూసా ప్రాంతాల యాత్రికులు లేదా పర్యాటకులకు ప్రయాణం కొంత దూరం అయినప్పటికి ఇది చూడదగిన ప్రదేశం. చర్చి సందర్శన అనంతరం, పర్యాటకులు ఒకప్పటి చిన్నా గోవా గ్రామం నుండి ఒక పెద్ద పట్టణం వరకు అభివృధ్ధి చెందిన మార్గోవా పట్టణం చూసి ఆనందించవచ్చు.

మార్గోవాకి ఎలా చేరుకోవాలి ??

రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.

రైలు ప్రయాణం

గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.

విమాన ప్రయాణం

దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.

మార్గోవా - నమ్మలేని ఆశ్చర్యాల పుట్ట !!

ప్రధాన రైల్వే స్టేషన్

Photo Courtesy: weggi.ch

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X