Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 40 సినిమా షూటింగ్ లొకేషన్లు !

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 40 సినిమా షూటింగ్ లొకేషన్లు !

By Mohammad

సినిమా లు మన జీవితంలో భాగమైపోయాయి. పాతకాలంలో అయితే సినిమా షూటింగ్ లు కేవలం దేశానికే పరిమితంగా ఉండేవి. ఆ తరువాత వచ్చిన పెను మార్పుల కారణంగా నవీన పోకడలకు అలవాటు పడి విదేశాలలో చిత్రీకరిస్తున్నారు. బ్ల్యాక్ అండ్ వైట్ సినిమాలలో చెప్పుకోదగ్గ షూటింగ్ ప్రదేశాలు ఉండేవి దేశంలో. ఆ తరువాత వచ్చిన కలర్ సినిమాలలో కూడా చూపించారనుకోండీ!

తమిళనాడు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలు దాదాపు దక్షిణ భారతదేశం లో ఉన్న అందమైన ప్రదేశాలలో సినిమాలను తీసి చూపిస్తుంటారు. ఆ అందాలను చూసి ఈర్షపడి మన దర్శక, నిర్మాతలు కూడా ఆ లొకేషన్లలో గత ఐదారేళ్ళ నుంచి సినిమాలు తీయటం మొదలుపెట్టారు. అంతకు ముందు బాగానే ఉండే లెండీ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి, మరలా ఇప్పుడు తేరుకున్నారు. డబ్బులు మిగిల్చుకున్నారు.

ఎన్నో సినిమాలు దక్షిణ భారతదేశంలో తీసి ఆస్కార్ కొట్టారు. ఉదాహరణకు 'లైఫ్ ఆఫ్ ఫై'. ఏ ప్రపంచ దేశాలకు మన దేశం తక్కువనా ? అదేం కాదు సినిమా తీస్తే అక్కడి అందాలను సినిమాలో చూపించాలి. అవి చూసి ప్రేక్షకులు మన దేశానికి వస్తే మన పర్యాటకం బాగుపడి ఆర్థికంగా ఎదుగుతామని వారికి కుళ్ళు అందుకే తీయటానికి జంకుతుంటారు.

దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా దర్శక, నిర్మాతలు సినిమాలు తీయటానికి ఇష్టపడే ప్రదేశాలు ఒకేసారి పరిశీలిస్తే ..

మున్నార్

మున్నార్

మున్నార్ కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కలదు. ఇదొక సుందర హిల్ స్టేషన్. పడమటి కొండలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలతో చుట్టబడి ఉంటుంది. ఇక్కడ తరచూ సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. ఆస్కార్ అవార్డు పొందిన 'లైఫ్ ఆఫ్ ఫై' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడే తీశారు.

చిత్రకృప : Bimal KC

కొల్లం

కొల్లం

కేరళలోని కొల్లం జీడిపప్పులకు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో కూడా సినిమాలను షూట్ చేస్తుంటారు. ముఖ్యంగా అష్టముడి సరస్సును షూటింగ్ లొకేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సరస్సులో విహారం, ఊగిసలాడే చెట్ల మధ్య , ఏపైన తాటి చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిత్రకృప : Arunvrparavur

అలెప్పి

అలెప్పి

అనేకమైన సరస్సులతో విశ్రాంతిని అందించే ప్రదేశం అలెప్పి. మంత్ర ముగ్ధులను చేసే బ్యాక్ వాటర్స్ అందాలు, పడవ ఇల్లులు, తీవాచీలా కనిపించే పచ్చదనం, తాటి చెట్ల మధ్యలో వంపులు తిరిగే కాలువలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. కుట్టనాడ్, అలెప్పి బీచ్, రాజా భవనాలు మొదలైనవి చూడదగ్గవి.

చిత్రకృప : Lenish

వళచల్ మరియు అతిరాప్పిల్లి జలపాతం

వళచల్ మరియు అతిరాప్పిల్లి జలపాతం

పై రెండు జలపాతాలు షోలయార్ పర్వత శ్రేణులలోని అడవులలో ఉన్నాయి. చలకుడి నది అటవీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ 84 అడుగుల ఎత్తు నుండి కింద పడే సీన్ చూడముచ్చటగా ఉంటుంది. పక్కనే ఉన్న సోదరి 'వళచల్ జలపాతం' తప్పక చూడదగినది. జలపాతాల వద్ద జనతా గ్యారేజ్, బాహుబలి, గురు మొదలైన సినిమాలు తీశారు.

చిత్రకృప : Dilshad Roshan

బెకాల్ కోట

బెకాల్ కోట

'బొంబాయి' సినిమా గుర్తుందా ? అందులో ఊరికే .. చిలకా పాట గుర్తుందా ? ఆ సినిమాను ఇక్కడే కాసర్గోడ్ లోని బెకాల్ కోటలో చిత్రీకరించారు. బెకాల్ కోట రెండు తాటి తోపుల మధ్య ఎగసి పడే అలలతో ఉంటుంది. కేరళలోని అతిపెద్ద కోటలలో ఇది ఒకటి.

చిత్రకృప : Hari Prasad Nadig

హిల్ పాలస్

హిల్ పాలస్

కేరళలో అతిపెద్ద పురావస్తు మ్యూజియం ఈ హిల్ పాలస్. కొచ్చిలోని ఒక ప్రాంతమైన త్రిపునితుర లో ఈ ప్యాలెస్ ఉంది. 'మణిచిత్రతజు' అనే మలయాళం సినిమాలోని కొన్ని ప్రసిద్ధ సన్నివేశాలను ఈ హిల్ పాలెస్ లో చిత్రీకరించారు.

చిత్రకృప : Maheshbabu.nair

వాగమోన్

వాగమోన్

వాగమోన్ ఇడుక్కి, కొట్టాయం జిల్లాల మధ్య కలదు. పచ్చని మైదానాలు, నీలపు కొండలు, పారే నదులు, ఊరికే జలపాతాలు, దట్టమైన అడవులు ఈ ప్రదేశాన్ని ఒక అద్భుతంగా మార్చాయి. రెగ్యులర్ గా ఎదో మళయాళ చిత్రం ఇక్కడ తీస్తుంటారు. తెలుగులో పవన్ నటించిన 'కొమరం పులి' వాగమోన్ లోనే తీశారు.

చిత్రకృప : Anand2202

తలాసేరి

తలాసేరి

కేరళలోని తలాసేరి కేకులు, బేకరీలకు పుట్టినిల్లు. కాస్తా తీరానికి దగ్గర ఉండటం చేత ఈ ప్రదేశంలో బీచ్ లు ఉన్నాయి. మలబార్ తీర మకుటం అని తలాసేరి కి పేరు. చర్చీ లు, ఆలయాలు, పార్కులు, భవంతులు మొదలైనవి చూడదగినవి. ఎన్నో మలయాళం సినిమా షూటింగ్ లు ఇక్కడ జరుపుకొని విజయాన్ని సాధించాయి.

చిత్రకృప : Sunaina Kunju

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్ కర్ణాటకలో కలదు. ఇది షరావతి నది నుండి ఏర్పడుతుంది. 800 అడుగుల ఎత్తు నుండి పడే ఈ జలపాతాలు వేలాది పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇప్పటి వరకు లింగా(తమిళ్), కుంకి(తమిళ్), ముంగారు మలె (కన్నడం) చిత్రాలను షూట్ చేశారు.

చిత్రకృప : Kiran Sagara

కొడగు

కొడగు

కొడుగు కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఇది సముద్రమట్టానికి 900 - 1700 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీనిని 'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా' గా పిలుస్తారు. ఇక్కడ కన్నడ సూపర్ హిట్ మూవీ ముంగారు మలె, బాలీవూడ్ మూవీ 7 ఖూన్ మాఫ్ చిత్రాలను షూట్ చేశారు. తోటలు, టీ, కాఫీ ఎస్టేట్ లు, అడవులు, లోయలు, కొండలు, జలపాతాలు చూడదగ్గవి.

చిత్రకృప : Kalidas Pavithran Follow

హంపి

హంపి

చారిత్రక నేపధ్యమున్న ప్రదేశం హంపి. ఇది కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో కలదు. జాకీచాన్ నటించిన హాలీవుడ్ మూవీ 'ది మిత్', బాలీవుడ్ చిత్రం విక్రమార్కుడు రీమేక్ 'రౌడీ రాథోడ్', టాలీవుడ్ మూవీ 'పౌర్ణమి', 'చందమామ' చిత్రాలను హంపి లో షూట్ చేశారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన హంపిలో దేవాలయాలు, శిల్ప సంపద సందర్శకులకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

చిత్రకృప : brunda rao nagaraj

బెంగళూరు

బెంగళూరు

బెంగళూరు కర్ణాటక రాష్ట్ర రాజధాని. ఇక్కడ చిత్రీకరించటానికి ఎన్నో లొకేషన్లు ఉన్నాయి. కబ్బన్ పార్క్, ఉద్యాన వనాలు, షాపింగ్ మాల్స్, లాల్ బాగ్ గార్డెన్ మొదలైనవి వాటిని కొన్ని. బెంగళూరు డేస్ సినిమాలో లో చూపించే గార్డెన్ లలో కొన్ని బెంగళూరులోనివే !

చిత్రకృప : prashantby Follow

బాదామి గుహలు

బాదామి గుహలు

బాదామి గుహలు కర్ణాటక రాష్ట్రంలోని బాదామి కోట జిల్లాలో కలవు. చాళుక్యుల కాలం నాటి ఎన్నో ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నాలుగు గుహలు ఉన్నాయి. అందులో మూడు హిందువులది కాగా, నాల్గవది జైనులది. గురు, రౌడీ రాథోడ్ వంటి బాలీవూడ్ చిత్రాలు ఇక్కడే షూట్ చేశారు.

చిత్రకృప : Sanyam Bahga

బెంగళూరు ప్యాలెస్

బెంగళూరు ప్యాలెస్

బెంగళూరు ప్యాలెస్ బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్నది. ఇది బెంగళూరులోని ప్యాలెస్ రోడ్, వసంతనగర్ లో కలదు. రాజప్రాసాదం, అందులోని ఇంటీరియర్ డిజైన్, దర్బారు హాలు, ఫొటోగ్రఫీలు, గదులు చూడదగ్గవి. వారాంతంలో సాయంత్రం వేళ సంగీత కచేరీలు నిర్వహిస్తారు. ఇక్కడ బెతాబ్, మార్డ్ మరియు షాలిమార్ వంటి బాలీవూడ్ చిత్రాలతో పాటు వెంకటేష్ నటించిన మసాలా చిత్రం షూట్ చేశారు.

చిత్రకృప : Brian Evans

రామనగరం

రామనగరం

మీకు బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ 'షోలే' గుర్తుందా ? దాదాపు 90% సినిమా షూటింగ్ కర్ణాటకలోని రామనగరం ప్రాంతంలో తీశారు. ఈ ప్రదేశం కొండ ప్రాంతం కనుక చుట్టూ కొండలే కనిపిస్తాయి. బర్డ్ వాచింగ్, పర్వతారోహణ వంటివి చేపట్టవచ్చు. బెంగళూరు నుండి 54 కిలోమీటర్ల దూరంలో కలదు.

చిత్రకృప : L. Shyamal

కొప్పల్

కొప్పల్

మీరు 'చైనా గేట్' చిత్రం చూసారా ? అందులోని కొన్ని దృశ్యాలను కొప్పల్ లో తీశారు. ఇదే ప్రదేశంలో ఇంకా నాయక, అమానత్ సినిమాలు కూడా షూట్ చేశారు. ఇక్కడి దేవాలయాలు ఇసుక శిలలతో నిర్మించబడి పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

చిత్రకృప : Ravibhalli

నంది హిల్స్

నంది హిల్స్

బాలీవూడ్ చిత్రం 'జో భి కర్వా లో' సినిమా మరియు రెగ్యులర్ గా కన్నడ సినిమాలు నంది హిల్స్ లో షూటింగ్ చేస్తుంటారు. నంది హిల్స్ బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4851 అడుగుల ఎత్తున కలదు. నంది టెంపుల్, టిప్పూస్ డ్రాప్, యోగానందీశ్వర టెంపుల్, అమృత సరోవర్, గాంధీ ఆశ్రమం చూడదగినవిగా ఉన్నాయి.

చిత్రకృప : Harsha K R

బలమురి ఫాల్స్

బలమురి ఫాల్స్

బలమురి ఫాల్స్ మానవ నిర్మిత జలపాతాలు మరియు బెంగళూరు నగరవాసులకు ఒక చక్కటి వారాంతపు విహారంగా ఉన్నాయి. కావేరి నది మీద నిర్మించిన చెక్ - డ్యామ్ కారణంగా ఈ కృతిమ జలపాతాలను ఏర్పాటు చేశారు.

తీసిన సినిమాలు : రాజా హిందుస్తానీ, పాకీజ మరియు అనేక కన్నడ సినిమాలు.

చిత్రకృప : Brunda Nagaraj

గంగావతి

గంగావతి

గంగావతి తుంగభద్ర నది తీరాన, హంపి - ఆనెగొంది (హనుమంతుడు జన్మించిన ఊరు) ప్రదేశాలకు చేరువలో కలదు. నాయక్, చైనా గేట్ చిత్రాలను షూట్ చేశారు.

పొల్లాచి

పొల్లాచి

పొల్లాచి సినిమా షూటింగ్ లకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటి వరకు సుమారు 1500 పైగా సినిమాలను ఇక్కడ షూట్ చేశారు. తమిళ హిట్ చిత్రం ' రోజా' , చెన్నై ఎక్స్ ప్రెస్, గురు, యువ ఇలా మరెన్నో సినిమాలు తీశారు.

చూడవలసిన ఆకర్షణలు : అజియార్ డ్యాం, వన్య ప్రాణి అభయారణ్యాలు, దేవాలయాలు, జలపాతాలు మొదలగునవి.

చిత్రకృప : Valliravindran

కన్యాకుమారి

కన్యాకుమారి

కన్యాకుమారి భారతదేశపు దక్షిణాగ్రభాగాన కలదు. మూడు సముద్రాలు (హిందూ, బంగాళా మరియు అరేబియా) కలిసే చోటు అద్భుతంగా ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవూడ్ ఇలా అన్ని చిత్ర రంగాలకు చెందిన సినిమాలు షూటింగ్ చేస్తుంటారు. తెలుగు సినిమా ఆర్య ఇంట్రడక్షన్ సీన్ ఇక్కడే షూట్ చేశారు.

చిత్రకృప : Natesh Ramasamy

కొడైకెనాల్

కొడైకెనాల్

కొడైకెనాల్ అందమైన పళని కొండలలో ఉన్న హిల్ స్టేషన్. కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ కొరకు ఇక్కడి వస్తుంటారు. అప్పట్లో పాతకాలం సినిమాలు ఇక్కడ తీసేవారట. జలపాతాలు, సరస్సులు, పూల తోటలు, వ్యూ పాయింట్లు చూడదగ్గవి.

చిత్రకృప : Thangaraj Kumaravel

ఊటీ

ఊటీ

ఊటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ రోజుకి ఎన్ని చిన్నా, పెద్దా షూటింగ్ లు జరుగుతాయో అందరికీ తెలిసిందే. కుచ్ కుచ్ హోతా హాయ్, దిల్ సే, రోజా, బర్ఫీ, తెలుగులో నాగార్జున నటించిన గీతాంజలి ఇక్కడ తీసినవే! దోడబెట్ట, బొటానికల్ గార్డెన్, సరస్సులు, ఫ్లవర్ షో లు, వెన్ లాక్ డౌన్స్ మొదలైనవి చూడదగినవి.

చిత్రకృప : sankaracs

కరైకుడి

కరైకుడి

కరైకుడి తమిళనాడు రాష్ట్రంలో కలదు. కోడి కూర కు ఈ పట్టణం ప్రసిద్ధి. ప్యాలెస్ లు, దేవాలయాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. వెట్టై, సామి, అరుళ్, వెల్ , జీన్స్, సంగం చిత్రాలను ఇక్కడ తీశారు.

చిత్రకృప : Joelsuganth

చెన్నై

చెన్నై

చెన్నై తమిళనాడు రాష్ట్ర రాజధాని. దక్షిణ భారత దేశ చిత్ర రంగానికి కేంద్ర బిందువు ఇది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నాటి సినిమా సన్నివేశాలను చెన్నై బీచ్ ల వద్ద, పార్కుల వద్ద తీశారు. మగధీర, టూ స్టేట్స్, అయాన్, నయగన్ తో పాటు అనేక తమిళ సినిమాల షూటింగ్ లు తీశారు, ఇప్పటికీ తీస్తున్నారు.

చిత్రకృప : jamal haider

కూనూర్

కూనూర్

కూనూర్ తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఊటీ ని సందర్శించే ప్రతి పర్యాటకుడు కూనూర్ ను తప్పక సందర్శిస్తుంటారు. ఇక్కడి అద్భుత దృశ్యాలు ఎన్నో కెమెరాలలో బంధించారు. దీవానా, హమ్ ఆప్ కే హయ్ కౌన్ మరియు సాజన్ తో పాటు అనేక చిత్ర రంగాలకు చెందిన సినిమాలు తీశారు.

చిత్రకృప : Titus John

మహాబలిపురం

మహాబలిపురం

మహాబలిపురం ... దీనినే మామల్లపురం అని పిలుస్తారు. షోర్ టెంపుల్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. 2 స్టేట్స్, షాలిమార్, మే మధం మరియు అనేక చిత్రాలను ఇక్కడ తీశారు. క్రోకడైల్ బ్యాంక్, టైగర్ కేవ్ చూడదగ్గవి.

మధురై

మధురై

మధురై తమిళనాడు దక్షిణ భాగంలో కలదు. మీనాక్షి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. కస్ధల్, గురు, జిల్లా మరియు బాంబే చిత్రాలు ఇక్కడే షూటింగ్ జరుపుకొని ఘానా విజయం సాధించాయి. అమ్మవారి ఆలయం తో పాటు మ్యూజియం, అరుప్పుకొట్టై, ఇతర ఆలయాలు చూడదగ్గవి.

చిత్రకృప : TAMIZHU

కుర్తాళం

కుర్తాళం

కుర్తాళం జలపాతాలకు ప్రసిద్ధి. ఇది తమిళనాడు రాష్ట్రంలో కలదు. వేసవి సెలవులను, వర్షాకాలాన్ని ఆనందించాలనుకొనేవారు ఇక్కడికి తరచూ వస్తుంటారు. అరవాన్, మిర్చి, అంజల మరియు వెట్టైల్ సినిమాలు ఇక్కడే తీశారు. సమీపంలోని దేవాలయం చూడదగ్గది.

చిత్రకృప : Mdsuhail

కోనసీమ

కోనసీమ

ఎటు చూసినా పంటచేలు.. కొబ్బరి చెట్లు.. గోదారి గలగలలు.. ఇది కోనసీమ అందాలు. మీరు పాత సినిమాలు ఒకసారి గమనిస్తే దర్శకుడు వంశీ తీసిన సినిమాలలో కోనసీమ తప్పక కనిపిస్తుంది. శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమా చూస్తే కోనసీమ అందాలను చూడవచ్చు. విలేజ్ లో వినాయకుడు, ముకుందా తదితర సినిమాలు కోనసీమలోనే జరిగాయి.

చిత్రకృప : Pranav Yaddanapudi

అంతర్వేది

అంతర్వేది

అంతర్వేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని తూర్పు గోదావరి జిల్లాలో, గోదావరి నది సముద్రంలో కలిసే చోట కలదు. ఈ చిన్న గ్రామం కూడా సినిమా షూటింగులకు పెట్టిందిపేరు. ఇక్కడ మూగమనసులు, సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైన కొత్తలో.. ఇలా వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.

చిత్రకృప : Rajib Ghosh

బొర్రా గుహలు

బొర్రా గుహలు

బొర్రా గుహలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, వైజాగ్ జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు ప్రకృతి సిద్ధంగా చాలా సంవత్సరాల క్రితమే ఏర్పడినవి. ఈ గుహలకు రోడ్డు మార్గం ద్వారా బస్సుల్లో గాని, ప్రేయివేట్ వాహనాల ద్వారా కానీ వెళ్ళవచ్చు. రైల్లో వెళితే మజాగా ఉంటుంది.

తీసిన సినిమాలు : చిరంజీవి నటించిన జగదేక వీరుడు - అతిలోకసుందరి, నాగార్జున నటించిన శివ, నరేశ్ కడుపుబ్బా నవ్వించించిన జంబలకిడిపంబ చిత్రాలన్ని ఇక్కడ చిత్రీకరించినవే.

చిత్రకృప : thotfulspot

ఓర్వకల్లు రాక్ గార్డెన్

ఓర్వకల్లు రాక్ గార్డెన్

కర్నూలు జిల్లాలో గల రాక్ గార్డెన్ సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రదేశం. ఇక్కడ సినిమా షూటింగ్ లు అనేకం జరుగుతుంటాయి. సుభాస్ చంద్ర బోస్, శంభో శివ శంభో, బాహుబలి మొదలైనవి ఇప్పటివరకు జరిగాయి. ఈ రాక్ గార్డెన్ లో రాళ్లతో ఏర్పడిన ఆకారాలు చూపరులను కనులవిందు చేస్తుంటాయి.

చిత్రకృప : Balamurugan Natarajan

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు కర్నూలు నడిబొడ్డున ఉంది. కర్నూలు నగరానికే ఇది తలమానికం. సీతయ్య, ఒక్కడు, ఆది, తులసి, ఠాగూర్ చిత్రాలలోనే కాక రాయలసీమ, ఫ్యాక్షన్ చిత్రాలలో కనిపిస్తుంది.

చిత్రకృప : Veera.sj

అరుంధతి కోట

అరుంధతి కోట

అరుంధతి కోట బనగానపల్లె నవాబుల వేసవి విడిది. ఈ కోట ఒక గట్టు మీద ఉంది. బనగానపల్లె - యాగంటి పోయే దారిలో రోడ్డుకు కుడివైపున ఉంది. ఈ కోట 9 గదులు, పెద్ద హాలు, నేలమాలిగా కలిగి ఉంటుంది. అరుంధతి సినిమాతో పాటుగా బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో ఈ కోట కనిపిస్తుంది. ఈ కోటని సందర్శిస్తే దగ్గరిలోని యాగంటిని చూడటం మరిచిపోకండి.

శంషాబాద్

శంషాబాద్

హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న శంషాబాద్ సమీపాన పురాతన శ్రీ సీతారాముల ఆలయం సినిమా షూటింగ్ లకి పెట్టింది పేరు. ఈ ఆలయం వద్ద సినిమా షూటింగ్ లు జరిగితే బాక్స్ - ఆఫీస్ వద్ద విజయం ఖాయమని దర్శక నిర్మాతల నమ్మకం. హాలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలు చూడదగ్గవి.

తీసిన సినిమాలు : పోతులూరి వీర బ్రహ్మేద్ర స్వామి చరిత్ర, పరమవీర చక్ర, మిస్టర్ పర్ఫెక్ట్, తీన్మార్, సెల్యూ ట్, వీర వంటి 350 చిత్రాలు.

PC: Subash BGK

భద్రాచలం

భద్రాచలం

ఉంది. ఏమైనా భద్రాచలం కూడా సినిమా షూటింగ్ లకి చిరునామాగా నిలిచింది. ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోదావరి, శ్రీ రామదాసు, అందాల రాముడు వంటి చిత్రాలు షూటింగ్ లు జరుపుకున్నాయి.

PC : Adityamadhav83

వేయి స్థంబాల గుడి

వేయి స్థంబాల గుడి

కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే నిర్మింపబడిన ఈ నిర్మాణం చాళక్యుల శైలిలో నిర్మించబడింది. వరంగల్ నగరం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇప్పటివరకు చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. వర్షం, రుద్రమదేవి లోని కొన్ని సీన్లు ఇక్కడే తీశారు.

చిత్రకృప : Venkataramesh Kommoju

రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే టాలివూడ్ నుంచి మొదలు కొని హాలీవూడ్, సీరియల్ చిత్రీకరణ సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ఈ సినిమాల ఊరు 2000 ఎకరాల విస్తీర్ణంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతి పెద్ద సినిమాల నగరంగా ప్రసిద్ధి చెందింది. దీని చూడటానికే ఒకరోజు సరిపోదు ఇక షూటింగ్ లు దేవుడెరుగు.

చిత్రకృప : Vinayaraj

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి సుమారుగా 11 కి. మీ. దూరంలో ఉన్నది. కోట అలనాటి కుతుబ్ షాహీ రాజవంశీయుల దర్పనానికి నిలువుటద్ధము. ఈ కోటకున్న ప్రత్యేకమైన లక్షణం వరండాలో నిలుచుని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది. ఇక్కడ మగధీర, పోకిరి, రాజకుమారుడు, శ్రీ రామదాసు వంటి చిత్రాలే కాకుండా మరెన్నో చిత్రాలను చిత్రీకరించారు.

చిత్రకృప : THINK Global School

చార్మినార్

చార్మినార్

హైదరాబాద్ నగరంలో పాతబస్తీ వద్ద ఉన్న చార్మినార్, అంటే నాలుగు స్తంభాలు అని అర్ధం. ఈ స్మారక చిహ్నం నగరం లో నుండి అంటు వ్యాధి అయిన ప్లేగు వ్యాధిని నిర్మూలించిన దైవ శక్తుల కి కృతజ్ఞతా భావం తో నిర్మింపబడినదిగా చరిత్రకెక్కింది. సినిమాలు చెప్పుకోవాలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇక్కడ వెళితే మీరు బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే చుట్టూ షాపింగ్ సందులు అనేకం ఉన్నాయి. ఇరానీ చాయ్, సమోస మరవద్దు.

చిత్రకృప : Yashwanthreddy.g

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X