Search
  • Follow NativePlanet
Share
» »జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో అడవి పులులు !!

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో అడవి పులులు !!

జిమ్ కార్బెట్ అనే ఒక ప్రసిద్ధ పులి వేటగాడి పేరుతో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ స్థాపించారు. జిమ్ కార్బెట్ పులి వేట గాడు మాత్రమే కాదు ఒక రచయిత కూడాను. ఆయన 'ది మాన్ ఈటర్స్ అఫ్ కుమావొన్ ' అనే ఒక పుస్తకం కూడా వ్రాశారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తర ఇండియా లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ని నైనిటాల్ జిల్లా లో ఒక ప్రసిద్ధ నేషనల్ పార్క్. నేటికీ ఇక్కడ 150 వరకూ పులులు కలవు. వీటిని చూడాలంటే, ఈ పార్క్ సందర్సన ఏప్రిల్ నుండి జూన్ నెలలలో అవి వాటి దప్పిక తీర్చుకొనేందుకు బయటకు వచ్చినపుడు చేయాలి.

ఇక్కడ పులులు మాత్రమే కాక, ఇతర అడవి ఏనుగులు, సాంబార్ చిరుత, మొసలి, వంటి జంతువులు ఎన్నో కలవు. పార్క్ సంవత్సరం అంతా తెరచే వుంటుంది. కాని నవంబర్ 15 నుండి జూన్ 15 వరకూ పార్క్ లోని అన్ని జోన్ లు టూరిస్ట్ లకు తెరచి వుంటాయి.

ఉత్తరాఖండ్ హోటల్ వసతులక్కు ఇక్కడ క్లిక్ చేయండి

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎలా చేరాలి ?
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో కలదు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కు ఢిల్లీ నుండి ముందుగా రామ్ నగర్ టవున్ కు వెళ్ళాలి. రామ్ నగర్ లో జిమ్ కార్బెట్ యొక్క నివాసం, నేడు ఒక మ్యూజియం గా మార్చబడినది, చూడవచ్చు.

Pic Credit: Wiki Commons

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

దికాలా జోన్
కార్బెట్ నేషనల్ పార్క్ ను అయిదు ప్రధాన భాగాలుగా విభజించారు. అవి బిజ్ రాణి, దికాలా, దోముండా, ఝిర్నా మరియు సోనానాది. అన్నింటిలోకి దికాలా జోన్ ప్రధాన అడవి భాగం. ఇక్కడ రాత్రి వసతి కూడా కలదు. ఈ జోన్ నవంబర్ 15 నుండి జూన్ 15 వరకూ తెరచి వుంటుంది. ఇక్కడ కల ఒక వాచ్ టవర్ నుండి లోయ అందాలు చూడవచ్చు.

Pic Credit: Wiki Commons

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

సఫారి
ఈ నేషనల్ పార్క్ లో వివిధ ట్రావెల్ కంపెనీ లు జీప్ సఫారి లు నిర్వహిస్తాయి. సఫారి రెండున్నర గంటల నుండి మూడు గంటల వరకూ పడుతుంది. ఉదయం ఒక సఫారి, మధ్యాహ్నం ఒక సఫారి వుంటాయి.
Pic Credit: Wiki Commons

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

ఎలిఫెంట్ సఫారి
జీపులు వెళ్ళలేని ప్రదేశాలుకు ఏనుగులు తేలికగా వెళతాయి. ఈ సఫారి కూడా రోజుకు రెండుసార్లు వుంటుంది. ఇక్కడ కల ఒక మ్యూజియం కూడా చూడవచ్చు. Pic Credit: netlancer2006

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

బస్సు సఫారి
దికాలా జోన్ కు ఓపెన్ బస్సు ప్రయాణం నిర్వహిస్తారు. దీనిని రామ్ నగర్ మరియు ధన్గారి గెట్ ల నుండి నిర్వహిస్తారు. ఆరు గంటలు ప్రయాణం.
Pic Credit: wribs

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

రాత్రి వసతి
దిఖాలా మరియు గాయరాల్ లలో రాత్రి వసతి అడ్వాన్సు బుకింగ్ పై పొందవచ్చు. గరిష్టంగా మూడు రాత్రులకు మాత్రమే అనుమతిస్తారు. దీనిని న్యూ ఢిల్లీ లోని బరఖంబా రోడ్ టూరిజం ఆఫీస్ లో చేసుకోవాలి.
Pic Credit : wribs

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ !

ఇతర వసతులు
ప్రధాన జోన్ అయిన దిఖాలా లోనే కాక, ఈ ప్రదేశం వెలుపల కూడా అనేక లాజ్ లు, హోటళ్ళు కలవు. వాటిలో రాత్రి వసతి పొందవచ్చు.

Pic Credit: Koshy Koshy

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X