Search
  • Follow NativePlanet
Share
» »మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

మధ్యప్రదేశ్ భారతదేశం నడిబొడ్డున ఉన్నది.ఇంతకు ముందు ఇదే దేశంలోదేశంలోకెల్లా పెద్ద రాష్ట్రంగా ఉండేటిది కానీ 2000 సంవత్సరంలో రాష్ట్రాల పునర్విభజన కారణంగా ఆ స్థానాన్ని పోగొట్టుకొని, విస్తీర్ణం పరంగా దేశంలోకెల్లా రెండవ పెద్ద రాష్ట్రంగా ఉన్నది.ఇక్కడ భోపాల్ రాజధానిగా ఉన్నప్పటికీ పక్కనే ఉన్న ఇండోర్ మహానగరం.చరిత్ర పరంగా చూసుకుంటే మౌర్యుల కాలం నుంచి కూడా ఈ ప్రాంతం తన వైభొగాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నది.ఇక్కడ యునెస్కొ సంస్థ చేత గుర్తించబడిన ప్రసిద్ద ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు,వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.మనం ప్రస్తుతం ఇక్కడ కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం!!...

కోటి తీర్ధాల పుణ్యఫలం....ఓంకారేశ్వర దర్శనం

ఓంకారేశ్వర దేవాలయం హిందువుల పవిత్ర శైవపుణ్యక్షేత్రం.ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో ఉన్నది. ఇది శివున్ని గౌరవించే 12 జ్మోతిర్లింగ ఆలయాలలో ఒకటి. ఇక్కడున్న శివలింగం పెద్దది మరియు నల్లరాతితో మలచినది.దీనిని ఇక్కడున్న స్థానికులు దేవలోకమని పిలుస్తారు. ఇది పురాతనమైన కట్టడమే కాదు, శివలీల విశేషాలతో నిండిన పునీతమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం నర్మదా నది ఒడ్డున వెలసినది.మాంధాత కట్టించిన శివుని ఆలయాలు, ఇతర ఆలయాలు ఆకాశం మీద నుంచి చూస్తే మనకు ఓంకారం ఆకారం లో కనిపిస్తాయి కనుక ఇక్కడ వెలసిన స్వామిని ఓంకారేశ్వరుడు అని, భక్తుల మలినలు తొలగిస్తాడు కనుక అమలేశ్వరుడి అని కూడా అంటారు. ఓంకారేశ్వర క్షేత్రంలో ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రదక్షిణలు చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రతీతి.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

Photo Courtesy: Ssriram mt

ఖజురహో... వారసత్వానికి చిహ్నం

ఖజురహో ఒక గొప్ప పర్యాటక ప్రదేశం మరియు దేవాలయాల సముదాయం.క్రీ.శ.950-1050 కాలంలో మధ్య భారతదేశాన్ని పాలించిన చండేల పాలకులు కట్టించారు.ఖజురహోలో మొత్తం 85 దేవాలయాలు ఉన్నాయి అందులో ప్రస్తుతం 22 దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.మానవుల భావోద్వేగాలను రాతి మీద,అందమైన శిల్పాల రూపాలలో అద్భుతంగా తీర్చిదిద్దారు.ఈ దేవాలయాలు 1986 వ సంవత్సరంలో యునెస్కో సంస్థచే గుర్తించబడ్డాయి.ఇక్కడ వరుసగా విశ్వనాథ దేవాలయం,కేందరీయా మహాదేవ దేవాలయం, దేవి జగదాంబ దేవాలయం,జవారి దేవాలయం, లక్ష్మణ దేవాలయం,చుసాథ్ యోగీని దేవాలయం మొదలగున దేవాలయాలు ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

Photo Courtesy: Antoine Taveneaux

వన్ విహార్ నేషనల్ పార్కు

వన్ విహార్ నేషనల్ పార్కు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో కలదు.ఇది 1983వ సంవత్సరంలో జాతీయం చేశారు.ఇక్కడ ప్రస్తుతం వివిధ రకాలైన వన్యప్రాణులు, పక్షులు, సరీసృుపాలు మొదలగునవి ఉన్నాయి.జంతుసంపద ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఇదికూడా ఒకటి.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

Photo Courtesy: Sudheer Pandey

మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం

మహాకాళేశ్వర్ ఆలయం ఉజ్జైన్ అనే పురాతన పట్టణంలో ఉన్నది.ఈ దేవాలయాన్ని పరమేశ్వరుడికి అంకితం చేశారు.ఇది దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.ఈ పవిత్ర దేవాలయం రుద్ర సాగర్ సరస్సు ఒడ్డున ఉన్నది.ఇది ప్రస్తుతం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం గా ప్రసిద్ది చెందింది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

Photo Courtesy: Sandeepkr04

తాజ్-ఉల్-మసజిద్

ఇది భోపాల్ లో ఉన్నది.ఈ మసీద్ ని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కాలంలో పునాది పడితే,1885 వ సంవత్సరంలో పూర్తయినది.ఈ మసీద్ లేత గులాబీ వర్ణంలో ఉంటుంది.ఇక్కడ రంజాన్, బక్రీద్ పండగల సమయాలలో చేసే ప్రార్థనలు ప్రత్యేకమైనవి. దీనియొక్క నిర్మాణ శైలి డిల్లీలోని జమా మసీద్,లాహోర్ లోని బాద్షాహీ మసీద్ పొలిఉంటుంది.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

Photo Courtesy: Eeshan Sharma

భారత్ భవన్

భారత్ భవన్ శబ్ధ ప్రదర్శనలు,విజువల్ ఆర్ట్సుని నడిపించే కళల కేంద్రం అని చెప్పవచ్చు. ఇది భోపాల్ లోని అన్ని కళలకి కేంద్రంగా పరిగణించబడుతుంది.మీకు కళలపై ఆసక్తి లేకపోయిన,ఈ స్థల సందర్శన చేసినట్లయితే మీకు స్వాంతన కలుగుతుంది.ఈ భారత్ భవన్ ప్రతియేటా పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఇక్కడ పిల్లలకు వినోదాన్ని,సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది.ఈ భారత్ భవన్ లో ఒక మ్యూజియం కూడా ఉన్నది.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

Photo Courtesy: Chintu rohit

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X