Search
  • Follow NativePlanet
Share
» » కాశ్మీర్ లో సినిమా షూటింగ్ లు ఎక్కడ తీస్తారు ?

కాశ్మీర్ లో సినిమా షూటింగ్ లు ఎక్కడ తీస్తారు ?

సాధారణంగా సినిమా షూటింగ్ లు చేయాలంటే అందమైన ప్రదేశాలు కావాలి. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ కారణంగా సినిమాలు పూర్తిగా స్టూడియో లు, ఫైల్ సిటీ లలో పూర్తి చేస్తున్నారు. సరైన ప్రదేశాలు లేకుంటే, ఆ సినిమా పూర్తి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా వుంది. సన్నివేశాల చిత్రీ కరణలో ప్రదేశాల ఎంపిక ఎంతో అవసరం. అందులోనూ రొమాంటిక్ సన్నివేశాల కు నేటి రోజుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అందమైన సహజ ప్రదేశాల ఎంపిక కు కాశ్మీర్ బాగా పేరు పడింది. వ్యయాలు ఎంత తక్కువ చేయాలన్న, సహజమైన రొమాంటిక్ ప్రదేశాల షూటింగ్ లకు కాశ్మీర్ వెళ్ళాల్సిందే. కాశ్మీర్ ను ఈ భూమి పై గల స్వర్గం గా భావిస్తారు. ఎక్కడ చూసినా పచ్చటి మైదానాలు, తెల్లని మంచుచే కప్పబడిన పర్వతాలు, దట్టమైన పచ్చదనం, వంటి వాటి తో కాశ్మీర్ వాలీ రొమాన్స్ సన్నివేశాలకు అనుకూలం. ఎన్నో సినిమాలలో చూపబడిన కాశ్మీర్ , టూరిజం రీత్యా కూడా బాగా అభివ్రుద్ధి చెందినది. పర్యాటకులు చాలామంది, ఫిలిం షూటింగ్ లు చేయబడిన ప్రదేశాల సందర్శనకు వెళతారు. మరి కాశ్మీర్ లో అటువంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఏవి అని పరిశీలిద్దాం !

పాన్గోంగ్ లేక్
లడఖ్ లో కల పాన్గోంగ్ లేక్ ప్రాంతం అద్భుత ప్రకృతి దృశ్యాలను చూపుతుంది. దట్టమైన నీలి రంగు కల నీరు, దాని చుట్టూ అందమైన పర్వతాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. వింటర్ లో ఈ సరస్సు లోని నీరు గడ్డ కడుతుంది. పాన్గోంగ్ సరస్సు కు లెహ్ ప్రదేశం నుండి అయిదున్నర గంటల రోడ్డు ప్రయాణంలో చేరవచ్చు. మార్గం ఎత్తు పల్లాలతో కొంచెం కష్టం గా ప్రయాణించాలి. మార్గంలో మీరు షేయే మరియు గ్యా గ్రామాలలో కొద్దిపాటి విశ్రాంతి పొందవచ్చు. చాంగ్లా పాస్ చేరేసరికి మన సైనికులు వుంటారు. అక్కడక్కడా టీ దుకాణాలు కనపడతాయి. ఇక్కడ నుండి ముందుకు వెళితే, తాన్గ్స్తే మరియు ఇతర చిన్న గ్రామాలు కనపడతాయి. ఇక్కడ పాగల్ నాలా లేదా పిచ్చి ప్రవాహం అనే నది దాటాలి. ఈ సరస్సు ప్రాంతం ఎంతో అందంగా వుంటుంది. మే నెల నుండి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతం టూరిస్ట్ లకు తెరచి వుంటుంది.

ఈ ప్రాంతం లో హిందీ సినిమాలైన 'దిల్ సే', '3 ఇడియట్స్ ' 'జబ్ తక్ హై జాన్', వంటి సినిమాలు తీశారు.

తిక్షేయ్ గోమ్పా విహారం
ఇది ఒక 12 అంతస్తుల బౌద్ధ విహారం. దీనిలో అనేక స్తూపాలు, విగ్రహాలు, తన్కాలు, వాల్ పెయింటింగ్ లు, కత్తులు, బుద్ధుడి బోధనలు కల ఒక పెద్ద స్థంభం, మరి కొన్ని విలువైన, పవిత్రమైన బౌద్ధ మత చిహ్నాలు కలవు. ఇవన్ని లడక్ శిల్ప శైలి కలిగి వుంటాయి. అందమైన ఈ బౌద్ధ ఆరామం లెహ్ ప్రదేశానికి 16కి. మీ. ల దూరం లో వుండి టూరిస్ట్ వాహనాలు లోనికి వెళ్లేందుకు అనుమతి వుంటుంది. ఇక్కడే ఇంకా రెండు బౌద్ధ ఆరామాలు కూడా కలవు.

ఈ ప్రాంతం లో కూడా 'దిల్ సే ' మరియు 'తాషణ్ ' సినిమా తీసారు.

పారి మహల్
పారి మహల్ అనే ఒక పెద్ద భవనం ఒక చిన్న కొండపై అందమైన దళ్ లేక్ ను చూపుతూ హుందా గా నిలబడి వుంటుంది. షూటింగ్ ప్రదేశమైన పారి మహల్ గార్డెన్ , దళ్ లేక్ కు నైరుతి దిశగా జేబాన్ వాన్ పర్వతం పై వుంటుంది.

ఇది శ్రీనగర్ నుండి పడమటి దిశగా సుమారు 5 కి. మీ. ల దూరం వుంటుంది. అందమైన ఈ గార్డెన్ శ్రీనగర్ సిటీ మధ్య భాగంలో వుంది. కాలి నడక లేదా ఆటో లలో వెళ్ళవచ్చు. ఇక్కడ మీకు వసతిగా మీ బడ్జెట్ మరియు అవసరాలను బట్టి హోటళ్ళు కలవు.

ఈ ప్రదేశంలో హిందీ సినిమా ' లమ్హా' తీసారు.

నిషాత్ బాగ్
నిషాత్ బాగ్, కాశ్మీర్ లోని మొగల గార్డెన్స్ లో ఒకటి. ఇక్కడ 12 రాశులకు అనుగుణంగా 12 అంతస్తులు గా వుండి క్రిందదైన అంతస్తు లేక్ తో కలసిపోయి వుంటుంది. ఇది ప్రసిద్ధ దళ్ లేక్ ఒడ్డున కలదు.

అందమైన ఈ గార్డెన్ శ్రీనగర్ సిటీ కి మధ్య భాగం లో వుంది. కాలి నడకన, లేదా ఆటో లలో చేరవచ్చు.

హిందీ సినిమా 'లమ్హా' చిత్రం లోని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు.

పహల్గాం
పహల్గాం శ్రీ నగర్ నుండి 95 కి. మీ. ల దూరంలో వుంటుంది. కాశ్మీర్ వాలీ లో బాగా పేరొందిన ప్రదేశం. ఎంత వేసవి అయినా సరే, చల్లగా వుంటుంది. పహల్గాం లో 9 రంధ్రాల గోల్ఫ్ కోర్స్ కలదు. ఇది సముద్ర మట్టానికి 2400మీ. ల ఎత్తున కలదు. ఇక్కడ కల లిద్దర్ నది లో బోటు విహారాలు, చేపల వేట వంటివి ప్రత్యేకం.

 కాశ్మీర్ లో సినిమా షూటింగ్ లు ఎక్కడ తీస్తారు ?

ఈ లోయ చుట్టూ మంచు చే కప్పబడిన పర్వతాలు అతి సుందరంగా కనపడతాయి. దట్టమైన పైన్ మరియు దేవదార్ అడవులు చూడవచ్చు. ఈ ప్రాంతంలో 'మౌసం', 'సిల్ శిలా' వంటి పేరొందిన సినిమాలు తీసారు.

దళ్ లేక్
శ్రీ నగర్ లోని ఈ సరస్సు లో బోటు విహారం ఒత్తిడి తొలగించి ఎంతో హాయి కలిగిస్తుంది. ఇక్కడ కల షికారా అనే బోటు విహారం పర్యాటకుల ప్రధాన ఆకర్షణ. పై కప్పు కల బోటు లలో విహరించేందుకు జంటలు ఎంతో ఇష్ట పడతారు. నాగిన్ సరస్సు కూడా బోటు విహారానికి ప్రసిద్ధి. మరువ లేని అనుభూతులను ఇస్తూ లెక్కలేనంత ఆనందాన్ని అందిస్తుంది. శ్రీనగర్ లోని దళ్ లేక్ మరియు నాగిన్ లేక్ ఒడ్డున మీకు లెక్కలేనన్ని బోటు లు వుండి, అద్దెకు తీసుకునేటందుకు సిద్ధంగా వుంటాయి. షికారా బోటు విహారం అధిక చలి కలిగి, నీరు గడ్డ కట్టే డిసెంబర్, జనవరి నెలలు మినహా, సంవత్సరంలో మిగిలిన నెలలు అన్నింటి లొనూ పర్యాటకులకు లభ్యంగా వుంటుంది.

ఈ ప్రదేశంలో మిషన్ కాశ్మీర్, కాశ్మీర్ కి కాలి సినిమాలు తీసారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X