Search
  • Follow NativePlanet
Share
» »పూణేలో గల చతుశృంగి మాతా ఆలయ సందర్శనం

పూణేలో గల చతుశృంగి మాతా ఆలయ సందర్శనం

చతుశృంగి మాతా ఆలయం పూనే నుండి 17 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయం చేరుకోవడానికి శివాజీ రోడ్ ద్వారానైతే 30 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఆలయ దేవతగా "చతుశృంగి మాతా" కొలువై వుంది.

By Venkata Karunasri Nalluru

పూణే లేదా "మరాఠా భూమి" భారతదేశంలో అత్యంత పర్యాటక ప్రదేశాలు గల నగరం. ఈ ప్రదేశం అనేక దివ్య పుణ్యక్షేత్రాలకు నెలవుగా ఉంది.

పూణేలో గల చతుశృంగి మాతా దేవాలయం ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం. ఈ పరిపూర్ణ పుణ్యక్షేత్రం ప్రధాన నగరం పూణే నుండి 17 కి.మీ. దూరంలో వున్న శివాజీ రోడ్ లో ఉన్నది.

మహారాష్ట్రలోని 7 అందమైన దేవి ఆలయాలు:

pune to chaturshringi temple distance

PC : Umesh Kale

ఆలయ పురాణం:

పురాణాల ప్రకారం, దుర్లభ్ దాస్ అనే పేరు గల ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. ఇతను చతుశృంగి మాత యొక్క ఉగ్రమైన భక్తుడు. పూనే నుండి 259 కి.మీ.ల దూరంలో గల "వాణి" అనే ప్రదేశంలో విగ్రహం సందర్శించి దేవత యొక్క దీవెనలు కోరుకొనేవాడు. ఆయనకు వయసు పెరుగుతున్నకొద్దీ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అతని ఆరోగ్య సమస్యల వల్ల "వాణి" కి ప్రయాణించుటకు అతనికి చాలా అసాధ్యంగా మారింది.

దుర్లభ్ దాస్ ఈ సమస్య పరిష్కారం కోసం చతుశృంగి మాతను ప్రార్ధించాడు. దేవత అతనికి కలలో అగుపించి ఇలా చెప్పింది. పూనే వాయువ్య కొండ పైన నేను వెలుస్తాను. అక్కడ నాకు ప్రార్ధనలు జరిపి పూజలు చేయమని అడుగుతుంది. అదే తర్వాత పవిత్ర చతుశృంగి మాతా దేవాలయంగా పూజలందుకుంటుంది అని చెబుతుంది.

పూనే లో దగ్డూ సేఠ్ హల్వాయీ గణపతి ఆలయం:

ఎందుకు మనం దీనిని చతుశృంగి అని పిలుస్తాం ?

సంస్కృతంలో "చతుః" అంటే నాలుగు అని అర్థం "శృంగ్" అంటే పర్వత శిఖరాలు అర్థం. ఈ ఆలయం నాలుగు శిఖరాలు కలిగిన పర్వతం మీద ఉంటుంది కనుక ఈ ఆలయాన్ని"చతుశృంగి మాతా ఆలయం" అంటారు. ఇక్కడ దేవతను కూడా అదే పేరుతో పిలుస్తారు.

pune to chaturshringi temple distance

PC : Brunda Nagaraj

చతుశృంగి మాతా ఆలయం యొక్క నిర్మాణం:

ఈ ఆలయం ఛత్రపతి శివాజీ కాలంలో నిర్మించినట్లు చెబుతారు. ఆలయం 90 అడుగుల ఎత్తులో వుంటుంది. 100 కంటే ఎక్కువ మెట్లు ఉన్నాయి.

ఇక్కడ దేవత దుర్గతో పాటు గణేషుడు, సూక్ష్మ రూపాలు గల అష్ట వినాయకుని యొక్క చిన్న దేవాలయాలు కూడా ప్రస్తుతం ఉన్నాయి. ఈ ఆలయం ప్రశాంతంగా వుంటుంది. ప్రాంగణంలో ఏర్పరచిన రాతి బల్లలు భక్తులకు విశ్రాంతినిస్తాయి.

మీరు ఆలయం యొక్క కుడి ప్రవేశద్వారం వద్ద పావురాల గుంపును చూడవచ్చు. పర్యటన సందర్భంగా భక్తులు ఈ పావురాల గుంపుకు ధాన్యాలను అందిస్తుంటారు. దేవాలయానికి తెలుపు మరియు ఎరుపు రంగులతో కూడి వుంటుంది. దేవాలయ టవర్ పైన కాషాయ రంగు గల జెండాను ఎగురుతూ వుంటుంది.

ఆలయ ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం పుష్కలంగా ఉంది అంతేకాకుండా పాదరక్షల స్టాండ్ కూడా ఉంది.

pune to chaturshringi temple distance

PC : Brunda Nagaraj

How To Reach The Chatushrungi Mata Temple

మీరు పూణే నుండి ఒక ప్రైవేట్ క్యాబ్ లేదా మీ సౌలభ్యాన్ని బట్టి ఒక ఆటోరిక్షాను అద్దెకు తీసుకోవచ్చు.

మీకు ఈ దేవాలయ సందర్శించాలని ప్లాన్ ఉంటే, మీరు ఖచ్చితంగా ఆలయం నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్లా గుహలు, లోనావాలా మరియు బాజా గుహలు మొదలైన ప్రదేశాలు కూడా దీనితో పాటు చూడవచ్చును.

పూణే ఎలా చేరుకోవాలి?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X