Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తర ఇండియాలో ఉత్తమ పర్యటన ప్రదేశాలు !!

ఉత్తర ఇండియాలో ఉత్తమ పర్యటన ప్రదేశాలు !!

అందర్నీ భయపెడుతున్న రైల్వేస్టేషన్..!అందర్నీ భయపెడుతున్న రైల్వేస్టేషన్..!

పిల్లలు పుట్టాలంటే ఈ గుడిలో దొంగతనం చేస్తే చాలట...పిల్లలు పుట్టాలంటే ఈ గుడిలో దొంగతనం చేస్తే చాలట...

దేశంలోని వివిధ భాగాలలో వివిధ ఆకర్షణా ప్రదేశాలు కలవు. గతంలో మీకు సౌత్ ఇండియా బెస్ట్ ప్రదేశాలు అందించాము. ఇపుడు మీకు ఉత్తర మరియు పశ్చిమ ఇండియా లో కల ఉత్తమ టూరిస్ట్ ప్రదేశాలు అందించానున్నాము. వివిధ హెరిటేజ్ ప్రదేశాలైన, ఆగ్రా నుండి మధ్య ప్రదేశ్ వరకు, అజంతా మరియు ఎల్లోరా గుహలు, సహజ అందాల డెహ్రాడూన్, లెహ్ ల వరకూ ప్రతి వారికి కావలసిన ఆధ్యాత్మిక, సాహస, ప్రకృతి దృశ్యాల ప్రదేశాలు కలవు.

నార్త్ మరియు వెస్ట్ ఇండియా బెస్ట్ ప్రదేశాలు

అజంత గుహలు, అజంత

అజంత గుహలు, అజంత

ఈ గుహలు మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో కల 30 బౌద్ధ దేవాలయాల రాతి తొలచిన గుహలు. ఈ గుహలు భారతీయ కళా శిల్ప సంపాదకు ఉత్తమ ఉదాహరణగా నిలుస్తున్నాయి. వీటిని ప్రపంచ హెరిటేజ్ సైట్ గా యునెస్కో సంస్థ గుర్తించింది.

ఆగ్రా ఫోర్ట్

ఆగ్రా ఫోర్ట్

ఆగ్రా పేరు చెప్పిన వెంటనే తాజ్ మహల్ గుర్తుకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మరో రెండు ప్రపంచ హెరిటేజ్ ప్రదేశాలు కలవు. అవి ఆగ్రా ఫోర్ట్ మరియు ఫతేపూర్ సిక్రీ

భింబెట్కా

భింబెట్కా

మధ్య ప్రదేశ్ లోని భింబెట్కా మరొక వరల్డ్ హెరిటేజ్ సైట్. భింబెట్కా లోని కేవ్ పెయింటింగ్ లు ఇండియన్ అప్ ఖండంలో పురాతన కాల ప్రాణి సంచారం ఎలా అనేది చూపుతాయి.

కార్బెట్ నేషనల్ పార్క్

కార్బెట్ నేషనల్ పార్క్

దేశంలో ఇది ఒక ప్రాచీనమైన నేషనల్ పార్క్. ఈ పార్క్ లో ఇక ప్రపంచంలో అంతరించే పులులను చూడవచ్చు.

డెహ్రాడూన్

డెహ్రాడూన్

డెహ్రాడూన్ అక్కడ కల ముస్సూరీ మరియు నైనిటాల్ ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఉత్తరాఖండ్ లోని అందమైన ఈ రాజ దాని నగరం నగర జీవితాలతో అలసిన వారికి చక్కని విశ్రాంతిని అందిస్తుంది.

ఎలిఫెంటా గుహలు

ఎలిఫెంటా గుహలు

ఈ గుహలు హిందూ మరియు బౌద్ధ టెంపుల్స్ గా కలవు. ముంబై చివరిలోని ఎలిఫెంటా దీవిలో కల ఈ గుహలకు ప్రపంచ వ్యాప్త పర్యాటకులు వస్తారు. తప్పక చూడదగినవి.

ఎల్లోరా గుహలు

ఎల్లోరా గుహలు

అజంతా గుహల వలెనె, ఎల్లోరా గుహలు కూడా రాతి తొలచి చేసిన టెంపుల్స్.

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ

ఆగ్రా లో ఇది మరొక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ ప్రదేశం మొఘల్ పాలకుల వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.

గిర్ నేషనల్ పార్క్

గిర్ నేషనల్ పార్క్

ఆసియాటిక్ సింహాలు ఇక్కడ మాత్రమే వుంటాయి. గుజరాత్ లో ఇది తప్పక చూడదగిన పర్యాటక ఆకర్షణ.

హరిద్వార్

హరిద్వార్

హరిద్వార్ హిందువులకు గల ఏడు పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి.
ఉత్తర ఇండియా ఉత్తమ టూరిస్ట్ ప్రదేశాలు

జైపూర్

జైపూర్

జైపూర్ ' పింక్ సిటీ ' రాజస్తాన్ లోని ఈ ప్రదేశంలో రాచరిక ఆనందాలు కలిగించే అనేక ఫోర్ట్ లు, పాలస్ లు చూడవచ్చు.

ఖజురహో

ఖజురహో

ఖజురహో మరొక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడి 22 టెంపుల్స్ లో కల కామ కేళి శిల్ప సంపద ప్రపంచ ఆనంద దృశ్యాలను అద్భుతంగా చాటుతాయి.

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని లెహ్

జమ్మూ అండ్ కాశ్మీర్ లోని లెహ్

లెహ్ యొక్క ప్రకృతి అందాలు మిమ్ములను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ ప్రదేశం ప్రపంచం లోని అతి ఎత్తైన వాహన రహదారిగా గుర్తించారు.

ముంబై నగరం

ముంబై నగరం

ముంబై నగరం ప్రపంచ నగరాల లోని ధనిక నగరాలలో ఒకటి. ఇండియాలో అత్యంత సంపద కల నగరం. ఈ నగరం గురిచి అధికంగా తెలుపనవసరం లేదు.

మౌంటెన్ రైల్వే - హిమాచల్

మౌంటెన్ రైల్వే - హిమాచల్

హిమాచల్ లోని టాయ్ ట్రైన్ లు సుమారు వంద సంవత్సరాలకు పైగా నడుస్తున్నాయి. కొండలలో ప్రయాణించే ఈ రైలు ప్రయాణం ఒక జీవిత కాల మధురానుభూతి.

మనాలి

మనాలి

చెమటలు కారే వేసవిలో మనాలి సందర్శనకు మించిన ఆనందం ఏముంటుంది. మీరు ప్రస్తుతం ఏ పని లో వున్నా, వెంటనే సెలవు పెట్టి ఈ సమ్మర్ కు మనాలి చేరండి. చల్లటి వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు ఆనందించండి.

నందా దేవి

నందా దేవి

నందా దేవి మరియు పూవుల వాలీ లు హిమాలయాల ఒడిలో కలవు. ఇక్కడ కల పచ్చిక బయళ్ళు, పూల తోటలు మీ కను చూపు వెళ్ళే వరకూ, కనపడుతూ ఆకాశాని ముద్దాడుతూ వుంటాయి. ఒక వైపు సుతి మెత్తని లోయ మరో వైపు కఠిన మైన నందా దేవి అందాలు చూడ తరమా ?

పూనే

పూనే

పూనే ఒక పురాతన నగరం. సుమారుగా 9 వ శతాబ్దానికి చెందినది గా చెపుతారు. ఒకప్పుడు ఇది ఒక గొప్ప మరాఠా సామ్రాజ్యంగా వుండేది. నగరం ఎంత ఆధునీకరణ చెందుతున్నప్పటికీ పురాతన వైభవం మిమ్ములను ఆనందపరుస్తుంది అనటంలో సందేహం లేదు.

రాన్ అఫ్ కచ్

రాన్ అఫ్ కచ్

విశాలమైన రాన్ అఫ్ కచ్ ప్రదేశం, అక్కడ కల ఉప్పు ఎడారి కన్నుల విందుగా వుండి మీకు ఆనందం కలిగిస్తాయి.

సాంచి స్తూపం

సాంచి స్తూపం

ఇండియాలో ఇది ఒక అతి పురాతన నిర్మాణం. ఈ నిర్మాణం క్రీ. పూ. 3 వ శతాబ్దం నాటి అశోకుడి కాలానికి చెందినది.

వారణాసి

వారణాసి

హిందువులకు, జైనులకు గల ఏడూ పవిత్ర ప్రదేశాలలో వారణాసి నగరం ఒకటి. ప్రపంచంలో ఈ నగరం అతి పురాతన కాల నగరంగా భావిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X