Search
  • Follow NativePlanet
Share
» »సర్చు - ఇక్కడ ఒక రాత్రి స్టే చేయండి !!

సర్చు - ఇక్కడ ఒక రాత్రి స్టే చేయండి !!

లేహ్ - మనాలి జాతీయరహదారిలో ఉన్న సర్చు ప్రాంతాన్ని పర్యాటకులు హాల్టింగ్ ప్రదేశం గా (లేదా) నైట్ క్యాంపు గా ఉపయోగించుకుంటారు.

By Mohammad

సర్స భుమ్ చున్ గా ప్రసిద్ధికెక్కిన సర్చు జమ్మూకాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న విడి కేంద్రం. మనాలి నుండి లడఖ్-లేహ్ కు వెళ్ళే మార్గంలో సర్చు కనిపిస్తుంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 4290 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సర్చు ప్రదేశాన్ని శీతాకాలంలో సందర్శించలేం. కానీ మార్చి నెల మొదలైతే ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

సర్చు ప్రాంత సందర్శనకు వేసవి కాలం అనుకూలం. మర్చి నుండి వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. లేహ్ - మనాలి జాతీయరహదారిలో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకులు హాల్టింగ్ ప్రదేశం గా (లేదా) నైట్ క్యాంపు గా ఉపయోగించుకుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కొరకు వసతి సదుపాయాలు, భోజన సదుపాయాలు కలవు. సమీప పరిసరాలలో ట్రెక్కింగ్ చేసే సదుపాయం కూడా ఉంది.

ప్రవేట్ గుడారాలు

ప్రవేట్ గుడారాలు

చిత్రకృప : Kiran Jonnalagadda

సర్చు లో ప్రధాన ఆకర్షణలు - ఇక్కడ ప్రవహించే నది, క్యాంపెనింగ్

సర్చు క్యాంపెనింగ్

మనాలి నుండి 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేహ్ కు ప్రయాణించే పర్యాటకులకు ప్రసిద్ధ విశ్రాంతి కేంద్రంగా ఉన్నది సర్చు. ఇక్కడ గుడారాలు వేసుకోవచ్చు లేదా అక్కడే ప్రవేట్ గా గుడారాలను అద్దెకు తీసుకోవచ్చు. భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మీరు (సాహసికులు) బైక్ అద్దెకు తీసుకొని వెళ్ళేవారైతే గుడారాల సామాగ్రి వెంట తీసుకొనివెళ్ళి సర్చు లో టెంట్ వేసుకోవచ్చు.

శీతాకాలంలో ఈ ప్రదేశానికి వెళ్ళే దారులన్నీ మంచుతో కూరుకుపోవడం వల్ల మూసేస్తారు. కనుక సాహసికులు / పర్యాటకులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎండాకాలంలో ఇక్కడి వాతావరణం పొడిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడైతే ఎటువంటి చీకూచింతా లేదు. పర్యాటకులు మార్చి - అక్టోబర్ వరకు రోడ్ ట్రిప్ వేసుకోవచ్చు. లడఖ్ లో ఉన్న జంస్కర్ ప్రాంతం పరిసరాల్లో ట్రెక్కింగ్ చేసే సదుపాయం ఉంది.

త్సరప్ చు రివర్

త్సరప్ చు రివర్

చిత్రకృప : Mahuasarkar25

త్సరప్ చు రివర్

సర్చు లో ఉన్న ప్రధాన ఆకర్షణలో త్సరప్ చు నది ఒకటి. ఇది మనాలి - లేహ్ రహదారి గుండా ప్రవహిస్తుంది. రోడ్ ట్రిప్ వేసేవారు ఈ నదిని చూస్తూ ఆనందించవచ్చు. సమీపంలోని పీఠభూమి మంచు పర్వతాలు కరిగిపోయి ఈ నదిలో కలిసిపోతుంటాయి. అలాగే దోడ నది కూడా ఈ నదిలో కలిసిపోయి పదుం వ్యాలీ లో ప్రవహించి ఆ తర్వాత గొప్పదైన జంకర్ నది గా రూపాంతరం చెందుతుంది.

ఈ ప్రాంతం కూడా లడఖ్ లో ఉన్న జంస్కర్ ప్రాంతం అందాలను ఆస్వాదించాలనుకొనేవారికి ట్రెక్కింగ్ కి అనువైనది. వేసవికాలం ఈ నది సందర్శనకు అనుకూలం. ఆ సమయంలో ఈ ప్రాంత వాతావరణం సాధారణ స్థితిలో ఉంటుంది. దాదాపు 25-28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదే శీతాకాలంలో అయితే మైనస్ లో ఉంటుంది. కనుక పర్యాటకులు రోడ్ ట్రిప్ లను శీతాకాలంలో ప్లాన్ చేసుకోవద్దు!!

రోడ్డు మార్గంలో జలపాతం

రోడ్డు మార్గంలో జలపాతం

చిత్రకృప : Silver Blue

సర్చు ఎలా చేరుకోవాలి ?

సర్చు చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు కలవు. అయినప్పటికీ సాహసికులు, పర్యాటకులు రోడ్డు మార్గాన్నే ఎంపికచేసుకుంటారు.

రోడ్డు మార్గం : మనాలి, లేహ్, లడఖ్, స్పితి నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం : 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్ముతావి రైల్వే స్టేషన్ సర్చు కు సమీపంలో కలదు.

విమాన మార్గం : లేహ్ లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్ నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. లేహ్ నుండి సర్చు మధ్య దూరం : 260 కి. మీ., మనాలి నుండి : 230 కి. మీ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X