Search
  • Follow NativePlanet
Share
» »ఆగుంబే...జలపాతాలు, అడవుల ప్రదేశం !

ఆగుంబే...జలపాతాలు, అడవుల ప్రదేశం !

ఈ భూమి పై సుందర దృశ్యాలు చూడాలంటే, ఆగుంబే ఒక మంచి ప్రదేశం. ఆగుంబే ని దక్షినాది చిరపుంజి అని కూడా పిలుస్తారు. ఈ చిన్న పట్నం కర్నాటక లోని షిమోగా జిల్లా లో కలదు. దట్టమైన అడవులు, ఎగిసిపడే జలపాతాలు అన్నిటినీ మించి అందమైన పడమటి కనుమలు ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ ప్రదేశ గుర్తింపుని ఇచ్చాయి.

ఆగుంబే లో విష నాగులు అధికం. ఈ ప్రదేశం లో రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ కూడా కలదు. ఇన్ని ప్రత్యేకతలు కల ఆగుంబే ప్రధాన ఆకర్షణలు పరిశీలించండి.

 సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

ఆగుంబే ఎలా చేరాలి ?
ఆగుంబే బెంగుళూరు నుండి 363 కి. మీ. లు రోడ్డు, రైలు మార్గాలు కలవు. రోడ్డు ప్రయాణంలో సుమారు ఏడూ గంటలు పడుతుంది. విమాన ప్రయాణం లో మంగళూరు నుండి చేరవచ్చు. ట్రైన్ మార్గంలో వెళ్ళాలనుకుంటే, షిమోగా లేదా ఉడుపి ల ద్వారా చేరవచ్చు. ఉడుపి నుండి లక్సరీ బస్సు లలో కూడా ప్రయాణించవచ్చు.

Photo Courtesy: Harsha K R

 సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

సూర్యాస్తమయ దృశ్యాలు
ఆగుంబే ప్రదేశం కొండలపై కలదు. ఆకాశం స్వచ్చంగా వుంటే అద్భుత సూర్యాస్తమయాలు చూడవచ్చు. మైళ్ళ దూరంలో కల అరేబియన్ సముద్రం ఇక్కడ నుండి చూడటం ఒక ప్రత్యేకత.

Photo Courtesy: Arun Kamal Ghanta

 సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

ఎగిసిపడే జలపాతాలు
ప్రసిద్ధి చెందినా కుంచికల్ జలపాతాలు సుమారు పది హీను వందల అడుగుల ఎత్తునుండి పడతాయి. ఇక్కడే ఇంకనూ మీరు బర్కానా జలపాతాలు , ఒనకే అబ్బి, జోగి గుండి మరియు కూడ్లు తీర్థ జలపాతాలు కూడా చూడవచ్చు.

Photo Courtesy: Mylittlefinger

 సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

ట్రెక్కింగ్
ఇక్కడ కల జలపాతాల మార్గాలు ట్రెక్కింగ్ మార్గాలుగా వుంటాయి. అయితే వీటికి వర్ష రుతువులో సందర్శన సూచించ దగినది కాదు. కూడ్లు తీర్థ లో జలపాతాలతో పాటు అందమైన సన్ సెట్ దృశ్యాలు కూడా చూడవచ్చు. జలపాతాల కొలనులో స్విమ్మింగ్ చేయవచ్చు.

Photo Courtesy: Balajirakonda

 సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

ట్రెక్కింగ్ అధికంగా
ట్రెక్కింగ్ ప్రియులు అధికంగా ట్రెక్కింగ్ చేయాలంటే, ఆగుంబే నుండి శ్రింగేరి వరకూ ట్రెక్కింగ్ చేయవచ్చు. మార్గంలో అందమైన నరసింహ పర్వతం ఒక దట్టమైన అడవిలో చూడవచ్చు. శిఖర పై భాగాన సూర్యాస్తమయాలు ఆనందించ వచ్చు. అయితే, జలగలు, ఇండియా లోని ప్రసిద్ధ విష నాగులు వుంటాయి జాగ్రత్త సుమా !
Photo Courtesy: Kalyan Varma

 సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

సుందర సూర్యాస్తమయ ప్రదేశం !

మాల్గుడి డేస్
సమయం ఇంకా వుంటే, సుమారు వంద సంవత్సరాలు పురాతన నివాసం అయిన కావేరి అక్క భవనం చూడండి. ఈమె ఆర్ కే నారాయణ్ రచించిన , టి వి సీరియల్ అయిన మాల్గుడి డేస్ లో అద్భుతంగా నటించిన నటీ మణి . ఇక్కడే కల ఒక రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ కూడా చూడవచ్చు.

Photo Courtesy: Vaikoovery

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X