Search
  • Follow NativePlanet
Share
» »కేరళలో గల కృష్ణాపురం రాజభవనం గురించిన ఆసక్తికరమైన విషయాలు

కేరళలో గల కృష్ణాపురం రాజభవనం గురించిన ఆసక్తికరమైన విషయాలు

కేరళలోని అలప్పుజను సందర్శించినప్పుడు కయంకులంలో గల కృష్ణాపురం ప్యాలెస్ చూడదగిన ప్రదేశాలలో ఒకటి. ఇందులో ఈ అద్భుతమైన పర్యాటక స్థలాన్నిగురించిన ట్రావెల్ గైడ్ ఇవ్వబడింది.

By Venkata Karunasri Nalluru

కేరళ రాష్ట్రానికి చెందిన అనేక రాజభవనాలకు ఘనమైన చరిత్ర వుంది. నేడు వాటిలో చాలా వరకు ఇక్కడ పాలించిన రాజ కుటుంబాల నేతృత్వంలో గల విలాసవంతమైన జీవితాలను మరియు ఇక్కడ గల పర్యాటక ఆకర్షణలను గూర్చి మీరు తెలుసుకోవచ్చు. అటువంటి వాటిల్లో కయంకులం కృష్ణాపురం పాలస్ పర్యాటకులు చూడదగిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం.

కృష్ణాపురం ప్యాలస్ "కయంకులం" రాజ కుటుంబానికి నివాస స్థలముగా ఉండేది. 18 వ శతాబ్దంలో ప్యాలెస్ ను పాలించిన "అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ" ట్రావన్కోర్ రాజవంశానికి చెందినవారు. నేడు ప్యాలెస్ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ద్వారా నిర్వహించబడుతుంది.

how to reach from Alappuzha to krishnapuram palace

PC: Appusviews

కృష్ణాపురం రాజభవనం యొక్క ఆర్కిటెక్చర్:

కృష్ణాపురం రాజభవన నిర్మాణం విలక్షణంగా కేరళ శైలి ప్రకారం నిర్మించబడింది. వాలివున్న పైకప్పులు, ఇరుకైన కారిడార్లు మరియు కిటికీలకు నిలువుగా ఒక ఏటవాలు పైకప్పుతో కన్యాకుమారి పద్మనాభపురం రాజభవనంను పోలి వుంది. ఈ రాజభవనం ట్రావెన్కోర్ పాలకుల ప్రధాన కార్యాలయంగా వుంది.

చక్రవర్తుల పాలన ముగిసిన తర్వాత రాజభవనం పట్టించుకోని స్థితిలో ఉన్నప్పటికినీ ఆర్కియాలజీ శాఖ దానిని పునః నిర్మాణం గావించింది. నేడు అది పునరుద్ధరించబడింది. ఇప్పుడు ఈ రాజభవనం ఒక ప్యాలెస్ ఒక మ్యూజియంగా సేవలు అందిస్తోంది.

how to reach from Alappuzha to krishnapuram palace

PC: Appusviews

కృష్ణాపురం రాజభవనంలో చూడదగిన వస్తువులు:

అనేక కళాఖండాలు మరియు రాజ కుటుంబం యొక్క వస్తువులు ఈ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. రాజభవనం యొక్క మ్యూజియం ప్రధాన ఆకర్షణలలో "గజేంద్ర మోక్షం" ఒకటి. ఇది కేరళలో అతి పెద్ద కుడ్యం. "గజేంద్ర మోక్షం" అంటే అర్ధం "ఏనుగుకు కలిగిన మోక్షం". ఇది హిందూ మత పురాణాల నుంచి తీసుకున్న కుడ్యం. విష్ణుమూర్తిని ఏనుగుల రాజు గజేంద్రుడు పూజిస్తున్నప్పుడు ఇతర దేవుళ్ళు, దేవతలు ఆ దృశ్యంను చూసి తిలకిస్తూ విష్ణుమూర్తికి భక్తితో నమస్కారం చేస్తున్న దృశ్యం. ఈ కళ అద్భుతమైన రంగులతో అద్భుతంగా ఉంటుంది. ఈ కళ ఔత్సాహికులకు ఒక మచ్చు తునక.

how to reach from Alappuzha to krishnapuram palace

PC: Noblevmy

ఇక్కడ చూడవలసిన వస్తువులలో మరో ముఖ్యమైనది ఉంది. అది కయంకులం కత్తి. ఈ కత్తి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇతర ఆయుధాలు కంటే ఇది మరింత ప్రమాదకరమైనది. దీనికి రెండు భుజములు బాగా పదును చేసి వుంటుంది. బుద్ధ మండపం అనే ఒక హాలులో బుద్ధుని యొక్క ఒక అరుదైన విగ్రహం ఉంది. అలప్పుజ చెరువుల నుండి వెలికితీసిన నాలుగు విగ్రహాలలో ఇది ఒకటి. మ్యూజియం ఇతర ప్రదర్శనలలో భాగంగా ట్రావెన్కోర్ రాజ కుటుంబీకులు ఉపయోగించిన సంస్కృతంలో బైబిల్ యొక్క ఒక కాపీని, నూనె దీపాలు, సూక్ష్మ సంఖ్యలు, పాత్రలకు మరియు ఇతర అంశాలకు సంబంధించిన వస్తువులు చూడవచ్చును.

how to reach from Alappuzha to krishnapuram palace

PC: Appusviews

కృష్ణాపురం రాజభవనం ఎలా చేరాలి?

కృష్ణాపురం భవనం అలప్పుజ నుండి 47 కిలోమీటర్ల దూరంలో వున్న "కయంకులం" వద్ద ఉంది. మీరు అలప్పుజ నుండి కయంకులంనకు ఒక టాక్సీలో లేదా లేదా ప్రజా రవాణా మార్గాల ద్వారా ప్రయాణం చేయవచ్చును.

రాజభవనం నుండి కయంకులం జంక్షన్ రైల్వే స్టేషన్ కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజభవనం సమీపంలోని విమానాశ్రయం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది రాజభవనం నుండి 102 కి.మీ దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X