అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

నవ నందుల క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా ?

Written by: Venkatakarunasri
Updated: Wednesday, June 28, 2017, 11:41 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: షిరిడిలో వి ఐ పి దర్శనం కావాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు

ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానం

ఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు

పరమేశ్వరుని ప్రమద గణాలలో నందీశ్వరుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈయన ఆ మహేశ్వరునికి పరమ భక్తుడిగా,వాహనంగా మన హిందు పురాణాలలో చెప్పబడింది.

అందుకనే ప్రతి శివాలయంలో ఖచ్చితంగా నందీశ్వరుని విగ్రహం వుంటుంది.

అటువంటి నందీశ్వరునికి మన తెలుగురాష్ట్రాలలో అతి పురాతనమైన 9 నంది క్షేత్రాలున్నాయి.

మరి ఆ క్షేత్రాలు ఎక్కడ వున్నాయి. ఆ క్షేత్రాల యొక్క విశిష్టత ఏమి? ఆ క్షేత్రాల యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం.

నవ నందుల క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా ?

1. స్థలపురాణం

పూర్వం పాండువంశానికి చెందిన నందరాజులు పాలించిన ప్రాంతం కావున నందుల రాజ్యంగా పిలవబడి కాలక్రమంలో నంద్యాలగా స్థిరపడింది.

PC: youtube

 

2. చంద్రగుప్తమౌర్యుడు

తదనంతర కాలంలో చంద్రగుప్తమౌర్యుడు వీరిని ఓడించి ఆ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకున్నట్లుగా పెక్కు శాసనాలు లభించాయి.

PC: youtube

 

3. గోపాలకులు

నందరాజు పాలనాకాలంలో ఆయనకు గల గోమందలను గోపాలకులు దాపులో వున్న అటవీ ప్రాంతానికి మేతకు తీసుకుని వెళ్ళేవారు.

PC: youtube

 

4. సమీపంలోని పుట్ట

ఒకనాడు మందలోని ఒక ఆవు సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి నిలబడగానే పొదుగు నుండి పాలు వాటంతట అవే ధారగా రావటం, పుట్ట నుండి ఒక బాలకుడు వెలుపలకు వచ్చి ఆ క్షీరాన్ని స్వీకరించటం చూసిన పశుపాలకుడు రాజుకు ఆ విషయాన్ని తెలిపాడట.

PC: youtube

 

5. బాలుడు అదృశ్యమగుట

అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూచుట కొరకు మరుసటి రోజు రాజు అరణ్యంలోకి వెళ్ళాడట.

PC: youtube

 

6. బాలుడు అదృశ్యమగుట

పాలను స్వీకరిస్తున్న బాలుని మరింత దగ్గరగా చూడాలనే కుతూహలంతో ముందుకు రావటం వలన కలిగిన అలికిడికి గోవు బెదిరి పుట్టను తొక్కుకుంటూ వెళ్ళగా బాలుడు అదృశ్యమయ్యాడట.

PC: youtube

 

7. స్వప్న దర్శనం

తన దురదృష్టానికి చింతిస్తూ నిద్రిస్తున్న నందునికి నాటి రాత్రి మహేశ్వరుడు స్వప్నంలో దర్శనం ప్రసాదించి ఆ బాలుడు తానేనని, శిలాదమహర్షి తనయుడైన మహానంది ఇక్కడ తపస్సు చేసి తన వాహనమయ్యే వరం కోరుకున్నాడని తెలిపారు.

PC: youtube

 

8. మహా పుణ్యతీర్ధం

అతని పేరు మీద ఈ క్షేత్రం మహా పుణ్యతీర్ధంగా పేరుపొందుతుందని పుట్టలో వున్న తన రూపానికి ఆలయం నిర్మించమని చెప్పాడట.

PC: youtube

 

9. దివ్యస్థానాలు

అంతేకాకుండా తాను అతని రాజ్యంలో మరో 8 దివ్యస్థానాలలో వివిధ కారణాల వలన వివిధ రూపాలలో నందీసమేతంగా వెలసి వున్నానని వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావలసిందిగా ఆదేశించాడట.

PC: youtube

 

10. ఆలయాలు

దీనికి ఎంతగానో ఆనందించిన నందుడు సర్వేశ్వరుని ఆనతి ప్రకారం అన్నిచోట్ల ఆలయాలు నిర్మించారు.

PC: youtube

 

11.విజయనగర రాజులు

ఈ వంశం వారి తర్వాత పాలించిన వెలనాటి చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాల అభివృద్దికి విశేష కృషి చేసారని లభించిన శాసనాలు తెలుపుతున్నాయి.

PC: youtube

 

12. ఈ నవనంది క్షేత్రాల పేర్లు

మహానంది,నాగనంది, సోమనంది, సూర్యనంది, శివనంది, విష్ణునంది, గరుడనంది మరియు వినాయకనంది

PC: youtube

 

13. 9 ఆలయాలు

ఈ 9 ఆలయాలలో ప్రధమనంది, నాగనంది, సోమనంది అనే 3 ఆలయాలు నంద్యాల పట్టణంలో వుండగా ,మహానంది, గరుడనంది, వినాయక నంది అనే 3 ఆలయాలు మహానందిలో, సూర్యనంది, శివనంది, విష్ణునంది అనే 3 ఆలయాలు మహానందికి నంద్యాలకు మధ్యలో మార్గమధ్యంలో వున్నాయి.

PC: youtube

 

14.క్షేత్ర సందర్శనం

సోమవారం, పౌర్ణమి, మాసశివరాత్రి, త్రయోదశి రోజులలో ఉదయం నుండి సాయంత్రం లోపల ఈ నవనందుల క్షేత్ర సందర్శనం శుభదాయకంగా భక్తులు పరిగణిస్తారు.

PC: youtube

 

15. వుత్సవాలు

శివరాత్రి నాడు అన్ని చోట్ల విశేషంగా వుత్సవాలు నిర్వహిస్తారు.

PC: youtube

 

16. శ్రీ సాక్షి మల్లికార్జునస్వామి

ఈ నవనంది యాత్రకు బయలుదేరే ముందు నంద్యాల పట్టణంలోని శ్రీ సాక్షి మల్లికార్జునస్వామికి మ్రొక్కి ఆరంభించాలంటారు.

PC: youtube

 

17. ఎలా వెళ్ళాలి ?

English summary

Amazing Facts About 9 Nandi Temples Of Mahanandi

Within 15 km of Mahanandi, there are nine Nandi shrines known as Nava nandulu. Mahanandi is one of the Nava Nandis. The Mahanandiswara Swamy Temple, an important shrine, is located here. This ancient temple dates back over 1,500 years. The inscriptions of 10th century tablets speak of the temple being repaired and rebuilt several times.
Please Wait while comments are loading...