Search
  • Follow NativePlanet
Share
» »సిద్ది వినాయకుడు ఆలయం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

సిద్ది వినాయకుడు ఆలయం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

ఇండియాలో ఉన్న వినాయకుని ఆలయాలలో కెల్లా అత్యంత ప్రసిద్ధి చెందినది ముంబై లోని సిద్ధి వినాయక ఆలయం లేదా మందిర్. ముంబై లోని ప్రభాదేవి అనే ఏరియాలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయాన్ని నవంబర్ 19, 1801 వ సంవత్సరంలో లక్ష్మణ్ విత్తు మరియు దూబే పాటిల్ లు కట్టించారు.

సిద్ధి వినాయక ఆలయం మొదట చిన్నది గా ఉండేది. తర్వాత ... తర్వాత భక్తులు రావటంతో ఆలయాన్ని పెద్దగా ఏర్పాటుచేశారు. దేవాలయ శిల్ప తీరు యాత్రికులను ఆకట్టుకుంటుంది. ఆలయ గర్భగుడి చెక్క తలుపులు అష్టవినాయక చిత్రాలతో అందంగా చెక్కబడి ఉంటుంది. గర్భగుడి పైకప్పుకు బంగారం పూత తాపడం చేసి ఉంటారు.

సిద్ది వినాయక ఆలయం

సిద్ది వినాయక ఆలయం

చిత్ర కృప : Darwininan

ఆలయ దర్శనానికి తరచూ భక్తులు వస్తుంటారు. ఇప్పటివరకు రాజకీయనాయకులు, బాలీవూడ్ సినిమాయాక్టర్లు ఇలా ఎందరో ఈ ఆలయాన్ని దర్శించారు. మొన్నీమధ్య ఇండియా పర్యటన కై వచ్చిన యాపిల్ సిఇఓ కూడా తెల్లవారు జామున ఆలయంలో ప్రార్థనలు చేసాడు.

వినాయక ఆలయం బాలీవూడ్ సినిమాయాక్టర్లకు సెంటిమెంట్ గా చెప్పవచ్చు. సంజయ్ దత్ జైలు నుంచి విడుదలయ్యాక మొదట దర్శించింది సిద్ధి వినాయక ఆలయాన్నే !!

ముంబై లోని సిద్ది వినాయక ఆలయం గురించి మీకు తెలియని 5 విషయాలు ఇవిగో మీరే చదవండి

01. శ్రీ సిద్ధి వినాయ ఆలయం దేశంలోనే అత్యధిక సంపద కలిగిన ఆలయాలలో ఒకటి. దాతలు, బహుమానాలు, హుండీ లో వేసే నగదు రూపేణా ప్రపంచం మొత్తం మీద అన్ని చోట్ల నుండి సంవత్సరానికి 100 మిల్లియన్ల నుండి 150 మిలియన్ల వరకు ఆదాయం వస్తుంది.

ఆలయంలోని వినాయకుడు

ఆలయంలోని వినాయకుడు

02. ఈ ఆలయం మొదట ఇటుకలతో నిర్మించబడి, 3.6 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేది. కాలక్రమంగా నేడు ఆరు అంతస్తుల భవనం గా ఉన్నది. అగ్రి సమాజ్ కు చెందిన దూబే పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని నిర్మించింది.

03. పిల్లలు కలగని ఆడవాళ్లు సిద్ది వినాయకుడిని దర్శిస్తే పిల్లకు కలుగుతారని నమ్మకం.

04. ఈ ఆలయంలో వినాయకుడి ఎత్తు 2. 6 అడుగులు. వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఆలయ ప్రత్యేకత.

ఆలయం వద్ద పూజా సామాగ్రి షాప్ లు

ఆలయం వద్ద పూజా సామాగ్రి షాప్ లు

చిత్ర కృప : Deepa Krishnan

05. సిద్ధివినాయక విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావళం, మరో చేతిలో కుడుములు పాత్ర ఉన్నవి.

06. సిద్ధివినాయక కాంప్లెక్స్ సమీపాన ఉన్న ఆటస్థలం క్రీ.శ. 19 వ శతాబ్దంలో ఏర్పాటయింది. అప్పుడు అక్కడ ఒక సరస్సు ఉండేదట. ప్రస్తుతం కాలనీ ఏర్పడి సంరక్షిస్తున్నారు.

07. సిద్ధివినాయ ఆలయ కాంప్లెక్స్ లో ఉన్న హనుమాన్ ఆలయం 1952 లో కట్టించారు. ఆలయ సమీపంలో రోడ్డు పనులు నిర్వహిస్తుంటే హనుమాన్ ఆలయం తవ్వకాలలో బయటపడింది. ఆలయ పెద్ద పూజారి విగ్రహాన్ని శుద్ధిచేసి, ప్రతిష్టించారు.

సిద్ది వినాయక ఆలయంపై కప్పు

సిద్ది వినాయక ఆలయంపై కప్పు

చిత్ర కృప : Harini Calamur

మీరు ఇక్కడకు సరైన రోజులలో, సరైన సమయాలలో చేరాలి. లేదంటే, పొడవాటి క్యూలలో నిలబడి గంటల తరబడి మీ సమయం అంతా ఇక్కడ వెళ్ళబుచ్చాల్సిందే. దేవాలయ శిల్పం తీరు మరియు యాత్రికుల నిర్వహణ వంటివి పేర్కొనదగిన అంశాలు.

కనుక మీరు మరోసారి ముంబై వెళితే, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సిద్ధి వినాయక ఆలయాన్ని తప్పక సందర్శించండి

చిరునామా : ఎస్ కె బోలె మార్గ్, ప్రభాదేవి, ముంబై, మహారాష్ట్ర 400028
ఫోన్ నెంబర్ : 022 2437 3626

ఆలయంలో బారులు తీరిన భక్తులు

ఆలయంలో బారులు తీరిన భక్తులు

సిద్ధివినాయక ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

సిద్ధి వినాయక ఆలయానికి చేరుకోవటానికి ముంబై లోని అన్ని ప్రాంతాల నుండి సిటీ బస్సు సౌకర్యం, మెట్రో సౌకర్యం కలదు.

ముంబై ఎలా చేరుకోవాలి ?

విమానం ద్వారా : ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. ప్రపంచ దేశాల నుండి ఇక్కడికి తరచూ విమానాలు వస్తుంటాయి.

రైలు ద్వారా : ముంబై లో రైల్వే స్టేషన్ లు కలవు. దేశంలోని అన్నిప్రధాన నగరాల నుండి రైళ్లు ముంబై కు వస్తుంటాయి.

బస్సు ద్వారా : హైదరాబాద్, బెంగళూరు, పుణె, నాగ్ పూర్ తదితర ప్రాంతాల నుండి ముంబై కు బస్సులు కలవు.

మీ విలువైన సలహాలు, సూచనలు దిగువన ఉన్న బాక్స్ లో తెలుపగలరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X