అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

కడప అమీన్ పీర్ దర్గా గురించి తెలియని రహస్యాలు !

Written by: Venkata Karunasri Nalluru
Updated: Saturday, June 17, 2017, 14:02 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో వుందో మీకు తెలుసా?

కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా. అన్ని మతాల ప్రజలచే సందర్శింపబడే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది. పర్యాటకులు అలాగే స్థానికులు ఈ మందిరానికి విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుస్సైని మరియు అరుఫుల్ల హుస్సైని అనే ఇద్దరి సాధువుల యొక్క దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి విచ్చేస్తారు. ఈ మందిరంలో ఈ సాధువుల యొక్క సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్ధించడం ద్వారా కోరికలు తీరతాయని ప్రజల నమ్మకం.

ఈ ఇద్దరు సాధువుల వారసులు కూడా ఈ మందిరంలో పనిచేస్తున్నారు. వేరే సిబ్బంది నుండి వీరిని గుర్తించేందుకు సులువుగా కాషాయ దుస్తులు వీరు ధరిస్తారు. కాషాయ రంగు టోపీ ల నే ఈ ఇద్దరు సాధువుల యొక్క భక్తులు ధరిస్తారు. ప్రవక్త మహమ్మద్ యొక్క వారసుడు పీరుల్లహ్ హుస్సేన్ అని ఎక్కువ మంది నమ్మకం. భారత దేశం లో ని అన్ని సూఫీ సాధువుల దర్గాలని సందర్శించే ఇతను అజ్మీరు విన్నపం వల్ల కడప లో స్థిరపడ్డారు.

తరాలు మారినా అవిచ్ఛిన్నంగా పరిఢవిల్లుతూ సర్వమతాల సంస్కృతీ ప్రతీకగా వెలుగొందుతోంది కడప పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా). మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక సంపదకు, భక్తి శ్రద్ధలకు నిలయమైన మన దేశంలో వెలసిన ఈ దర్గాలో సాహెబ్‌ను దర్శించి విభూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.

ఇది కూడా చదవండి: కడప - విభిన్న సంస్కృతుల నిలయం !!

ఈ నెలలో టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. పెద్ద దర్గా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో కొలువైన ఈ అమీన్ పీర్ దర్గాను కడప జిల్లా వాసులు పెద్ద దర్గాగా పిలుస్తుంటారు. ఈ పెద్ద దర్గా ప్రాంగణంలో 18 మజార్‌లు కలిగిన దర్గా ఉంది.

pc:rajaraman sundaram

2. మజార్‌

ఇక్కడ సంవత్సరంలో ప్రతినెలలోనూ గంధం, ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటాయి. అందులో 5 దర్గాలకు చెందిన మజార్‌లకు మాత్రమే ప్రత్యేకంగా ఉరుసు ఉత్సావాలను ఘనంగా నిర్వహిస్తుంటారు.

pc: youtube

3. ప్రథమ సూఫీ హజ్రత్ ఖ్వాజా

దర్గా చరిత్రను చూస్తే.. ఆస్తానే-యే-ముగ్దుమ్ ఇలాహి ప్రథమ సూఫీ హజ్రత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మహమ్మద్ మహ్మదుల్ హుస్సేని చిస్టివుల్ ఖాదీ నాయబ్-యే-రసూల్ సాహెబ్ కర్నాటక ప్రాంతంలోని బీదర్ నుంచి 16వ శతాబ్దంలో కడపజిల్లాలో అడుగుపెట్టారు.

pc: youtube

4. దైవాంస సంభూతులు

1683లో కడపకు వచ్చిన ప్రవక్త మహమ్మద్ వంశీయుడైన సాహెబ్ నిరాడంబరులు, దైవాంస సంభూతులుగా పేరుగాంచారు.

pc: youtube

5. మతసామరస్యానికి ప్రతీక

కడపజిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందంటే అందుకు కారణం అమీన్ పీర్ దర్గాయేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతియేటా జరిగే ఉరుసు ఉత్సవాల్లో మహమ్మదీయ భక్తులతోపాటు హిందువులు, క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు.

భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని రామాలయం ఎక్కడుందో తెలుసా ?

pc: youtube

6. సామాజిక సేవా కార్యక్రమాలు

సాహెబ్ 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవ సమాధి అయ్యారు. అప్పట్లోనే పెద్ద దర్గాను ఇక్కడ నిర్మించారు. ఈయన ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆరీఫుల్లో హుస్సేనీ కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహమ్మద్ హుస్సేనీ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు.

pc: youtube

7. పీఠాధిపతి

కడప పీఠాధిపతుల మరణానంతరం సాహెబ్ పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ కొనసాగుతున్నారు.

pc: youtube

8. వాటర్‌వర్క్స్

ఆరీఫుల్లా హుస్సేనీ వారసుడైన హజ్రత్‌ సూఫీ సర్మస్‌సానీ చిల్లకష్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మహమ్మద్‌ మహమ్ముదుల్‌ హుస్సేనీసానీ 11వ ఏట ఇంటి నుంచి వెళ్ళి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశారు. అటు తరువాత కడప సమీపంలోని గండి వాటర్‌వర్క్స్ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేశారు.

న‌ల్ల‌మ‌ల వ‌జ్రాల కొండ గుహలో దాగిన మహా అద్భుతం !

pc: youtube

9. గొర్రెల కాపరి

హుస్సేనీసానీ తపస్సు చేస్తున్నట్లు ఓ మేకలకాపరి గుర్తించాడు. ప్రతిరోజూ ఒక మేక కొండల్లోకి వెళ్లి వస్తుండటాన్ని గమనించిన మేకలకాపరి ఓ రోజు దాన్ని వెంబడించగా, అక్కడ పెద్ద జడలున్న వ్యక్తి తపస్సులో నిమగ్నమై ఉండటాన్ని గమనించాడు. వెంటనే గొర్రెల కాపరిని రాకను పసిగట్టిన హుస్సేనీసానీ ఈ విషయంగనుక బయటపెడితే నీకే అరిష్టమని హెచ్చరించినట్లు చరిత్ర చెబుతోంది.

pc: youtube

10. ఆశ్చర్యపోయిన గొర్రెలకాపరి

అలాగే స్వామీ మీరు చెప్పినట్లే చేస్తాను నా సందేహాన్ని మాత్రం తీర్చండని గొర్రెలకాపరి హుస్సేనీసానీని అడిగాడట. వెంటనే ఆయన పక్కనే ఉన్న పెద్ద పామును చూపించి దానికి పాలు ఇచ్చి వెళ్తున్నట్లు చెప్పారట. దానికి ఆశ్చర్యపోయిన గొర్రెలకాపరి, తన తల్లికి కంటిచూపు లేదనీ, చూపు తెప్పించమని ఆ స్వామిని ప్రార్థించాడట. దాంతో మేకతోపాటు మీ తల్లిని కూడా ఇక్కడికి తీసుకురమ్మని హుస్సేనీసానీ చెప్పారట.

pc: youtube

11. గొర్రెలకాపరి తల్లి

వెంటనే గొర్రెలకాపరి తల్లి, మేకతో సహా స్వామివద్దకు వచ్చాడట. మేకపాలతో కాపరి తల్లి కళ్లు శుద్ధిచేసిన స్వామి ఆమెకు కంటిచూపు తెప్పించారట. ఆ రోజు నుంచి కడప దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందని, ఉత్సవంలో స్వామి పోలికలు ఉండే ఓ మహిళ కనిపించటంతో తదేకంగా ఆమె వంక చూస్తుందనీ, విషయం ఏంటని ప్రశ్నించగా, కొండగుహల్లో మీలాగే ఓ స్వామీజీ ఉన్నారంటూ ఆమె వివరిస్తుందని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: తిరుమల తొలిగడప - దేవుని కడప !!

pc: youtube

12. ఆనవాయితీ

దాంతో ప్రజలంతా ఆ గుహల్లోకి వెళ్లి చూడగా అక్కడ తపస్సు చేస్తున్న హుస్సేనీసానీని గుర్తించి, పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుస్సేనీ వంశీయులు కోరతారు. పది రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో వారు అక్కడనుంచి స్వామిని ఊరేగింపుగా తీసుకుని వస్తారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతుండటం విశేషంగా చెప్పవచ్చు.

pc: youtube

13. పెద్ద దర్గాకు పీఠాధిపతి

పెద్ద దర్గాకు ఆరీఫుల్లా హుస్సేనీ మొదలు ఇప్పటిదాకా 11 మంది పీఠాధిపతులు కొనసాగారు. అమీనుల్లా హుస్సేనీ మరణానంతరం ఆయన కుమారుడు 1993లో 11 సంవత్సరాల వయస్సులో పెద్ద దర్గాకు పీఠాధిపతి అయ్యారు.

pc: youtube

14. ఉరుసు ఉత్సవం

పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో చెప్పుకోదగ్గది "పీరుల్లా మాలిక్ హుస్సేనీ" ఉరుసు ఉత్సవం. ఇది ఉర్దూ నెల ప్రకారం మొహర్రం నెలలో జరుగుతుంది. ఆరీఫుల్లా హుస్సేనీ ఉరుసు ఏడురోజులపాటు "మదార్" నెలలో జరుగుతుంది.

pc: youtube

15. తేరాతేజీ

దాదా ముర్షాద్ అమీనుల్లా హుస్సేనీ ఉరుసు ఉత్సవం "ఖాదర్" నెలలోనూ, హేదుల్లా హుస్సేనీ ఉరుసు ఉత్సవం "రంజాన్" మాసంలోనూ జరుపుతుంటారు. అలాగే అమీనుల్లా హుస్సేనీ ఉరుసు పండుగ "తేరాతేజీ" నెలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు !

pc: youtube

16. గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు

పెద్ద దర్గాకు మన దేశమంతటా సుమారు 27 లక్షలమందికి పైబడే శిష్యులున్నట్లు చెబుతుంటారు. మన దేశం నుంచేగాక గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు ఈ దర్గాకు తరలివస్తుంటారు. మతగురువులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అనేకసార్లు ఈ దర్గాను దర్శించుకుంటుంటారు.

pc: youtube

17. మత సామరస్యం

కడపజిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందంటే అందుకు కారణం అమీన్ పీర్ దర్గాయేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతియేటా జరిగే ఉరుసు ఉత్సవాల్లో మహమ్మదీయ భక్తులతోపాటు హిందువులు, క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు.

pc: youtube

18. ఉపాధి శిక్షణా మార్గాలు

సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పేరుపొందిన ఈ దర్గా పేద ముస్లిం బాలలకు ఉచితంగా సాధారణ, సాంకేతి విద్యను అందిస్తోంది. యువతులు, మహిళలకు కుట్టు తదితర ఉపాధి శిక్షణా మార్గాలను చూపిస్తోంది.

pc: youtube

19. పీఠాధిపతుల ఆశీస్సులు

ఉత్సవాల సందర్భంగా పెద్ద దర్గాను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులందరికీ మూడుపూటలా భోజన వసతి అందిస్తుంటారు. దర్గాలోని స్వామి పూజల అనంతరం పీఠాధిపతుల ఆశీస్సుల కోసం భక్తులు వేచి ఉంటారు.

pc: youtube

20. సర్వరోగ నివారిణి

పీఠాధిపతి సూచనల మేరకు అక్కడున్న తీర్థాన్ని సేవిస్తే సర్వరోగాలూ మటుమాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా అమీన్ పీర్ దర్గాలో స్వామి పూజ కోసం, పీఠాధిపతి ఇచ్చే తీర్థం కోసం అన్నిమతాల ప్రజలూ లక్షల సంఖ్యలో తరలివస్తుంటారు.

pc: youtube

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

English summary

Ameen Peer Dargah In Kadapa

Ameenpeer Dargah is a sufi shrine located in the Kadapa City in Andhra Pradesh.
Please Wait while comments are loading...