Search
  • Follow NativePlanet
Share
» »రామాయణంలో 'కిష్కింద' ఇదే !!

రామాయణంలో 'కిష్కింద' ఇదే !!

పురాణాల్లో కిష్కిందకాండ అనే పేరు మీరు వినే ఉంటారు కదా ! ఆ ప్రదేశమే ప్రస్తుత ఆనెగుంది ప్రాంతం. ఇక్కడే ఆంజనేయస్వామి మొదటగా సీతారామలక్ష్మణులను కలిసింది.

By Mohammad

ప్రదేశం : ఆనెగుంది/ఆనెగొంది

జిల్లా : కొప్పల్

ప్రధాన ఆకర్షణలు : ఆంజనేయపర్వతం - ఆంజనేయస్వామి జన్మస్థలం, పంపా నది (పంచసరోవరాలలో ఒకటి), వీరభద్రస్వామి ఆలయం, ఆనెగుంది కోట మొదలగునవి.

చుట్టుప్రక్కల పర్యాటక ప్రదేశాలు : హంపి, హొస్పెట్ - ఆల్మట్టి డ్యాం

సమీప పట్టణం/నగరం : బళ్ళారి

రాష్ట్రం : కర్నాటక

కర్నాటక రాష్ట్రం బళ్ళారి దగ్గరున్న హాస్పేట్ కు సమీపం లో ఆనెగొంది చారిత్రక ప్రదేశం. దీనికి సమీపం లో అంజనాద్రి పై శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. ఆనే గొంది అంటే కన్నడం లో ''ఏనుగుల మడుగ". ఇక్కడే ఏనుగులు విశ్రాంతి తీసుకొనేవి. కృష్ణ దేవరాయల కాలం లో విజయనగర సామ్రాజ్యం లో దీనికి ప్రాధాన్యం ఉంది. అలాగే రామాయణ కాలానికీ ఈ ప్రదేశానికి సంబంధం ఉంది. తుంగ భద్రా తీరం లో కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలో ఆనెగొంది ఉంది.

కిష్కింద ప్రాంతం

కిష్కింద ప్రాంతం

చిత్రకృప : Indiancorrector

హంపికి ఇది నలభైమూడు కిలోమీటర్ల దూరం. ఇదే రామాయణం లోని కిష్కింద. ఇది విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఆనే గొంది శిల్పకళా వైభవం ఇప్పటికీ చెక్కు చెదరకుండా కాపాడబడుతోంది. ఇక్కడ ఎన్నో దేవాలయాలు, దేవాలయ సముదాయాలు ఉన్నాయి అందరూ చూసి తీరాల్సినవే.

శ్రీ కృష్ణ దేవరాయల సామ్రాజ్య వైభవానికి స్పూర్తి చిహ్నం ఆనెగుంది. హంపీ పురాతన వార సత్వ సంపదకు ప్రపంచ గుర్తింపు ఉన్న చోటు. ఇక్కడి అంజనాద్రి పైననే వానర వీరుడు శ్రీ హనుమాన్ జన్మించాడు. ఇక్కడి ఋష్యమూక పర్వతం వాలి సుగ్రీవుల కధకు ప్రాధాన్యత కలిగి ఉంది.

వాలి, సుగ్రీవ యుద్ధం

వాలి, సుగ్రీవ యుద్ధం

చిత్రకృప : BrooklynMuseumBot

ఆనెగొంది దాని చుట్టు ప్రక్కల ప్రదేశాలు రామాయణ గాధతో ముడి పడి ఉన్నాయి. మహా బలి వాలి కిష్కిందా సామ్రాజ్యం ఇదే. శ్రీరాముడు వాలి తమ్ముడు సుగ్రీవునికి అన్న వాలిని చంపి కిష్కింధకు పట్టం కట్టాడు. ఇక్కడే సుగ్రీవ శ్రీరామ సఖ్యాన్ని ఆంజనేయస్వామి కుదిర్చాదన్న సంగతీ మనకు తెలిసిందే. "ది కిష్కింధ ట్రస్ట్" ఆధ్వర్యం లో టూరిజం డిపార్ట్ మెంట్ ఆనే గొందిని రోల్ మోడల్ విలేజ్ గా రూపొందించారు.

ఇక్కడ దర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలలో ముందుగా చెప్పుకోదగినది "నవ బృందావనం" తుంగభద్రా నదిలో ఉన్న చిన్న ద్వీపం లో ఉన్నది. మధ్వాచార్య మతానికి చెందిన ప్రసిద్ధ యోగులకు చెందిన తొమ్మిది బృందావనాలు అంటే సమాధులున్నాయి. ఆనెగొంది దగ్గర నది దాటి నవ బృందావనం చేరుకో వచ్చు. లేకపోతే హంపీ గుండా చేరుకోవచ్చు. పవిత్రమైన ఈ మధ్వాచార్యుల బృందావనాలను భక్తీ ప్రపత్తులతో దర్శించి తరిస్తారు.

ఆంజనేయ ఆలయం

ఆంజనేయ ఆలయం

చిత్రకృప : Indiancorrector

రెండవ దర్శనీయ స్థలం "నింబ వనం" ఇదే వానర వీరుడు వాలి ని దహనం చేసిన చోటు. ఆతని శరీర చితా భస్మం పెద్ద కుప్పగా కనిపించి ఆశ్చర్యమేస్తుంది. మరొకటి ఆర్కలాజికల్ మ్యూజియం. ఇందులో విజయనగర సామ్రాజ్యానికి చెందిన అనేక వస్తువులు భద్రపరచారు.

అ౦జనాద్రిపై శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చూసి స్వామి జన్మించిన ప్రదేశాన్ని దర్శించి పునీతులౌతారు. ఇక్కడే "ఏడు తలల సర్పం" ఆరాధనీయం గా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి : హంపి లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

శ్రీ కృష్ణ దేవరాయలు 64 విద్యలలో మహా నేర్పరి. ఆ విషయాన్ని గుర్తు చేయటానికి ఇక్కడ 64 స్తంభాలతో ఆయన సమాధిపై ఒక మండపం నిర్మించారు. ఇదీ చూడదగిన ప్రదేశమే. ఆనెగుంది ఇతిహాస ,చారిత్రాత్మక ప్రాధాన్యత గల నగరం.

పంపా సరస్సు

పంపా సరస్సు

చిత్రకృప : Indiancorrector

ఆనెగుంది చుట్టుప్రక్కల చూడవలసిన పర్యాటక స్థలాలు

పంపా సరోవరం - లక్ష్మి టెంపుల్, గగన్ ప్యాలెస్ లేదా గగన్ మహల్ - క్రీ.శ.16 వ శతాబ్దంలో నిర్మించారు. ఆనెగుంది ఫోర్ట్, కృష్ణదేవరాయల సమాధి, నవ బృందావనం, ఏడుతలల పాము, గణేష్ ఆలయం, రంగనాథ స్వామి ఆలయం, జైన్ ఆలయం, గరుడ స్థంభం, శివాలయం, కిష్కిందకాండ బ్రిడ్జి, అంజనాద్రి పర్వతం, అంజునాద్రి - హనుమంతుని జన్మస్థలం, తారా పర్వతం దానిపై గల వీరభద్ర స్వామి ఆలయం మొదలగునవి.

ఆనెగుంది ఎలా చేరుకోవాలి ?

ఆనెగుంది ఎలా చేరుకోవాలి ?

చిత్రకృప : Manjunath Doddamani Gajendragad

ఆనెగుంది ఎలా చేరుకోవాలి ?

ఆనెగుంది చేరుకోవాలంటే పర్యాటకులు ముందుగా హంపి చేరుకోవాలి. హంపి నుండి ఆనెగుంది 43 కిలోమీటర్లు. ఆనెగుంది సమీపంలో హొస్పెట్ (37 కి.మీ.), బళ్ళారి (77 కి.మీ.) రైల్వే స్టేషన్ లు కలవు. ఆనెగుంది సమీప విమానాశ్రయం బళ్ళారి దేశీయ విమానాశ్రయం. విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ఆనెగుంది నేరుగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X