అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లివిరిసే అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం

Written by: Venkata Karunasri Nalluru
Updated: Wednesday, May 10, 2017, 12:02 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

హొరనాడు కర్ణాటక రాష్ట్రములోని చిక్కమగళూరు జిల్లాలో చికమగళూరుకు నైఋతి దిశగా 100 కి.మీల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రము. ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లి విరిసే పశ్చిమ కనుమలలో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం ఉన్నది. ప్రధాన దేవతా విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రస్తుతం గల అన్నపూర్ణేశ్వరీ దేవి విగ్రహాన్ని 1973 లో ప్రతిష్ఠించారు.

ప్రకృతి అందాలే కాక, హొరనాడు పట్టణ సందర్శనలో మాత అన్నపూర్ణేశ్వరి దేవాలయం వంటివి కూడా ప్రతి ఒక్కరిని అక్కడకు ఆకర్షిస్తాయి. ఈ దేవత విగ్రహం బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం సందర్శించిన యాత్రికులకు తమ జీవితంలో ఆహార కొరత ఉండదని నమ్ముతారు.

Latest : 2500 నెమళ్ళు కలిసి ఒకేసారి ఆడే నాట్యం చూడాలని వుందా.. అయితే తప్పకుండా వెళ్ళండి మొరాచి చించోలి

ఇతిహాసాల మేరకు శివ భగవానుడు ఒకప్పుడు శపించబడగా, ఈ మాత ఆశీర్వాదాలతో ఆ శాపం వరంగా మారిందని కూడా చెపుతారు. ఈ దేవాలయం సందర్శించిన ప్రతి యాత్రికుడికి రుచికర ఆహారం మాత్రమేకాదు, చక్కగా నిద్రించేందుకు స్ధలంగూడా ఇవ్వబడుతుంది.

ఇది కూడా చదవండి: ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్, హొరనాడు !!

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. అన్నపూర్ణేశ్వరి దేవాలయం

హొరనాడు పట్టణం గురించి ప్రధానంగా చెప్పాలంటే అక్కడి అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి చెప్పాలి. అంతేకాక ప్రకృతి అందాలకు పరవశం చెందేవారు, ఆ మాత యొక్క ఆశీర్వాదం కోరేవారు తమ ఇంద్రియాలను సంతుష్టి పరచేటందుకు హొరనాడు తప్పక సందర్శించాల్సిందే.

PC:official website

2. సారవంతమైన ప్రదేశాలు

ఈ పచ్చటి పట్టణం మల్నాడు ప్రాంతంలో చిక్కమగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిక్కున ఉంది. ఈ ప్రదేశం దట్టమైన అడవులచే కప్పబడి ఎంతో సారవంతమైన ప్రదేశాలు, లోయలు కలిగి ఉంది. ఈ ఆకర్షణలతో కూడిన హొరనాడు పట్టణం అంటే ఇష్టపడని వారుండరు.

PC:official website

 

3. కరుణా కటాక్ష వీక్షణాలు

అమ్మవారి మూలవిరాట్టు బంగారంతో చేయబడిన విగ్రహం. ఈ అమ్మవారిని దర్శిస్తే జీవితంలో అన్నపానాలకు లోటుండదని భక్తుల విశ్వాసం. ఒకసారి శివుడు ఒక శాపానికి గురై శాపవిమోచనార్థం ఈ క్షేత్రాన్ని దర్శించి, అన్నపూర్ణాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల ఫలితంగా తన శాప విమోచనం పొందినాడని భక్తుల విశ్వాసం.

PC:official website

 

4. ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణాదేవి ఆలయం

ఈ ప్రాంతమునకు వెళ్ళుటకు కొన్ని ఘాట్లు, దట్టమైన అడవులు గుండా వెళ్లాలి. ఈ ప్రాంతం దర్శించుటకు వెళ్ళేవారికి, ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణాదేవి ఆలయం యాత్రికులకు, తమ యాత్రకు ఏర్పాట్లు చేసుకోవటంలో ఇది ముఖ్యమైనది.

PC:official website

 

5. హొరనాడు అన్నపూర్ణాదేవి ఆలయం

ఈ క్షేత్ర సందర్శనకు పోవు యాత్రికులకు వరుసగా కుక్కె సుబ్రహ్మణ్య, ధర్మస్థళ, శృంగేరి, ఉడుపి కృష్ణ దేవాలయం మరియు కొల్లూరు మూకాంబిక, కళసలో ఉన్న కాళేశ్వరి ఆలయం వరుసగా వస్తాయి. చివరి యాత్రాస్థలంగా హొరనాడు అన్నపూర్ణాదేవి ఆలయం వస్తుంది.

PC:official website

 

6. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం

హొరనాడు పట్టణ పర్యాటకులు అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇది కర్నాటకలోని పడమటి కనుమలలో భద్ర నది ఒడ్డున ఉంది. దీనినే శ్రీ క్షేత్ర హొరనాడు అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం చుట్టూ అడవులు, పచ్చటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించి దానికి ఆది శక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంగా నామకరణం చేశారు.

PC:official website

 

7. పర్యాటకులు

ఈ దేవాలయంలో పర్యాటకులు మాత అన్నపూర్ణేశ్వరి శ్రీ చక్రాన్ని, చక్ర, శంకు ధరించి చూస్తారు. దేవి గాయత్రిని కూడా తన నాలుగు చేతులతో చూడగలరు. ఎన్నో శతాబ్దాల కిందట, ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ఆగస్త్య మహర్షి ప్రతిష్టించారు.

PC:official website

 

8. అన్నం పెట్టే తల్లి

అన్నపూర్ణేశ్వరి అంటే అందరికి అన్నం పెట్టే తల్లిగా ఈమె కీర్తించబడుతోంది. ఈ కారణంగానే అక్కడి భక్తులకు రోజులో మూడు సార్లు భోజనాలు పెడతారు. నిద్రించేందుకు స్ధలం చూపుతారు.

PC:official website

 

9. అన్నపూర్ణేశ్వరి దేవాలయం సందర్శనవేళలు :

ఉదయం 6:30 నుండి 9:00 గంటల వరకు, 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మరియు సాయంత్రం 7:00 నుండి రాత్రి 9:30 వరకు దేవాలయాన్ని దర్శించవచ్చు.

PC: Prof tpms

 

10. హొరనాడు

కలశేశ్వర దేవాలయం పర్యాటకులు కలశేశ్వర దేవాలయాన్ని కూడా హొరనాడులో సందర్శించవచ్చు. ఈ దేవాలయం హొరనాడుకు అరగంట ప్రయాణంలో కలశ అనే ప్రదేశంలో సమీపంలో భద్ర నది పారుతూండగా ఒక కొండపై ఉంటుంది. దేవాలయంలో రెండు ఏనుగుల విగ్రహాలుంటాయి.

PC: Gnanapiti

 

11. సాక్షాత్కరించిన శివ భగవానుడు

వాటిలో ఒకటి గణేశుడుగాను మరి ఒకటి అతని భార్య లేదా ఆడ ఏనుగుగాను చెపుతారు. రెండూ ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే, మగ ఏనుగు తన కాలికింద ఒక రాక్షస విగ్రహం కలిగి ఉంటుంది. ఈ రాక్షసుడిని భతవంతుడైన గణేశుడు వధించాడని చెపుతారు. పర్యాటకులు కలశేశ్వర విగ్రహాన్ని ఒక లింగం రూపంలో చూస్తారు. దీనినే కలశంలో సాక్షాత్కరించిన శివ భగవానుడిగా కూడా భావిస్తారు.

PC: Wind4wings

 

12. వసతి సదుపాయాలు

హొరనాడు లో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సత్రాలు వసతికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రవేట్ లాడ్జీలు, హోటళ్ళు కూడా గదులను అద్దెకు ఇస్తుంటారు. పండుగలు, ఉత్సవాల సమయంలో గదులు ఒక్కోసారి దొరకవు. అలాంటప్పుడు భక్తులు కలత చెందవలసిన అవసరం లేదు. చిక్కమగళూరు లో భేషుగ్గా వసతి సదుపాయాలు దొరుకుతాయి.

PC: Sssxccal

 

13. ఎలా వెళ్ళాలి ?

హొరనాడు అనే ప్రాంతం బెంగళూరు నుండి 330 కి.మీ. దూరంలో గల అందమైన ప్రాంతం. ఇది శృంగేరి" క్షేత్రం నుండి 75 కి.మీ. దూరంలో గలదు. బెంగళూరునుండి ఈ ప్రాంతానికి ప్రతిరోజూ బస్సులు ఉంటాయి. ఈ క్షేత్రానికి వెళ్ళుటకు అవసరమైన బస్సులను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. కొన్ని ప్రైవేటు బస్సులు కూడా లభిస్తాయి. హొరనాడు నుండి మంగళూరుకు రోడ్డు మార్గంలో పోవుటకు మధ్యలో కార్కళ మరియు కళస అనే ప్రాంతాల మీదుగా పోవాలి.

PC:official website

 

14. విమానాశ్రయం

ఈ ప్రాంతమునకు సమీప విమానాశ్రయం మంగళూరు విమానాశ్రయం. ఈ విమానాశ్రయం యిదివరకు బాజ్‌పే విమానాశ్రయంగా పిలువబడేది. మంగళూరు హొరనాడుకు 136 కి.మీ. దూరంలో ఉంది.

PC:official website

 

15. విశిష్టతలు

హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం సందర్శనకు విచ్చేసిన భక్తులకు జాతి, మత, ప్రాంత మరియు భాషా విభేదాలేవీ లేకుండా పప్పుతో చేసిన ప్రసాదముతో పాటు ముప్పూటలా శాకాహార భోజనము పెడతారు. ఆలయాన్ని సందర్శించే మగ భక్తులు తమ భక్తికి, వినమ్రతకు నిదర్శనముగా చొక్కాలు విడిచి పైభాగాన్ని కండువా లేదా శాలువాను కప్పుకొంటారు.

PC:official website

 

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

English summary

Annapoorneshwari Temple In Hornadu !

Hornadu is a Hindu holy locale and panchayat village located in Chickmagalur district, Karnataka. The deity at the Annapoorneshwari Temple at Hornadu is Annapurneshwari.
Please Wait while comments are loading...