Search
  • Follow NativePlanet
Share
» »సినిమా షూటింగ్‌ ల చిరునామా.... పొల్లాచి !!

సినిమా షూటింగ్‌ ల చిరునామా.... పొల్లాచి !!

తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలోవున్న పొల్లాచికి పర్యాటక పరంగా వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీఇన్నీ కాదు. దక్షిణ కోయంబత్తూర్ లో కల పొల్లాచి, జిల్లాలో రెండవ అతి పెద్ద టవున్ గా చెప్పబడుతోంది. ఈ ప్రదేశం పశ్చిమ కనుమలకు సమీపంలో వుండటంతో సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా వుండటం మాత్రమే కాక మంచి అందమైన ప్రదేశాలు కూడా కలిగి వుంది. కోలీవుడ్ మెుదలుకొని టాలీవుడ్, మల్లువుడ్, బాలీవుడ్ ఇలా ఒకటేమిటీ... భారత్‌లో ఉన్న దాదాపు అన్ని భాషా చిత్రాల ఇక్కడ షూటింగ్‌ జరుగుతుంటాయి అంటే అతిశయోక్తి కలగక మానదు!!
ఇప్పటివరకు 15 వందలకు పైగా చిత్రాలు ఇక్కడ షూటింగ్‌ జరుపుకున్నాయంటే పొల్లాచికి ఉన్న ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వస్తున్న తెలుగు సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు... కనీసం ఒక పాటైనా... పొల్లాచిలో షూటింగ్‌ జరుపుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, డ్యాములు, దేవాలయాలతో ప్రకృతి స్వర్గంగా అలరారుతున్న పొల్లాచిలో కొన్ని టూరిజం స్పాట్‌ల గురించి ఒక లుక్ వేద్దాం పదండి!!

ఫ్రీ కూపన్లు: యాత్ర వద్ద హోటళ్లు బుక్ చేసుకోండి 50%+30% ఆఫర్ పొందండి

ఇందిరాగాంధీ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి అండ్‌ నేషనల్‌ పార్క్‌

ఇందిరా గాంధీ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి అండ్‌ నేషనల్‌ పార్క్‌... అద్భుతమైన అన్నామలై కొండల నెలకొనివుంది. 1961 లో అప్పటి ప్రధానమంత్రి సందర్శన తర్వాత దీని పేరు మార్చారు. ఇది సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తున ఉన్నది. సుమారు 958 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వున్న ఈ పార్క్‌లో వివిధ రకాల మొక్కలు, ఎన్నో రకాల వన్య జీవులు ఉన్నాయి. చిరుతలు, లేళ్ళు, పులులు, ఏనుగులతో పాటు ఇక్కడ అనేక రకాల, అరుదైన పక్షులు కూడా మనం చూడవచ్చు. పార్క్‌ పరిసరాలలో ఉన్న అమరావతి రిజర్వాయర్‌లో మొసళ్ళు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతి ఏటా వందలాది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూవుంటారు.

సినిమా షూటింగ్‌ ల చిరునామా.... పొల్లాచి!!

నేషనల్ పార్క్ లోని కోతి

Photo Courtesy: Bikash Das

అలగునాచి అమ్మన్‌ టెంపుల్‌

అలగునాచి అమ్మన్‌ దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించబడిన అద్భుత ఆలయం. పొల్లాచికి 80 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయాన్ని వల్లియరాచల్‌ ప్రాంతానికి చెందినవారు కట్టించారు. ఈ ఆలయంలో అలగునచి అమ్మవారు వుంటుంది. కొంతమంది వ్యక్తులు ఒక అమ్మవారి విగ్రహంతో అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకొంటుండగా ఆ విగ్రహం అదృశ్యం అయ్యింది. దానితో వారు అక్కడ దేవాలయం నిర్మించారు. అక్కడే వారు స్థిరపడి దేవాలయాన్ని నిర్వహిస్తుండడం విశేషం.

అజియర్‌ డ్యాం

అజియర్‌ డ్యాం పొల్లాచికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అజియార్‌ నది పై 1959-69 మధ్య కాలంలో సాగు నీటి కొరకు ఈ డ్యాం నిర్మించారు. ఈ డ్యాం 81 మీటర్ల ఎత్తు కలిగి... అద్భుతమైన ఇంజనీరింగ్‌ పనితనంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కలిగివుంది. ఇటీవలికాలంలో ఇది ప్రధాన పిక్నిక్‌ స్పాట్‌గా మారింది.

సినిమా షూటింగ్‌ ల చిరునామా.... పొల్లాచి!!

డ్యామ్ అందాలు

Photo Courtesy: Surajram Kumaravel

చిన్నార్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి

ఈ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి పొల్లాచికి 65 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇక్కడ వివిధ రకాల జంతువులు... ప్రత్యేకించి మెరుపులు కల అతి పెద్ద ఉడుత ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. తూవనం వాటర్‌ ఫాల్స్‌, వాచ్‌ టవర్‌లు ఈ ప్రాంత అందాలను మరింత అందంగా చేస్తాయి.

సినిమా షూటింగ్‌ ల చిరునామా.... పొల్లాచి!!

శాంక్చురి అందాలు

Photo Courtesy: Roland zh

ఎలా వెళ్ళాలి??

వాయు మార్గం
పొల్లాచి కి 48 కి. మీ. దూరంలో కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను నడుపుతారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ మొదలగు నగరాల నుంచి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
రైలు మార్గం
పొల్లాచి లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. దీనికి దగ్గరలో ఉన్న స్టేషన్ పోదనూర్ రైల్వే జంక్షన్. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు ప్రయాణించవచ్చు. ఇది ఒక జంక్షన్ కనక రైలు సర్వీసుల గురించి చింత లేదు.
బస్సు మార్గం
పొల్లాచి లో బస్ స్టాండ్ ఉంది. కోయంబత్తూర్, పోదనూర్ తదితర ప్రాంతాల నుంచి నిరంతరం బస్సులు తిరుగుతూనే ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X