Search
  • Follow NativePlanet
Share
» »రాగాలు పలుకుతున్న రాళ్ళ మిస్టరీ

రాగాలు పలుకుతున్న రాళ్ళ మిస్టరీ

రాముని కాలు తగలగానే రాయి అహల్య అయ్యిందంట చాలా ఏళ్ల క్రిందట.మనుషులు రాళ్ళతో అగ్ని పుట్టించారంట.రాళ్ళతో చక్కగా విగ్రహాలు తయారుచేస్తారని మనకు తెలుసు.

By Venkatakarunasri

నల్గొండ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రము నల్గొండ. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా, తూర్పున కృష్ణా జిల్లాలు, పశ్చిమాన శంషాబాదు జిల్లా, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురుటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు.

రాముని కాలు తగలగానే రాయి అహల్య అయ్యిందంట చాలా ఏళ్ల క్రిందట.మనుషులు రాళ్ళతో అగ్ని పుట్టించారంట.రాళ్ళతో చక్కగా విగ్రహాలు తయారుచేస్తారని మనకు తెలుసు. కానీ నల్గొండలో వున్న రాళ్ళను కొడితే మంచి మంచి మ్యూజిక్కులొస్తున్నాయంట.సంగీతం కూడా వస్తుందంట.గంట కొట్టినట్టు చప్పుడు కూడా వస్తుందంట. అవును..నిజంగానే. ఆశ్చర్యపోకండి.నిజంగా చెప్తున్నా.
నోరు లేకుండా సంగీతం పలికే శిలలు ఈ వ్యాసంలో ద్వారా వివరించబడినది.

రాళ్ళు రాగాలు పలుకుతాయని అంటుంటారు.మనదేశంలో చెట్టూ పుట్టా,కొండ,కొండ,కోన,రాయిరప్పలలో సంగీతం ప్రతిధ్వనించటం ఎప్పుడైనా విన్నారా?రాళ్ళు నానా వినోదాన్ని పెంచే అద్భుతాన్ని ఎప్పుడైనా చూసారా?అలాంటి మ్యూజికల్ స్టోన్సే నల్గొండ జిల్లాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఊరవతల వున్నా ఊరంతటినీ ఎప్పటికి కలవరించే శిల్పాలు.కదలలేవు.కానీ మనుష్యుల మనస్సును కదిలిస్తాయి.చూడలేవు.కానీ మన చూపులు వాటిపైకి త్రిప్పుకుంటాయి.ఇదేమిటీ అంత బాగా చెప్తున్నారు.దేని గురించీ?అని అనుకుంటున్నారా?

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

మన నల్గొండ జిల్లాలో అయిటిపాముల అనే ఊరి చివర కొన్ని గుట్టలున్నాయి. దాంట్లో కొన్ని రాళ్ళనుంచి సంగీతం వినపడుతుంది. ఆ శబ్దం కూడా గుళ్ళో గంటకొట్టినట్టే వినిపిస్తుంది.

సంగీత ప్రియులకు వింత అనుభవాలు

సంగీత ప్రియులకు వింత అనుభవాలు

ఇక్కడ ఏ రాయిని చూసినా కూడా ఒక రాయిని చూస్తే కంచు మ్రోగినట్లు,ఇంకొక రాయిని కొడ్తే ఐరన్ మ్రోగినట్లు చాలా విశిష్టమైన రాళ్ళు ఇక్కడ వున్నాయి.

PC:youtube

 అరుదుగా కనిపించే మ్యూజిక్ స్టోన్స్

అరుదుగా కనిపించే మ్యూజిక్ స్టోన్స్

దీన్ని ప్రభుత్వం గుర్తించి ఒక పర్యాటక కేంద్రంగా గుర్తించాలని అక్కడివారు కోరుకుంటున్నారు.సమస్యలతో సతమతమయ్యేవారు కూడా ఇక్కడికి వచ్చి రాళ్ల నాదస్వరాలు విని మనశ్శాంతిని పొందుతున్నారు. ఈ రాయినే డప్పు వాయిద్యంగా మార్చుకుని తమ పాటలను ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్తున్నారు స్థానిక కళాకారులు

PC:youtube

సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి

సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి

పూర్వం రాజులు ఈ కొండను గ్రామానికి రక్షణ కవచంగా, సైరన్ గా వినియోగించేవారు. శత్రుమూకలు తెలంగాణా సాయుధ పోరాటంలో నైజాం సేనల రాకలను పసిగట్టి గ్రామస్తులను అప్రమత్తులను చేసేందుకు ఈ రాళ్ళతో శబ్దం చేసేవారు. అప్పటి నుండి ఈ కొండను 'నగారా' అని పిలుస్తుంటారు.

PC:youtube

రాళ్ళపై ఒక్కో చోట ఒక్కో సంగీత నాదం

రాళ్ళపై ఒక్కో చోట ఒక్కో సంగీత నాదం

నాద బ్రహ్మ శిలారూపం దాల్చాడు.ఇక్కడ కనిపిస్తున్న శిల నుంచి స్వరాలు పలుకుతున్నాయి.సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతున్నాయంటారు.

PC:youtube

 కి.మీ దూరం వరకూ వీనుల విందు చేస్తున్న స్వరాలు

కి.మీ దూరం వరకూ వీనుల విందు చేస్తున్న స్వరాలు

కానీ కరగటం మాట అలా వుంచితే నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల నగారా గుట్టపై వున్న ఈ రాళ్ళు రాగాలు పలుకుతున్నాయి.

PC:youtube

వింటాను చూట్టానికి తండోపతండాలుగా వస్తున్న ప్రజలు

వింటాను చూట్టానికి తండోపతండాలుగా వస్తున్న ప్రజలు

కమ్మని వినసొంపైన శబ్దాలు వినిపిస్తున్నాయి.సంగీతంలో సరిగమల్లా ఒక్కోచోట,ఒక్కోశబ్దం వినిపిస్తోంది.ఇక్కడ పలికే స్వరాలు, కిలోమీటర్ వరకూ వినిపిస్తాయి.

PC:youtube

ఏంటీ నమ్మటం లేదా? అయితే వినండి.

గుడిలో గంట సౌండ్ లా వినేవారికి వింతగా అనిపిస్తుంది.ఈ వింతను చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. ఈ రాళ్ళను వీడియో ఫోనిక్స్ మ్యూజికల్ పరికరాలు తయారుచేస్తున్నారు.
విన్నారా? చాలా బాగుంది కదా.కుదిరినప్పుడు మీరు కూడా ఒకసారి పోయి చూసిరండి.

అయిటిపాముల రాళ్ళకు, హంపీ సంగీత స్థంభాలకు వున్న స్థంభం వుందా?

అయిటిపాముల రాళ్ళకు, హంపీ సంగీత స్థంభాలకు వున్న స్థంభం వుందా?

ఈ మ్యూజిక్ స్టోన్స్ ఆకర్షణే కాదు.ఇందులో కొంత మిస్టరీ కూడా వుంది.కొండపై ఎన్నో రాళ్ళు వుండగా ఈ రెండు మూడు రాళ్ళ నుంచి మాత్రమే స్వరాలు పలుకుతుండటం ఆశ్చర్యంగా వుంది.

PC:youtube

రాగాలు పలుకుతున్న రాళ్ళ విశేషాలు మిస్టరీ

రాగాలు పలుకుతున్న రాళ్ళ విశేషాలు మిస్టరీ

ఇక సంగీత ప్రియులకు ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంటే చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.స్వరాలు పలికే రాళ్ళు హంపి దేవాలయంలో మాత్రమే వున్నాయంటున్నారు స్థానికులు.

PC:youtube

నోరు లేకుండా సంగీతం పలికే శిలలుమిస్టరీ

నోరు లేకుండా సంగీతం పలికే శిలలుమిస్టరీ

అక్కడ ఒక్కో రాయి ఒక్కో రాగాలు పలుకుతుంది.ఇలాంటి వాటిని పురావస్తు శాఖ వెలుగులోకి తీస్కురావాలని కోరుతున్నారు. రింగింగ్ రాక్స్ స్పార్క్ లు అమెరికా, మెక్సికో, పశ్చిమ ఆస్ట్రేలియాలలో వున్నాయని సైంటిస్టులు చెపుతున్నారు.

PC:youtube

చరిత్ర

చరిత్ర

పూర్వీకుల కాలం నుంచి దీనిని గుర్తించిన వారు దీనిని నగారి అని ప్రకటించి ఇక్కడ ఏ రాయిని చూసినా కూడా ఒక రాయిని కొడితే కంచు మ్రోగినట్లు ఇంకొక దానిని కొడితే ఐరన్ మోగినట్లు చాలా విశిష్టమైన రాళ్ళు ఇక్కడ వున్నాయి. ఇక్కడ స్థానికులు తాతలకాలం నుండి కాపాడుకున్న సంపదగా భావిస్తున్నారు.

PC:youtube

రాగాలు పలుకుతున్న రాళ్ళ మిస్టరీ

రాగాలు పలుకుతున్న రాళ్ళ మిస్టరీ

ఈ విశిష్టమైన రాళ్ళను ప్రపంచానికి తెలియచేస్తే బాగుంటుందనే వుద్దేశంతోనే దీనిని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

PC:youtube

శాస్త్రవేత్తల మాట

శాస్త్రవేత్తల మాట

రాళ్ళనుంచి వచ్చే సౌండ్స్ కొత్తేమీ కాదంటున్నారు సైంటిస్ట్ లు.ఇతర దేశాలలో ఇప్పటికే ఇలాంటి రాళ్ళపై అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

PC:youtube

రాగాలు పలుకుతున్న రాళ్ళ విశేషాలు మిస్టరీ

రాగాలు పలుకుతున్న రాళ్ళ విశేషాలు మిస్టరీ

ఎప్పుడైతే సుత్తితో ఈ రాళ్ళను గట్టిగా కొట్టడం జరుగుతుందో అప్పుడు వివిధ రకాలైన శబ్దతరంగాలను ఉత్పత్తి చేస్తాయి.సౌండ్ ప్రొడ్యూజ్ చేసే ఈ రాళ్ళని లిథోఫోనిక్ రాక్స్ అని,రింగింగ్ రాక్స్ అని మరియు సోనారస్ రాక్స్ అని వీటిని పిలుస్తుంటారు.

PC:youtube

నోరు లేకుండా సంగీతం పలికే శిలలుమిస్టరీ

నోరు లేకుండా సంగీతం పలికే శిలలుమిస్టరీ

ఈ రింగింగ్ రాక్స్ చాలా డిఫరెన్స్ గా వుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.ఎవరి వాదనలు ఎలావున్నా ఇలాంటి వింతరాగాలు పలికే రాళ్ళను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అందరినీ మ్యాజిక్ చేస్తోన్న ఈ మ్యూజిక్ స్టోన్స్ వున్న ఈ పర్యాటక ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

PC:youtube

నేషనల్ హైవే

నేషనల్ హైవే

విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే కి పక్కనే వుండటంతో ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాలంటున్నారు స్థానికులు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వున్నాయి. పచ్చని పంట పొలాల మధ్య నల్లని కొండ చూడముచ్చటగా వుంటాయి.కొండను ఆనుకుని చెరువుకూడా వుంది.ప్రతి యేటా ఈ చెరువుకు సైబెరియన్ కొంగలు వస్తూవుంటాయి. ఒక వైపు పక్షుల కిలకిలా రావాలు, మరో వైపు సంగీత స్వరాలు వినిపించే ఈ నగారా కొండ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

PC:youtube

ఇక్కడ దగ్గరలో చూడదగినవి

ఇక్కడ దగ్గరలో చూడదగినవి

మట్టపల్లి, పిల్లలమర్రి, రాజీవ్ పార్క్, ఫణిగిరి బౌద్ధ స్థలాలు, పానగల్ దేవాలయం, నందికొండ, లతీఫ్ షాహ దర్గా, కొల్లంపాకు జైన దేవాలయం, రాచకొండ కోట, మేళ్ళచెర్వు, దేవరకొండ కోట, భువనగిరి కోట నల్గొండ లోని కొన్ని చూడదగిన ఆసక్తికర ప్రాంతాలు. ఈ అన్ని ప్రాంతాలు నల్గొండ చరిత్రలో చాల ప్రాముఖ్యతను కల్గి ఉన్నాయి.

PC:youtube

నాగార్జునసాగర్

నాగార్జునసాగర్

నాగార్జునసాగర్, ప్రపంచంలో ఉన్న బౌద్ధులకు ముఖ్యమైన స్థలము. ఇది దక్షిణ భారత రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో ఒక చిన్న పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఒక పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందుతూ అదే విధంగా ఒక ముఖ్యమైన పర్యాటక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందుతూ ఉంది.

పోచంపల్లి

పోచంపల్లి

తెలంగాణ లోని నల్గొండ జిల్లా లోని పోచంపల్లి పట్టణం, అక్కడ నేయబడే అత్యంత నాణ్యమైన పట్టు చీరల వల్ల, భారత దేశపు పట్టు పట్టణంగా పేరు పొందింది. కేవలం చీరల వల్లే పోచంపల్లి ప్రసిద్ధి కాదు. సంస్కృతి, సంప్రదాయం, వారసత్వ సంపద, చరిత్ర, ఆధునికతల మేలు మిశ్రమం కావటం దీని ప్రత్యేకత. ఈ సుందర పట్టణం కొండలు, తాటి చెట్ల వరసలు, సరస్సులు, చెరువులుచే ఆవృతమై ఉంది. చాలా మంది విదేశీ పర్యాటకులు పట్టు చీరల నేత నేర్చుకోవటానికి వారాలు తరబడి పోచంపల్లి లోనే బస చేయటం సాధారణం.

హైదరాబాద్

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయుల లో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత 1591 లో ఏర్పాటయింది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఈ ప్రాంతం ఏ జాతీయ రహదారి పైన నేరుగా కలవనప్పటికి నల్గొండ కు రైళ్ళు, రోడ్డు మార్గాల ద్వారా చేరడం సులువు. నల్గొండ రైలు స్టేషన్ గుంటూరు - సికింద్రాబాద్ రైల్వే లైన్ పై ముఖ్య మైనది, ఈ పట్టణంలో ఆగే అనేక రైళ్ళు ఉన్నాయి. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా బాగుండటమే కాక చాల బస్సులు తరుచుగా నల్గొండ కు వస్తు, పోతూ ఉంటాయి. దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్.

హైదరాబాద్ నుండి నల్గొండకు 2 గంల 30నిలు పడుతుంది.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X