Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి సౌందర్యం, పచ్చదనంతో కూడిన అంబ సముద్రం

ప్రకృతి సౌందర్యం, పచ్చదనంతో కూడిన అంబ సముద్రం

అంబసముద్రం అంటే అంబికా దేవి, సముద్రం ఉంది కాదా అని దగ్గర్లో సముద్రం ఉందనుకొనేరు ...! అంబసముద్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఒక పట్టణం.

By Venkatakarunasri

అంబసముద్రం లో చూడటానికి ఆలయాలు, జలపాతాలతో పాటుగా భవనాలు, ఇతర మతాలకు చెందిన స్థలాలు కలవు. ఇక్కడి అతిపెద్ద ఆకర్షణ ముందంతురై - టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. షాపింగ్ ప్రియుల విషయానికి వస్తే అక్కడి ప్రసిద్ధి చెందిన కై మురుక్కు అనే గడ్డి చేపలను కొనుగోలు చేయటం మరవద్దు ..!

అంబసముద్రం ను 'విలన్కురిచి' అనే పేరుతో కూడా పిలుస్తారు. వందల సంవత్సరాల క్రితం తమిళ భాష కు విశేష కృషి చేసిన సెయింట్ అగస్తియర్ యొక్క కేంద్రంగా కూడా ఈ ప్రాంతం ముద్రపడింది. ఇక్కడ ఆలయాలు, నీటి వనరులు సమృద్ధిగా ఉండటం వలన యాత్రికులు రావటానికి ఆసక్తి చూపుతారు.

అంబసముద్రం .... అంటే అంబికా దేవి, సముద్రం ఉంది కాదా అని దగ్గర్లో సముద్రం ఉందనుకొనేరు ...! అంబసముద్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల పర్వత మొదలు ప్రాంతంలో, తామిరబరణి నది ఒడ్డున ఉన్నది. ప్రకృతి సౌందర్యం, పచ్చదనంతో కూడిన అంబసముద్రం రెండు పదాలైన అంబా మరియు సముందర్ పదాల నుండి ఉద్భవించినది.

ప్రకృతి సౌందర్యం, పచ్చదనంతో కూడిన అంబ సముద్రం

ప్రకృతి సౌందర్యం, పచ్చదనం

ప్రకృతి సౌందర్యం, పచ్చదనం

పాపనాశర్ ఆలయం అంబ సముద్రం పట్టణానికి సమీపంలో గల పాపనాశం గ్రామంలో కలదు. ఈ ఆలయం శివ భగవానుడికి ఆనికితం చేయబడింది. గుడిలో వివాహాలు జరిపించడం పవిత్రమైన కార్యంగా భావిస్తారు.

ప్రకృతి సౌందర్యం, పచ్చదనం

ప్రకృతి సౌందర్యం, పచ్చదనం

మేలసేవాల్ నవనీతక్రిష్ణన్ ఆలయం అంబ సముద్రం సమీపంలోని మేలసేవాల్ గ్రామంలో ఉన్నది. 700 ఏళ్ళ ఈ పురాతన ఆలయాన్ని ట్రావెన్కోర్ రాజులు నిర్మించారు. ఈ ఆలయం లో అరచేతులపై నెయ్యి పట్టుకుని నిలుచున్న భంగిమలో ఉన్న సాలిగ్రామ మూలవార్ యొక్క గ్రానైట్ విగ్రహం ఉన్నది.

ప్రకృతి సౌందర్యం, పచ్చదనం

ప్రకృతి సౌందర్యం, పచ్చదనం

మేలసేవాల్ గ్రామంలోనే మరో రెండు ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి మెగా లింగేశ్వర్, మరొకటి వేణుగోపాలస్వామి ఆలయం. ఈ రెండు ఆలయాలు కూడా అక్కడి ఆలయాల్లో మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. ఈ గుళ్ళకు కూడా భక్తులు వస్తుంటారు.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

సుమారు 346 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ముందంతురై - టైగర్ ఫారెస్ట్ పశ్చిమ కనుమల దక్షిణ ప్రాంతంలో, అంబసముద్రం చేరువలో కలదు. కేవలం పూలులే కాదు వివిధ రకాల జంతువులు, సరీశృుపాలు మరియు పక్షులు , ఉభయచరాలు కూడా ఈ అభయారణ్యంలో కనిపిస్తాయి.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

ఫారెస్ట్ సందర్శనకు అనువైన సమయం : ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. వారంలో అన్ని రోజులు ఈ అభయారణ్యం తెరిచే ఉంటుంది.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

కరైయర్ ఆనకట్ట ముందంతురై - టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక భాగం గా ఉన్నది. ఆనకట్ట వద్ద ప్రయాణీకులు పడవల్లో ప్రయాణం చేయవచ్చు. అరగంట పడవ ప్రయాణం మృదువైన కయ్యి ద్వారా, జలపాతం యొక్క తుంపరల మధ్య జరుగుతుంది. ఇదే ఇక్కడి థ్రిల్లింగ్ గొలిపే అంశం.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

తామిరబరణి నది పశ్చిమ కనుమల కొండల నుండి ఉద్భవించినది. ఈ నది యొక్క నీరు తియ్యగా, రుచిగా ఉంటుంది. రాగి కంటెంట్ ఈ నదిలో ఉండటం మూలాన ఎరుపు రంగులో కనిపిస్తుంది. రాగి అంటే 'తామ్రం'. దాని నుండే 'తామిరబరణి' అన్న పేరు వచ్చింది.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పాపనాశం ఆనకట్ట పశ్చిమ కనుమల దగ్గర ఉన్న పోతిగై కొండలు వద్ద నిర్మించారు. ఈ ఆనకట్ట పాపనాశం జలపాతం చేరువలో తామిరబరణి నది ఒడ్డున ఉంది. లార్డ్ శివ మరియు పార్వతి దేవి ఆలయం ఆనకట్ట సమీపాన కనిపిస్తుంది. ఈ ఆనకట్ట దాని చుట్టూ ఉన్న పర్వతాలు, చెట్ల కారణంగా ఒక ప్రసిద్ధ విహారస్థలంగా మారింది.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పాపనాశం శివాలయంనకు 4 కి. మీ దూరంలో అగస్తియర్ జలపాతం కలదు. ఇది ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఒకటి. జలపాతం యొక్క ఎత్తు 100 మీటర్లు ఉంటుంది. ఇక్కడికి పాపనాశం ఆలయం నుండి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఈ జలపాతానికి పాపాలు పోగొట్టే శక్తి కలదని, వ్యాధులను నయం చేసే శక్తి ఉందని భావిస్తారు.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

క్రమసింగాపురం అగస్తియర్ జలపాతం సమీపంలో కలదు. శివన్ దేవాలయ, నారాయణ్ దేవాలయం, బాల సుబ్రమణ్యస్వామి దేవాలయం తో పాటుగా చర్చీలు కలిగి ఉన్నది. ఇక్కడికి సమీపంలోనే టీ ఎస్టేట్ లు, మంజోలై హిల్స్ లు ఉన్నాయి.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

మంజోలై హిల్స్ పేరులోనే ఉంది ఇదొక కొండ ప్రాంతం అని. టీ ఎస్టేట్ లతో పాటు పలు రకాల తోటలకు ప్రసిద్ధి చెద్నినది ఈ ప్రాంతం. ప్రశాంతమైన మనస్సును, విశ్రాంతిని కోరుకోనేవారికి ఇదొక చక్కటి స్థలం.

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

పచ్చదనంతో కూడిన అంబసముద్రం

మనిముత్తార్ ఆనకట్ట & జలపాతం పోదిగై హిల్స్ వద్ద ఉన్న అత్యద్భుతమైన ప్రదేశం. పర్వతాలు, నీరు మరియు స్కై కలుసుకునే ప్రదేశం వద్ద గాలి తీసుకోవటం ఒక అద్భుతమైన వీక్షణ ను కలిగిస్తుంది. మనిముత్తార్ జలపాతం ఇక్కడి మరొక అందమైన ప్రదేశము. ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

అంబసముద్రం ఎలా చేరుకోవాలి?

అంబసముద్రం ఎలా చేరుకోవాలి?

అంబ సముద్రం చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

అంబసముద్రం పట్టణానికి సమీపాన 75 కి. మీ. దూరంలో ట్యుటికోరన్ విమానాశ్రయం కలదు. అలాగే 147 కి. మీ. దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉన్నది. ఈ రెండు విమానాశ్రయాల నుండి అంబసముద్రం పట్టణానికి క్యాబ్ లేదా ప్రవేట్ ట్యాక్సీ ల సదుపాయం కలదు.

రైలు మార్గం

అంబసముద్రంలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ , తిరునల్వేలి రైల్వే స్టేషన్ అంబసముద్రం పట్టణానికి సమీపాన ఉన్న రైల్వే జంక్షన్. ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మధురై, కన్యాకుమారి ప్రాంతాల నుండి ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం

తిరునల్వేలి, మధురై, కన్యాకుమారి, ట్యుటికోరన్ వంటి సమీప పట్టణాల నుండి అంబసముద్రం పట్టణానికి ప్రవేట్/ ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X