Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి వర్ణాల సోయగం ... కోహిమా నగరం!!

ప్రకృతి వర్ణాల సోయగం ... కోహిమా నగరం!!

ఎత్తైన కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, పచ్చిక బయళ్లతో అలరించే ప్రకృతి సోయగాలకు ఆటపట్టు నాగాలాండ్‌. భారతదేశంలో ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఏదైన ఉందంటే ఆది ఈ రాష్ట్రమే. బర్మా, టిబెట్‌ దేశాలకు చెందిన 16 జాతుల గిరిజనులు చిత్ర విచిత్ర వేషధారణలతో దర్శనమిచ్చి చూపరులను ఆశ్చర్యపరుస్తారు. చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరిగే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలు.

ఇక అసలు విషయానికి వస్తే , సముద్ర మట్టానికి 1,495 మీటర్ల ఎత్తులో ఉండే కోహిమాకు చారిత్రక ప్రాధాన్యం ఎంతో ఉంది. ఈశాన్య భారత దేశంలో కల నాగాలాండ్ నగరంలోని కొహిమ ఎంతో సుందర ప్రదేశం. ఎన్నో తరాలుగా ఈ ప్రదేశం దాని ప్రకృతి అంద చందాలతో పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఒకప్పుడు ఇక్కడ అంగామీ తెగ ప్రజలు నివసించేవారు. కాని ఇపుడు నాగా ల్యాండ్ లోని అన్ని ప్రాంతాల వారు నివసిస్తున్నారు. ఇక్కడ దొరికే కేవీమ లేదా కేవేర పూవులా కారణంగా ఈ ప్రాంతానికి కేవ్హిమా అనే పేరు వుండేది. కాని బ్రిటిష్ వారు దానిని వారి ఆంగ్లం లో కొహిమా అని అనువదించారు. ఇక్కడికి వెళితే ఏ ఏ ప్రదేశాలు చూడాలి అంటే....

కోహిమా హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కోహిమా స్టేట్‌ మ్యూజియం

కోహిమా స్టేట్‌ మ్యూజియం

నాగాలాండ్‌ వాసుల జీవన పద్ధతులు, చరిత్రనూ కళ్లకు కట్టినట్లు చూపే స్టేట్‌ మ్యూజియం చూడాల్సిన ప్రదేశాల్లో మొదటిది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న విగ్రహాలు, స్థూపాలు, నగలు, తోరణాలను ఇక్కడ పొందుపరిచారు. ఒకప్పుడు పండుగ సమయాల్లో వాడిన అతిపెద్ద డ్రమ్‌ (డప్పు వాయిద్యం)ను ప్రత్యేకంగా ఒక షెడ్డులో భద్రపరిచారు. ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే అరుదైన పక్షులను ఒక ప్రత్యేకమైన హాలులో చూడొచ్చు. ఈ మ్యూజియం టవున్ కు ఒకటిన్నర కి.మీ.ల దూరంలో వుంటుంది. బయావు హిల్ పై ఈ మ్యూజియాన్ని1970 లో నాగా ల్యాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగాల కళలు, కళా కృతులు, పురాతన ఆయుధాలు, రంగు రంగుల సాంప్రదాయ దుస్తులు, వారి ఆహారం మొదలైన అంశాల గురించి తెలియ చేస్తుంది.విలువైన జాతి రత్నాలు, సముద్రపు పగడాలు, కంచు, వెండి గంటలు , నాగా ల వేడుకల దుస్తులు , వారి సంగీత పరికరాలు మొదలైనవి ప్రదర్శించ బడతాయి. వీరిసాంప్రదాయ నివాసాలు, గుడిసెలు ఇక్కడ ఒక ప్రత్యేకత.

Photo Courtesy: Frank Boyd

కేథలిక్‌ చర్చి

కేథలిక్‌ చర్చి

కోహిమా సమీపాన అరదుర కొండపై ఉన్న కేథలిక్‌ చర్చిలో చెక్కతో చేసిన 'శిలువ' దర్శనమిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద శిలువ. ఈ చర్చి కూడా పెద్దదే. క్రిస్మస్ రోజున పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ చర్చి కోహిమా నగరానికి మణిపూసలాంటిది. ఈ చర్చిలో ప్రార్థనలు చేస్తే ఇహలోకం ప్రాప్తిస్తుందని వారి ప్రగాఢ నమ్మకం. ఈ చర్చి అక్కడున్న పరిసర ప్రాంతాల్లో కంటే చాలా పెద్దది. చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రార్థనలు చేసుకోవడానికి వస్తుంటారు. ఈ చర్చి చాలా విశాలమైనది కూడా.

Photo Courtesy: deepgoswam

కోహిమా యుద్ధ స్మశానం

కోహిమా యుద్ధ స్మశానం

రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌ సేనలు కోహిమాను ఆక్రమించాయి. ఆ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుల స్మృత్యర్థం నిర్మించిన స్మారక కేంద్రం ఈ కోహిమా యుద్ధ స్మశానం. కోహిమా వార్ సీమేట్రీ ప్రవేశంలో గల రాతి ఫలకంపై ' మీరు ఇంటికి వెళ్ళినపుడు, ' మీ యొక్క రేపు కొరకు మేము ఈ రోజున మా ప్రాణాలు త్యాగం చేశాము అని తెలుపండి ' అనే లైన్ లు కనపడతాయి. ఈ శ్మశానం లో సుమారు 1421 మంది యుద్ధం లో మరణించిన సైనికుల సమాధి ఫలకాలు కనపడతాయి. ఇక్కడ కల ప్రతి సమాధికి ఒక తగిన వ్రాతతో ఒక కంచు లేదా బ్రాంజ్ ప్లేట్ వుంటుంది. దీనిని కామన్ వెల్త్ వార్ గ్రేవ్ కమిషన్ నిర్వహిస్తోంది. వేలాది పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి ఇంగ్లాండ్ మరియు కెనడా ల నుండి ఇక్కడకు వచ్చి మరణించిన యుద్ధ వీరులకు శ్రద్దాంజలులు అర్పిస్తారు. ఈ ప్రదేశం పర్యాటకులకు ఒకింత కంటతడి పెట్టిస్తుంది.

Photo Courtesy: PP Yoonus

డిజుకోవ్యాలీ

డిజుకోవ్యాలీ

సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తున ఉండే డిజుకోవ్యాలీ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇది కోహిమాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెదురుపొదలతో, తెలుపు, పసుపు పచ్చ రంగుల లిల్లీ పువ్వులతో లోయంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. డిజుకోవ్యాలీ సందర్శనకు వసంత కాలం బాగుంటుంది. ఇక్కడ కల వివిధ రకాల పూవులు అపుడు వికసిస్తాయి. ప్రపంచ ప్రసిద్ధ రోడో దేన్ద్రాన్ పూవులు కూడా చూడవచ్చు. ఈ వ్యాలీ లో సుమారు 360 రకాల తోటలు కలవు. వింటర్ లో ఈ ప్రదేశ సందర్సన అధికమైన మంచు చే కప్పబడటంతో ఒక ఎడారి వలే వుంటుంది.

Photo Courtesy: Dhrubajyoti Debnath

హార్న్ బిల్ ఫెస్టివల్

హార్న్ బిల్ ఫెస్టివల్

హార్న్ బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ లో ఒక ఘనమైన ఉత్సవం. ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో జరిగే ఈ పండుగకు వేలాది టూరిస్టులు తరలి వస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం మరియు స్థానిక సంఘాలు కలసి ఉమ్మడి గా నిర్వహిస్తాయి. ఈ వేడుకలో నాగాలు తమ తల పాగాలకు హార్న్ బిల్ అనే పక్షి ఈకలు ధరించటం వలన దీనికి హార్న్ బిల్ ఫెస్టివల్ అనే పేరు వచ్చింది. ఈ వేడుకలలో డాన్స్ లు, చేతి కళలు, పెరేడ్ లు, ఆటలు, క్రీడలు, ఫుడ్ ఫెయిర్ మత పర అంశాలు ప్రదసిస్తారు. అనేక నాగ పత్రికలు, పెయింటింగ్ లు, వుడ్ వస్తువులు, షాల్స్, నాగ జీవితాలను ప్రతిబింబించే ఇతర బొమ్మలు వంటివి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫెస్టివల్ లో నాగ యుద్ధ వీరుల ను అభినందిస్తూ అనేక పాటలు పాడతారు.

Photo Courtesy: Vikramjit Kakati

ఖోనోమా

ఖోనోమా

కోహిమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోనోమా అనే చిన్న గ్రామం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన గ్రామం, పరిసరాలు విహారయాత్రకు అనువైన ప్రదేశాలు. పచ్చటి వరి పొలాలతో ప్రకృతి మాత నడయాడే ఖొనోమాకు టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఇక్కడ సుమారు ఇరవై రకాల వరి వంగడాలు పండిస్తారంటే నమ్మశక్యం కాదు.

Photo Courtesy: Rita Willaert

నాగ బజార్

నాగ బజార్

కోహిమా సందర్శించే ప్రతి పర్యాటకుడికి నాగ బజార్ లేదా లోకల్ మార్కెట్ ఒక పెద్ద ఆకర్షణ. ఈ మార్కెట్ చాలా పురాతనమైనది. టవున్ మధ్యలో వుంటుంది. దీనిలో అనేక మంసాహారాలు లభిస్తాయి. నాగాల ఆహారం ఈ ప్రాంతం లోని ఇతరుల కంటే విభిన్నంగా వుంటుంది. వివిధ రకాల చేపలు, ఇతర దైనందిన అవసరాలు ఈ మార్కెట్ లో కొనుగోలు చేయవచ్చు. అనేకమంది మహిళా అమ్మకం దారులు వుంటారు. స్థానికులతో కలసి ఆనందించేందుకు ఈ ప్రదేశం ఆసక్తి కరంగా వుంటుంది.

Photo Courtesy: Catherine Marciniak

ఎలా వెళ్ళాలి??

ఎలా వెళ్ళాలి??

విమాన మార్గం
కోహిమాలో విమానాశ్రయం లేదు. కానీ కోహిమాకి 74 కి. మీ. దూరంలో దిమాపూర్ దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలు వస్తుంటాయి. ఢిల్లీ, ఇంఫాల్,కలకత్తా తదితర ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడుపుతుంటారు. దీనికి 145 కి. మీ. దూరంలో ఇంఫాల్ అనే మరొక విమానాశ్రయం ఉంది. ఇక్కడికి కూడా దేశంలోని అన్నిప్రాంతాల నుంచి విమాన సదుపాయాలు ఉన్నాయి.
రైలు మార్గం
కోహిమాలో రైల్వే స్టేషన్ లేదు కానీ దగ్గరలోని నాగాలాండ్ యొక్క వాణిజ్య రాజధాని అయిన దిమాపూర్ లో ఉంది. ఇది 74 కి. మీ. దూరంలో ఉంది. గౌహతి, కలకత్తా ప్రాంతాల నుంచి ఇక్కడికి రైలు సర్వీసులు నడుపుతుంటారు.
రోడ్డు మార్గం
కోహిమాకు 74 కి. మీ. దూరంలో దిమాపూర్, 135 కి. మీ. దూరంలో ఇంఫాల్ పట్టణం, 350 కి. మీ. దూరంలో గౌహతి ఉంది. అంతే కాక మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర ప్రాంతాల నుంచి కూడా నాగాలాండ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.

Photo Courtesy: Jackpluto

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X