Search
  • Follow NativePlanet
Share
» »ప్రకాశంలో అద్భుత జల 'కోన' !!

ప్రకాశంలో అద్భుత జల 'కోన' !!

ప్రకాశం... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని దక్షిణ కోస్తా తీరంలో గల ఒక జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు. 1970 లో ఆవిర్భవించిన ఈ జిల్లా, గొప్ప దేశభక్తుడైన "ఆంధ్రకేసరి" టంగుటూరి ప్రకాశం పంతులు గారి జ్ఞాపకార్థం ఈ జిల్లాను 1972 లో ప్రకాశం జిల్లాగా నామకరణం చేసినారు. ఈ జిల్లాలో కూడా పలు ప్రాంతాలు పర్యా టక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో సముద్రతీరాలు సందర్శకులకు సందడి వాతావరణాన్ని అందిస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులను మళ్లీమళ్లీ రప్పిస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను పరిశీలిస్తే....

భైరవకోన

భైరవకోన

భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖర పురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. భైరవకోన అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ఎత్తయిన జలపాతం. ఎత్తైన కొండలపై ఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ యాత్రికులకు కనువిందు చేస్తోందీ జలపాతం. జలపాతం నుంచి కింద పడి నీరు సోనవాన పేరుతో దుర్గాంబ, భైరవాలయాల మధ్య ప్రవహిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుని కాంతి కిరణాలు సెలయేటి నీటిపై పడి దుర్గా దేవిపై ప్రసరిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.
కోనకు ఎలా వెళ్లాలంటే...
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.

Photo Courtesy: Ck984923

పల్లెపాలెం

పల్లెపాలెం

ఒంగోలు నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో సముద్రతీరం ఉంది. తీరంలో పర్యాటక శాఖ పర్యాటకుల కోసం వసతిగృహాల సముదాయాన్ని నిర్మించింది. తీరం పక్కనే పార్కు, జిల్లాపరిషత్‌ అతిథిగృహం ఉన్నాయి.

Photo Courtesy: native planet

వలేటివారిపాలెం

వలేటివారిపాలెం

వలేటివారిపాలెంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి శనివారం మాత్రమే భక్తులకు దైవదర్శనం ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగానే కాక పర్యాటక కేంద్రంగానూ వర్ధిల్లుతోంది. ఇక్కడ లక్ష్మీఅమ్మవారి వద్దకు వెళ్లేందుకు కొండ పగిలి ఉంటుంది. ఎంత లావు వ్యక్తి అయినా వెళ్లే విధంగా ఉంటుంది. ఈ ఆలయానికి పెళ్లిళ్లు చేసుకునేవారు, తలనీలాలు ఇచ్చేవారు అధికంగా వస్తుంటారు.

Photo Courtesy: VoletiVariPalem Temples

మద్దిపాడు

మద్దిపాడు

మద్దిపాడులో గుండ్లకమ్మ నదిపై కట్టిన కందుల ఓబులరెడ్డి జలాశయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి మల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం పేరెన్నికగంది. క్రీ.శ.1100 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాకవి ఎర్రనామాత్యుడు ఈ ఆలయాన్ని తన ఉత్తర హరివంశంలో ప్రస్తావించారు.

Photo Courtesy: ap projects

కాశినాయన

కాశినాయన

జిల్లాలోని చూడదగ్గ ప్రదేశాల్లో కాశినాయన ఒకటి. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. అనేక మంది భక్తులు ఈ ప్రదేశాన్ని చూడటానికి వస్తుంటారు. ఒక విధంగా ఇది పర్యాటక స్థలంగా చెప్పవచ్చు. కాశీనాయన పేరు చెప్పగానే అన్నదాన క్షేత్రమని ఠపీమని గుర్తుకు వస్తుంది. అవధూత కాశినాయన అన్నదానం ప్రాశస్థ్యాన్ని గుర్తించడమే కాదు, ఆయన నడిచిన బాటన 24 గంటలూ నడిచే అనేక అన్నదాన కేంద్రాలు ఏర్పడేలా ప్రచారం చేశారు. ప్రతి యేటా జరిగే కాశినాయన ఆరాధనోత్సవాలకు జిల్లా లోనే కాక చుట్టూ పక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. వీరి కోసం రైతులు, సమీప గ్రామస్తులు స్వచ్ఛందంగా ధాన్యాన్ని, పప్పుదినుసులను జ్యోతిక్షేత్రానికి చేరవేస్తుంటారు. జ్యోతిక్షేత్రానికి ఎవరెళ్లినా అక్కడ ఎదురయ్యే మొదటి ప్రశ్న మీరు భోజనం చేశారా అని.. లేకుంటే చేసి రమ్మని చెబుతారు. వచ్చిన భక్తులకు విసుగూ విరామం లేకుండా ఇక్కడ భోజనం వడ్డిస్తూనే ఉంటారు.

Photo Courtesy: SRI KASINAYANA TEMPLE

దేవరంపాడు

దేవరంపాడు

ఉప్పు సత్యాగ్రహ కాలంలో దేవరంపాడులో గుండ్లకమ్మ నది ఆనుకొని ప్రకాశంగారు చిన్న బంగ్లా కట్టించారు. ఉప్పు సత్యాగ్రహ కార్యకర్తలకు ఆ బంగ్లాను ఇచ్చేశారు. అదే దేవరంపాడు శిబిరంగా పేరుగాంచింది. 1935 నవంబరు 21వ తేదిన బాబు రాజేంద్ర ప్రసాద్‌ గారు వచ్చారు. ప్రకాశం ఆయన చేత ధ్వజస్తంభం నాటించారు. దాని ఎత్తు 30 అడుగులు. దాని మీద గాంధీ విగ్రహం నెలకొల్పారు. ఈ విధంగా ఉప్పుసత్యాగ్రహ ప్రతీకగా దేవరంపాడు ప్రసిద్ధి చెందింది.

Photo Courtesy: Devarampadu

చందవరం

చందవరం

గొప్ప బౌద్ధ ఆరామంగా పేరుగాంచిన గ్రామం చందవరం. దొనకొండ మండలంలో ఉంది. కర్నూలు - గుంటూరు రహదారిలో త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గ్రామానికి 2 కి.మీ.ల దూరాన గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన ఈ బౌద్ధారామం క్రీ.శ. 2వ శతాబ్ది నాటిది. 1965 నాటి త్రవ్వకాలలో బయల్పడింది. ఈ స్తూపం 200 అడుగుల ఎత్తు గల కొండపై ఉంది. ఈ స్తూపం ఎత్తు 30 అడుగులు, ఇచట బౌద్ధ భిక్షువులు సంచరించి, బౌద్ధమత వ్యాప్తికి దోహదం చేశారట. చుట్టు కొలత 130 అడుగులు ఉంది. స్థూపం ఉత్తర ద్వారంలో బుద్ధుడు ధ్యాన నిమగ్నుడైన పాలరాతి శిల్పం గా మారింది.

Photo Courtesy: Chandavaram

కనపర్తి

కనపర్తి

సముద్రతీరంలో ఉన్న కనపర్తి గ్రామం క్రీస్తు పూర్వమే బౌద్ధ ఆరామంగాను, తరువాత శైవక్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. కాకతీయులు, చోళులు పాలించిన ప్రాంతాలలో ఉండిన ఈ గ్రామ పరిసరాలలో కళాఖండాలు, శిల్పాలు బయటపడు తున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధ పీఠంగా, శైవక్షేత్రంగా విరాజిల్లినట్లు బయల్పడిన శాసనాలు నిరూపిస్తున్నాయి. ప్రాకృతం సంస్కృతం, తెలుగు భాషలలోగల ఆరు శాసనాలు లభించాయి. బౌద్ధుల కాలం, ఆ తరువాత హిందూ రాజుల కాలంలో కనుపర్తికి ప్రాముఖ్యత ఉంది.

Photo Courtesy: Kanaparthi

అద్దంకి

అద్దంకి

ఇప్పటి వరకు లభించిన తెలుగు శాసనాలలో మొదటి పద్య శాసనం అద్దంకిలో లభించింది. రెండవది కందుకూరు, మూడవది ధర్మవరంలో లభించాయి. ఈ మూడు వేయించింది పండరంగడు. ఇతను చోళరాజు గుణగ విజయాదిత్యుని సేనాని. పండరంగని అద్దంకి శాసనంలోని పద్యం క్రీ.శ. 848 నాటిది.ఇది తెలుగు సాహితీ చరిత్రకు ఖచ్చితమైన ఆధారం. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించునపుడు, ప్రభుత్వానికి ప్రధమ ఆధారంగా ఉపయోగపడింది. ఈ శాసనం 1905వ సం. లో భూమిలోంచి బయటపడినది.

Photo Courtesy: addanki

ఎలా వెళ్ళాలి??

ఎలా వెళ్ళాలి??

వాయు మార్గం

ప్రకాశం జిల్లాకు దగ్గరలో ఉన్న విమానాశ్రయం విజయవాడ లోని గన్నవరం ఏర్‌పోర్ట్. ఈ ఏర్‌పోర్ట్ దేశీయ ఏర్‌పోర్ట్ , ప్రకాశం నుంచి 150 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ ఏర్‌పోర్ట్ కి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం విమానాలు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి.

రైలు మార్గం

ప్రకాశంలో రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే చెన్నై నుంచి ఢిల్లీ పోవాలన్న మరియు గుంతకల్ నుంచి గుంటూరు, విజయవాడ, వైజాగ్ పోవలన్న ఈ స్టేషన్ మీద నుంచే వెళ్ళాలి.

రోడ్డు మార్గం

ఈ ప్రాంతం గుండా జాతీయ రహదారి నెం.5 వెళుతుంది. కనుక వైజాగ్, విజయవాడ, గుంటూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి రోడ్డు రవాణా సదుపాయాలు బాగానే ఉన్నాయి.

Photo Courtesy: Indian7893

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X