Search
  • Follow NativePlanet
Share
» »బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !

బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !

By Mohammad

భారతదేశంలో పులులు అధికంగా ఆవాసం ఉండే ప్రదేశాలలో బందీపుర్ అటవీ ప్రాంతం ఒకటి. దీనిలో షుమారుగా 70 పులుల వరకు ఉంటాయని అంచనా. ఈ అటవీ ప్రాంతంలో మైసూర్ కు 80 కి.మీ. దూరంలో మరియు బెంగుళూరుకు 220 కి. మీ. దూరంలో ఉంది. ఈ రెండు నగరాలనుండి రోడ్డు ప్రయాణం తేలికగా చేయవచ్చు.

బందీపుర్ నేషనల్ పార్క్

బందీపుర్ లో గల ఈ రిజర్వు అటవీ ప్రాంతం కొన్ని చోట్ల అంటే తమిళనాడులోని మదుమలై మరియు కేరళలోని వయనాడ్ ప్రాంతాలకు కూడా కలుపబడి ఉంది. ఈ ప్రాంతాలు కూడా కలుపుకుంటే, దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అటవీ సంరక్షణా ప్రదేశంగా చెప్పవచ్చు. ఇది 'ప్రఖ్యాత సైలెంట్ వ్యాలీ' కల నీలగిరి రిజర్వు అటవీ ప్రాంతంలో భాగంగా కూడా ఉంది.

బందీపుర్ లో బందీపుర్ నేషనల్ పార్క్ తప్పక సందర్శించాలి. ఈ పార్కు షుమారు 800 చ. కి.మీ. విస్తీర్ణం కలిగి పుష్కలమైన సహజ అందాల ప్రకృతి మీకు దర్శనమిస్తుంది. ఎంతో దట్టమైన అటవీ భాగాలు కనపడతాయి. 1931 సంవత్సరంలో మైసూర్ మహారాజు ఈ నేషనల్ పార్క్ ప్రారంభించారు. అప్పటిలో అది 90 చ. కి.మీ. మాత్రమే.

బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !
ఏనుగులు, బందీపుర్ అడవులు
చిత్రకృప : Dave Lonsdale

ఈ పార్కుకు ఆ ప్రాంతంలోని ప్రధాన దేవుడైన వేణుగోపాలుడి పేరుపై వేణుగోపాల వైల్డ్ లైఫ్ పార్క్ అని 1941 లో పేరు పెట్టారు.పర్యాటకులు పార్కు అన్ని మూలల లోను కల సహజ అందాలను ఆనందించవచ్చు. ఈ పార్కుకు చుట్టుపట్ల నాగూర్, కాబిని, మోయర్ నదులున్నాయి.

పార్కు అనేక జంతువులు అంటే పులులు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి ఉడుతలు, ఏనుగులు, అడవి కుక్కలు, చిరుత పులులు, అడవి ఏనుగులు, వంటి వివిధ జంతువులు కలిగి ఉంటుంది. జంతువులే కాక, కొన్ని అపురూప పక్షులైన రాబిన్స్, అడవి కోడి, పావురాలు, గుడ్లగూబలు, నెమళ్ళు వంటి వివిధ పక్షులు కూడా ఈ ప్రాంతంలో చూడవచ్చు.

బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !
చెట్టుపై సేదతీరుతున్న చిరుత:
చిత్రకృప : Annie Nunan

పక్షులలో కొన్ని ఇక్కడకు వలసలు కూడా వస్తూంటాయి. చెకుముకి పిట్టలు, వడ్రంగి పిట్టలు, సాధారణ పక్షులు, ఎన్నో రకాలు ఈ పార్కులో చూడవచ్చు. ఈ పార్కులో అనేక వృక్షజాలం జాతులు కూడా ఉన్నాయి. అవి టెక్టోనా గ్రాండిస్, ఎంబ్లికా అఫీషినాలిత్, వెదురు చెట్లు, మొదలైనవిగా ఉంటాయి.

రోజులో ఉదయం వేళ లేదా సాయంకాలాలలో ఈ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఆ సమయాలలో అనేక జంతువులు వాటి దప్పిక తీర్చుకొనేటందుకు నీటి చెలమల వద్దకు వస్తాయి. ఆసక్తికల సందర్శకులకు జీపులు వంటివి లభ్యంగా ఉంటాయి. లేదా అటవీ శాఖ చే నిర్వహించబడుతున్న బస్ ట్రిప్ లలో సందర్శించవచ్చు. ప్రయివేటు వాహనాలను ఇది ఒక రక్షిత ప్రాంతం అయిన కారణంగా ఈ ప్రాంతంలో నిషేధిస్తారు.

బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !
పార్క్ లోని అరుదైన పక్షులు
చిత్రకృప : Harsha K R

ప్రవేశ రుసుము రూ. 300/- మన దేశస్థులకు(ఎంట్రీ మరియు సఫారీ ఛార్జి కలుపుకొని) మరియు విదేశీయులకు రూ. 1,100/- గా నిర్ణయించారు. కెమెరా ఉంటె 200 రూపాయలు అదనంగా వసూలు చేస్తారు.

ఈ అడవిలో రాత్రి బసకుగాను లాడ్జిలు, రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయి. పర్యాటకులు అదనంగా దర్శించేందుకు ఈ ప్రాంతంలో గోపాలస్వామి బెట్ట గుడి మరియు కాబిని డ్యామ్ వంటివి కూడా ఉన్నాయి.
మీరు కనుక నిశ్శబ్ద వాతావరణాలు ఇష్టపడి అటవీ ప్రాంతంలో మీ సెలవు దినాలు గడపాలనుకునేవారైతే, మీరు తప్పక కర్నాటక లోని బండిపుర సందర్శించాల్సిందే. అది మీకు తగిన ప్రదేశం కాగలదు.

బందీపుర్ - మరుపురాని అరణ్య యాత్ర !
బందీపుర్ ప్రవేశ ద్వారం
చిత్రకృప : Annie Nunan

రవాణా వ్యవస్థ

బందీపుర్ ఎలా చేరుకోవాలి ?

బస్ ప్రయాణం - పర్యాటకులు కర్నాటక రాష్ట్ర రవాణా సంస్ధ బస్ లలో బెంగుళూరు, మైసూర్ ల నుండి బండిపుర చేరవచ్చు. ప్రయివేట్ టాక్సీలు, క్యాబ్ లు కూడా అందుబాటులో ఉంటాయి.
రైలు ప్రయాణం - బండిపూర్ కు మైసూర్ రైల్వే స్టేషన్ సమీప స్టేషన్. ఇది 80 కి.మీ. దూరం ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ రైల్వే స్టేషన్ కలుపబడి ఉంది. రైలు స్టేషన్ నుండి టాక్సీలు, కాబ్లు వంటి వాటిలో బండిపూర్ చేరవచ్చు.
విమాన ప్రయాణం - బండిపూర్ కు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంగా ఉంటుంది. దీనినుండి స్ధానికంగా, మరియు అంతర్జాతీయంగా పర్యాటకులు ప్రయాణించవచ్చు. ఇది బండిపూర్ కు 215 కి. మీ. లు ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X