Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూర్ నుండి తలకాడుకు వన్ డే రోడ్ ట్రిప్

బెంగుళూర్ నుండి తలకాడుకు వన్ డే రోడ్ ట్రిప్

తలకాడు బెంగుళూర్ నుండి వారాంతంలో చూడదగిన ప్రదేశాలలో ఒకటి. బెంగుళూర్ నగరం నుండి ఈ అద్భుతమైన ఒక రోజు యాత్ర చేయండి.

By Venkata Karunasri Nalluru

వారాంతంలో మేము వన్ డే ట్రిప్ ప్రయాణం చేయాలనుకున్నాం. బెంగళూర్ నగరం చుట్టుపక్కల చూడదగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. అందులో మేము తలకాడు వైపు బయల్దేరాలని నిర్ణయించుకున్నాం. ఈ స్థలం గురించి అనేక కథలు విన్నాము.

Talakadu

తలకాడుకు చేరు మార్గం:

బెంగళూరు నుండి తలకాడు రోడ్డు మార్గం ద్వారా 130 కి.మీ ల దూరంలో ఉంది.

బెంగళూరు - రామనగర - చెన్నపట్టణ - మద్దూర్ - మలవల్లి - తలకాడు

ఉదయం 6 గం. 30 ని. లకు మైసూర్ రోడ్ వైపు మా రైడ్ ప్రారంభమైనది. మేము బ్రేక్ ఫాస్ట్ చేయటం కోసం కామత్ లోకరుచి వద్ద ఆగాం. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మరలా మేము తలకాడుకు రైడ్ కొనసాగించాం.

తలకాడు పురాతన కాలంలో 30 కంటే ఎక్కువ ఆలయాలు గల ఆకర్షణీయ పట్టణంగా ఉండేది. ఒక రాణి శాపం వల్ల ఈ ఆలయ పట్టణం ఇసుక పొరల్లో కూరుకుపోయినది అని ఒక పురాణ కథనం. ఈ పట్టణం గురించి పురాణాలలో దాగిన విషయాలు అనేకం వున్నాయి. ఇసుక పొరలు కింద చోళులు, పల్లవులు, గాంగులు, విజయనగర రాజులు మరియు హొయసలులతో సహా అనేక రాజ్యాలు ఉత్థాన పతనాలకు సాక్ష్యాలుగా నిలిచాయి.

తలకాడు దగ్గరలో గల అగర నరసింహ స్వాలి ఆలయం గురించిన విషయాలు:

Talakadu

PC: wikimedia.org

మూడున్నర గంటల ప్రయాణం తర్వాత మేము చేరవలసిన ప్రదేశానికి చేరుకున్నాం. మా వాహనాన్ని పార్కింగ్ స్థలంలో పెట్టి మేము దేవస్థానం వైపు నడుచుకుంటూ వెళ్లాం. మొత్తం 30 దేవస్థానాలలో కేవలం 5 మాత్రమే చూడగలం. మిగిలినవన్నీ ఇసుకలో కూరుకుపోయి వున్నాయి.

ఐదు దేవాలయాలు:

మేము ఈ ఐదు దేవాలయాలలో మొదటిది వైద్యనానాథేశ్వర ఆలయం. ఈ ఆలయం శివుడికి అంకితమైన ప్రసిద్ధ ఆలయంగా కనిపిస్తుంది. దీనిని 14 వ శతాబ్దంలో చోళులు గ్రానైట్ ఉపయోగించి నిర్మించారు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పంచ శివలింగం దర్శనం జరుగుతుంది.

తదుపరి కీర్తీ నారాయణ దేవాలయం. దీన్ని హొయసల రాజవంశం రాజు విష్ణువర్ధన్ 1911 సంవత్సరంలో నిర్మించాడు. ఇది త్రవ్వకాలలో బయటపడింది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితమైనది.

తలకాడు పంచాలింగేశ్వరాలయం:

Talakadu

PC: wikipedia.org

భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సహాయంతో తవ్వకం ప్రక్రియలు కొనసాగిస్తున్న ప్రదేశాలలో తలకాడు ఒకటి. అవును ఇది నిజమే. ఈ ప్రదేశం చూట్టూతా త్రవ్వకాలు జరిపి ఇసుక పొరల నుండి ఈ ఐదు ఆలయాలను కూడా వెలికి తీశారు.

అవును మేము ఇక్కడ ఈ ప్రాంతం చుట్టూ జరుగుతున్న పరిణామాలను మరియు ఇసుక తవ్వకం ద్వారా దేవాలయాలను బయటకు తీయటం స్వయంగా చూచాం. అక్కడ వున్న గైడు మాకు ఆలయ ద్వారాలపై గల ఆసక్తికరమైన చిత్రాలను చూపించి ఈ ప్రాంతం యొక్క అనేక కథనాలు వివరించారు. ఇందులో ఒక చిత్రం ముఖం, మొండెం గల ఒక భారీ ఎద్దును పోలి వుంది.

Talakadu

PC: alpinewineries.com

బెంగుళూర్ గౌర్మెట్ లోయ:

ఈ స్థలం పేరుపొందిన దేవాలయాలకే కాకుండా ఇటీవలనే వైన్ పర్యటనలు కూడా జరపబడుతున్నాయి. ఈ స్థలంను బెంగుళూర్ యొక్క "గౌర్మెట్ వ్యాలీ"గా పిలుస్తారు. స్లీపీ నగరంగా పేరుగాంచిన నగరంలో ఇప్పుడు జున్ను, ఫైన్ వైన్, అన్యదేశ పురుగుమందులు లేని కూరగాయలను కూడా ఉత్పత్తి చేస్తుంది.

మేము తర్వాత అక్కడ గల ద్రాక్షతోటలను సందర్శిద్దామనుకున్నాం. కానీ మా దురదృష్టం ఆ రోజు ద్రాక్షతోటలను సందర్శకులకు మూసివేశారు.

ఆ తరువాత బెంగళూరు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఎవరైతే చరిత్ర తెలుసుకోవాలని మరియు వాటిని పునరుద్దరించాలని ఆశక్తి కలగివుంటారో వారికి సరైన వేదిక.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X