Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరులో అయిదు ప్రధాన చారిత్రక ప్రదేశాలు ?

బెంగుళూరులో అయిదు ప్రధాన చారిత్రక ప్రదేశాలు ?

బెంగుళూరు ఒక సుందర నగరం, ఇక్కడ ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు. నేటి రోజులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి పరంగా ఎన్నో సాఫ్ట్ వారే సంస్థలు ఇక్కడ వెలిశాయి. గతం లో ఈ నగరాన్ని పించన్లు తీసుకునే వృద్ధులు వుండే నగరంగా చెప్పేవారు. కాని నేడు ఈ నగరం యువ తరానిది. నగరంలోని ప్రధాన ప్రదేశాలలో ఎన్నో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లుమల్టీ ప్లేక్స్ లు వెలిశాయి. అర్ధ రాత్రి వరకూ నగరంలోని వీధులు సందడిగానే వుంటాయి.

బెంగుళూరు వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా వుంటుంది. విలాస వంతమైన హోటళ్ళ తో అనేక విందులు, వినోదాలు నడుస్తాయి. నగరం ఎంత ఆధునికతలు సంతరించుకున్నప్పటికి, నేటికీ బెంగుళూరు నగరంలోని వివిధ ఆకర్షణీయ ప్రదేశాలకు పర్యాటకులు వరుస కట్టి వెళుతూనే వున్నారు. కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ కాఫీ తోటలు, చూడాలన్నా , మైసూరు,శ్రీరంగ పట్నం వంటి చారిత్రక ప్రదేశాలు చూడాలన్నా బెంగుళూరు ద్వారా వెళ్ళవలసినదే. మరి బెంగుళూరు సందర్శనలో ఏమి చూడాలి ? ఎన్నో ఆకర్షణలు కలవు. అయితే వాటిలో అయిదు ప్రధాన చారిత్రక ప్రదేశాలు పొందుపరుస్తున్నాం పరిశీలించండి.

చారిత్రక ప్రదేశాలు

టిప్పు సుల్తాన్ ఫోర్ట్ మరియు పాలస్

ఇక్కడి ఫోర్ట్ ను మొదటగా 1537 బెంగుళూరు నగర వ్యవస్థాపకుడు, కెంపే గౌడ మట్టి గోడలతో నిర్మించాడు. అయితే, తర్వాతి కాలంలో మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ అతని కుమారుడు కలసి ఈ కోటను బలోపేతం చేసి, ఇక్కడ నుండి బ్రిటిష్ వారితో పోరాడారు. అతని తదనంతరం, ఈ కోటను బ్రిటిష్ వారు తమ సెక్రటేరియట్ గా చేసుకున్నారు. టిప్పు సుల్తాన్ పాలస్ ను ఒక శాంతి నివాసంగా( పీస్ అఫ్ అబోడ్) చెపుతారు. దీని నిర్మాణంలో అద్భుత టీక్ వుడ్ చెక్కడాలు వాడారు, దీని శిల్ప శైలి ఇస్లామిక్ శిల్ప శైలి లో సాగింది. ఈ కోటలో కొన్ని రహస్య గదులు కలవు. మీరు వీటిని ఒక గైడ్ సహాయం తో చూడవచ్చు. ఇక్కడే కల మ్యూజియం తప్పక చూడండి. ఈ మ్యూజియం లో సుమారు వేయి చారిత్రక ఫోటోలు కలవు. ఇక్కడ ఫోటోగ్రఫీ అనుమతించరు.

బెంగుళూరు పాలస్
బెంగుళూరు నగర నడిబొడ్డున కల చిన్నదైన విండ్సర్ కేసల్ గా కనపడే ఈ నిర్మాణం తప్పక చూసి దాని అందాలు అభినందించాలి. దీనిని ఇంగ్లాండ్ లోని బెర్క్ షైర్ లో కల బ్రిటిష్ రాజ కుటుంబ నివాసం శైలి లో నిర్మించారు. 1862 లో మొదలు పెట్టిన ఈ భవనం పూర్తి అయ్యేందుకు ఒక శతాబ్దం పట్టింది. నేడు ఇందులో ప్రైవేటు పార్టీలు జరుగుతున్నాయి. విస్తారమైన దీని గ్రౌండ్స్ లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బెంగుళూరు నగర సందడిలో అనుభవించే ముందు ప్రశాంతమైన ఈ పాలస్ వాతావరణం తప్పక అనుభవించండి.

విధాన సౌద

ఇది కర్ణాటక రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలు నిర్వహించే భవనం. అందమైన ఈ భవన నిర్మాణం 1956 లో సుమారు నాలుగు సంవత్సరాల నిర్మాణం తర్వాత పూర్తి అయ్యింది. 1950 లలో మైసూరు రాష్ట్రం (ఇపుడు కర్నాటక) ముఖ్య మంత్రి కెంగల్ హనుమంతయ్య దక్షిణ భారత దేశ శిల్ప శైలి వుట్టిపదేట్లు, బ్రిటిష్ మరియు ఇస్లామిక్ డిజైన్ల ప్రభావంతో దీని నమూనా నిర్మాణం చేసారు. ఈ భవన ప్రవేశం చేయాలంటే ముందస్తు అనుమతులు కావాలి. బయటి ఆవరణలో కల పచ్చటి పచ్చిక లాన్ లలో నుండి చూసి కూడా ఆనందించవచ్చు. దీనిని ఆదివార సాయంకాలాలు, లేదా పబ్లిక్ హాలిడే లలో ప్రత్యేకంగా వెలిగించే విద్యుత్ దీపాల వెలుగులలో చూస్తె బాగుంటుంది.

బెంగుళూరులో అయిదు ప్రధాన చారిత్రక ప్రదేశాలు ?

మ్యూజియంలు
ప్రభుత్వ మ్యూజియం
మీరు చరిత్ర ప్రియులు కాక పోయినా సరే, ఇక్కడ కల ప్రభుత్వ మ్యూజియం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. 1886 లో స్థాపించిన ఈ మ్యూజియం ఇండియా లోని పురాతన మ్యూజియం లలో ఒకటి. దీనిలో ఎన్నో పురాతన శిల్పాలు, పెయింటింగ్ లు, నాణెములు, దక్షిణ భారత దేశ ఆభరణముల సేకరణలు కలవు. పని వేళలు ఉ. 10 గం నుండి సా 5 గం. వరకు. ఇది కబ్బన్ పార్క్ లో కస్తుర్బా రోడ్ పై కలదు.

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మరియు టెక్నలాజికల్ మ్యూజియం
విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మరియు టెక్నలాజికల్ మ్యూజియం కు సంవత్సరానికి సుమారు పది లక్షల మంది సందర్శకులు వస్తారు. నేటి రోజుల అద్భుత సైన్సు సమాచారాన్ని గత కాల సాంకేతికతలను క్రోడీకరించిన ఈ మ్యూజియం పిల్లలకు, పెద్దలకు ఎంతో విలువైన సమాచారం ఇస్తుంది. ఖగోళ వింతల నుండి, డైనోసార్ల ఆవిర్భావం వరకు తెలియచేస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు అవసరమైన ఎంతో విజ్ఞానం ఇక్కడ కలదు. పిల్లలు ఆనందించే సముద్ర లోతుల డైవింగ్, మరియు బ్రెయిన్ మెక్ సైన్సు వంటివి తప్పక చూడాలి. ఈ మ్యూజియం కబ్బన్ పార్క్ లోని కస్తుర్బా రోడ్ లో కలదు. పని వేళలు ఉ. 10 గం. నుండి సా. 6 గం వరకు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X