Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక బీచ్ లు ఇచ్చే ఆనందాలు !

కర్నాటక బీచ్ లు ఇచ్చే ఆనందాలు !

కర్నాటక రాష్ట్రం సుమారు 320 కి. మీ. ల కోస్తా తీరం కలిగి వుంది. ఈ తీరం లో కల బీచ్ లు కర్ణాటక రాష్ట్ర టూరిజం ను ఎప్పటి కపుడు జీవం కలదిగా చేస్తున్నాయి. చల్లటి గాలులు అందించే తాటి చెట్లు, తేమ కల వాతావరణం, స్వచ్చమైన నీలాకాశం, చక్కని అలల ధ్వనుల సముద్రం, అన్నిటికి మించి కోస్తా తీరం వెంట దొరికే అసలు సిసలైన కమ్మని వంటకాలు మీకు కర్నాటక రాష్ట్ర పర్యటన లో అద్భుత ఆనందాలు అందిస్తాయి.
సుందరమైన కర్నాటక బీచ్ లు

మాల్పే బీచ్

మాల్పే బీచ్

మాల్పే బీచ్ ఉడుపి పట్టణానికి 6 కి. మీ. ల దూరం. మాల్పే నది మొదట్లో కల ప్రశాంతమైన బీచ్. ఇక్కడ కల ప్రకృతి అందాలు మీ ఇంద్రియాలను ఫ్రెష్ అప్ చేస్తాయి. ఇక్కడ కల బలరామ టెంపుల్, టైల్ ఫ్యాక్టరీ తప్పక చూడండి.

ఫోటో క్రెడిట్ : Phaneesh N

సెయింట్ మేరీ ఐలాండ్

సెయింట్ మేరీ ఐలాండ్

సెయింట్ మేరీ ఐలాండ్ మాల్పే బీచ్ కు 6 కి. మీ. ల దూరంలో అరేబియన్ సముద్రం లో వుంటుంది. ఇక్కడ క్రీ.శ. 1498 లో వాస్కో డా గామా తన స్వహస్తాలతో ఉంచిన ఒక శిలువ కూడా కలదు. ఇక్కడ కల ఉప్పు నీటి కయ్యాలు, పర్యాటకులకు, శాస్త్రవేత్తలకు మంచి ఆసక్తిని కలిగిస్తాయి. ఫోటో క్రెడిట్ : Man On Mission

కార్వార్

కార్వార్

అందమైన కార్వార్ బీచ్ మరియు ఇక్కడ కల ఏటవాలు లోయలు విశ్వ కవి రబీంద్ర నాథ్ టాగోర్ ను సైతం ఆకర్షించాయి. ఈ మహా కవి తన మొదటి రచనను ఇక్కడే చేసాడు. నేటి వరకూ కూడా కార్వార్ ఈ కవితా ధోరణి నిలుపు కుంటోంది . ఫోటో క్రెడిట్ :

Ankur Chakraborty

మరావంతే

మరావంతే

మరావంతే ఒక అద్భుతమైన బీచ్. ఇక్కడ కోడచాద్రి హిల్స్ నేపధ్యం , వాటి నుండి చూసే అరేబియన్ మహాసముద్రం దృశ్యాలు, పక్కనే కల సుపర్నిక నది గల గలలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. సూర్యుడి బంగారు కిరణాలు ఉదయం వేళ లో మీకు ఎంతో ఆనందం కలిగిస్తాయి.

గోకర్ణ

గోకర్ణ

గోకర్ణ ను హిప్పీ ల భూమి అంటారు. గోకర్ణ బీచ్ ఎంతో ప్రశాంతం గా వుంటుంది. సింపుల్ గా వుండే ఈ బీచ్ మీకు జీవితంలో మరపు రాణి అనుభవాలను అందిస్తుంది. ఇక్కడే కల, ఓం బీచ్, కుడ్లు బీచ్, పారడైస్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అన్నీ కూడా మీ సెలవు రోజులను పూర్తిగా ఆనందింప చేస్తాయి. ఫోటో క్రెడిట్ :
Photo Courtesy: Happyshopper

మురుడేశ్వర

మురుడేశ్వర

ఇక్కడ ఇండియా లో అతి పొడవైన శివ విగ్రహం బీచ్ ప్రవేశంలో కలదు. ఇక్కడి సముద్రం, ఆకాశం, అలల ధ్వని వంటి ఆనందాలు చూస్తూ మీరు ఎంత సమమైనా గడిపేయవచ్చు. మీరు ఆశించిన దాని కంటే కూడా ఎక్కువ ఆనందాలు ఈ బీచ్ మీకు అందిస్తుంది.

ఫోటో క్రెడిట్ : Thejas Panarkandy

కౌప్ బీచ్

కౌప్ బీచ్

కౌప్ బీచ్ లో 100 అడుగుల ఎత్తు కల ఒక పురాతన లైట్ హౌస్ మీకు చక్కని సముద్ర దృశ్యం చూపుతుంది. కౌప్ లేదా కాపు అనబడే ఈ బీచ్ ఉడుపి పట్టణానికి 12 కి. మీ. లు దక్షిణంగా వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X