Search
  • Follow NativePlanet
Share
» »నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే అరకులోయ !

నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే అరకులోయ !

అరకులోయ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం.

అరకులోయ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. విశాఖనుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం.

పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో గిరిజన మ్యూజియం ఉంది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్‌ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే కాఫీ రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్‌ లభిస్తుంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మ్యూజియంలో గడపవచ్చు.

భారతదేశంలో 10 ట్విన్ టౌన్స్ మరియు సిస్టర్ సిటీస్ గురించి మీకు తెలుసా?భారతదేశంలో 10 ట్విన్ టౌన్స్ మరియు సిస్టర్ సిటీస్ గురించి మీకు తెలుసా?

2500 నెమళ్ళు కలిసి ఒకేసారి ఆడే నాట్యం చూడాలని వుందా.. అయితే తప్పకుండా వెళ్ళండి మొరాచి చించోలి2500 నెమళ్ళు కలిసి ఒకేసారి ఆడే నాట్యం చూడాలని వుందా.. అయితే తప్పకుండా వెళ్ళండి మొరాచి చించోలి

నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే అరకులోయ

1. కటికి, తాటిగుడ జలపాతాలు

1. కటికి, తాటిగుడ జలపాతాలు

బొర్రా గుహలను సందర్శించి బయటకు వచ్చాక సమయం ఉంటే 3 కి.మీ. దూరంలో ఉన్న కటికి జలపాతాన్ని, అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చు. సాయంత్రం అరకులోయ రైల్వేస్టేషన్‌ నుంచి అద్దాల రైలు బయలుదేరి బొర్రా స్టేషన్‌కు 6.05 గంటలకు వస్తుంది. ఈలోగా బొర్రా స్టేషన్‌కు చేరుకుంటే రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవచ్చు.

PC: Pradeepgudipati

2. చాపరాయి జలపాతం

2. చాపరాయి జలపాతం

గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో చాపరాయి జలపాతం ఉంది. గిరిజన మ్యూజియం నుంచి బయలుదేరితే 30 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. బండరాయి వంటి చాపరాతిపై ప్రవహిస్తున్న జాలువారే నీటిలో తేలియాడవచ్చు. స్థానికంగా బొంగులో చికెన్‌ విక్రయాలు అధికంగా జరుగుతాయి. మాంసాహార ప్రియులు బొంగులో చికెన్‌ను ఇక్కడు రుచి చూడవచ్చు.

PC: Adityamadhav83

3. పద్మాపురం ఉద్యానవనం

3. పద్మాపురం ఉద్యానవనం

అరకులోయ రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ. దూరంలో పద్మాపురం ఉద్యాన వనం ఉంది. రైల్వే స్టేషన్‌లో ఉదయం 11.05 గంటలకు రైలు దిగిన తర్వాత పది నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితరాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు.

PC: Ravi teja

4. బొర్రా గుహలు

4. బొర్రా గుహలు

చాపరాయి జలపాతం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి అరకులోయ చేరుకుని స్థానికంగా ఉన్న హోటళ్లలో భోజనం చేసి 17 కి.మీ. దూరంలో ఉన్న డముకు వ్యూపాయింట్‌, కాఫీ తోటలను తిలకించొచ్చు. అక్కడి నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న బొర్రా గుహలకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవచ్చు. బొర్రా గుహలను తిలకించేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది.

PC: Gourab001

5. హోటళ్లు

5. హోటళ్లు

బొర్రా గుహల సమీపంలోనూ హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. బొంగులో చికెన్‌కు బొర్రా గుహల సమీపంలోని హోటళ్లు ప్రసిద్ధి. ముందుగా ఆర్డర్‌ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేస్తారు.

PC: Gourab001

6. విశాఖపట్నం నుండి అరకు రైలు యాత్ర

6. విశాఖపట్నం నుండి అరకు రైలు యాత్ర

విశాఖపట్నం - కిరండూల్‌ వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతోంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో అరకులోయ స్టేషన్‌లో అద్దాల బోగీని కలుపుకొని విశాఖపట్నం తీసుకువస్తుంది. ఈ రైలు విశాఖపట్నం స్టేషన్‌ నుంచి ప్రతి రోజూ ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది.

PC: Adityamadhav83

7. ప్రకృతి రమణీయ దృశ్యాలు

7. ప్రకృతి రమణీయ దృశ్యాలు

విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా ప్రకృతి రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది.

PC: Rajib Ghosh

8. సందర్శనీయ స్థలాలు

8. సందర్శనీయ స్థలాలు

అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

PC: roadconnoisseur

9. ఎలా వెళ్ళాలి

9. ఎలా వెళ్ళాలి

సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.

pc: google maps

అరకు లోయను చేరుటకు మార్గం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X