Search
  • Follow NativePlanet
Share
» »'కన్యత్వ బీచ్' చూసొద్దామా !!

'కన్యత్వ బీచ్' చూసొద్దామా !!

పర్యాటకులు ఎంతో ఇష్టపడే మరవంతే బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది. ఇక్కడి నుండి జాతీయ రహదారి షుమారు 100 మీటర్ల దూరం మాత్రమే. కనుక మీరు బీచ్ సందర్శించటం ఎంతో తేలిక.

By Mohammad

రాష్ట్రం - కర్నాటక

జిల్లా - ఉడిపి

సమీప నగరాలు - కుందాపుర, బైందూర్

ప్రత్యేకం - అందమైన బీచ్ లకు ప్రసిద్ధి.

మరవంతే ఒక చిన్న పట్టణం. దీనిలో ప్రధాన ఆకర్షణ దానికిగల అందమైన బీచ్. ఈ పట్టణం ఉడిపి జిల్లాలో ఉన్నది. పట్టణానికి కుడిభాగంలో అరేబియా సముద్రం ఎడమ భాగంలో సౌపర్ణిక నది ఉంటాయి. కుందాపుర వద్దనున్న ఈ బీచ్ ఉడుపి పట్టణానికి సుమారు 50 కి.మీ. దూరంలోను మరియు బెంగుళూరు నగరానికి 450 కి. మీ. దూరంలోను ఉంటుంది.

కర్నాటక బీచ్లు ... కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాలు !!కర్నాటక బీచ్లు ... కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాలు !!

ప్రశాంత జీవనం కోరేవారి స్వర్గం ఈ బీచ్ ను తరచుగా వర్జిన్ బీచ్ లేదా కన్యత్వ బీచ్ అంటారు. దానికి కారణం ఈ బీచ్ మైళ్ళ పొడవున ఏ మాత్రం పాడవకుండా తెల్లటి ఇసుకతో పరచబడి ఉంటుంది. పర్యాటకులు ఎంతో ఇష్టపడే ఈ బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది. ఇక్కడినుండి జాతీయ రహదారి షుమారు 100 మీటర్ల దూరం మాత్రమే. కనుక మీరు బీచ్ సందర్శించటం ఎంతో తేలిక.

కుందాపూర్

కుందాపూర్

మరవంతే లో కుందాపూర్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ పట్టణాన్ని సూర్య పట్టణం అని కూడా అంటారు. ఇక్కడ కుందేశ్వర దేవాలయం ఉంది.

చిత్రకృప : Neinsun

ప్రధాన ఓడరేవు

ప్రధాన ఓడరేవు

16వ శతాబ్దంలో పోర్చుగీసు పాలకులు, జర్మన్ మత ప్రచారకులు ఈ పట్టణం స్ధాపించారని చెపుతారు. ఈ పట్టణం బైందూరు రాజులకు ప్రధాన ఓడరేవుగా ఉండేది. పట్టణం మూడు వైపులా నీరు ఉంటుంది. పర్యాటకులు బోట్ లో సమీప గ్రామాలకు ప్రయాణించవచ్చు.

చిత్రకృప : Surajms1994

మరవంతే

మరవంతే

మరవంతే బీచ్ ఉడుపి పట్టణానికి 55 కి.మీ. దూరంలో ఉంది. అందమైన బీచ్ ఇది. కంచుగోడు గ్రామం వద్దగల ప్రదేశంలో స్కూబా డైవింగ్, స్నోర్ కెలింగి వంటి ఆటలు ఆడవచ్చు. బీచ్ లో స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.

చిత్రకృప : Rayabhari

పర్యాటకులకు కన్నుల విందు

పర్యాటకులకు కన్నుల విందు

బీచ్ సమీపంలోగల సౌపర్ణిక నది ఒడ్డునకల దేవాలయాన్ని సందర్శించవచ్చు. కొడచారి హిల్స్ మరియు అందమైన కొబ్బరి తోటలు దాని వెనుక కనపడే బీచ్ వంటివి పర్యాటకులకు కన్నుల విందు చేస్తాయి.

చిత్రకృప : Niraj Rajmohan

ఆనెగుడ్డె వినాయక దేవాలయం

ఆనెగుడ్డె వినాయక దేవాలయం

మరవంతే వచ్చిన పర్యాటకులు ఆనెగుడ్డ వినాయక మందిరం తప్పక చూడాలి. ఇది పట్టణానికి 21. 6 కి.మీ. దూరంలో ఉంటుంది. గణేషుడు ప్రధాన దేవత. ఆనె అనగా ఏనుగు, గుడ్డె అనగా కొండ అని అర్ధంగా చెపుతారు.

చిత్రకృప : Raghavendra Nayak Muddur

రధోత్సవం

రధోత్సవం

ఇక్కడి గణపతి దేవుడి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి. ఇక్కడ గణేష చతుర్ధి, సంకష్ట చతుర్ధి చేస్తారు. డిసెంబర్ నెలలో రధోత్సవం జరుగుతుంది. ఈ దేవాలయ సమీపంలో మహాలింగేశ్వర దేవాలయం కూడా ఒక మంచి ఆకర్షణగా ఉంటుంది.

హట్టియంగాడి సిద్ధి వినాయక దేవాలయం

హట్టియంగాడి సిద్ధి వినాయక దేవాలయం

పర్యాటకులు వరాహి నదిపై ఉన్న సిద్ధి వినాయక దేవాలయం కూడా చూడవచ్చు. మరావంతే టవున్ కు షుమారు 14 కి.మీ.ల దూరంలో ఉంది. ప్రతిరోజు ఇక్కడ యాత్రికులకు అన్నదానం జరుగుతుంది.

విగ్రహం పెరుగుతోంది

విగ్రహం పెరుగుతోంది

ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో అలుప రాజులు గణేషుడికి అంకితమిచ్చారు. ఆయనను ఇక్కడ సిద్ధి వినాయక అంటారు. ఈ విగ్రహం సాలిగ్రామ రాతితో చెక్కబడింది. విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్లుగా కూడా కొంతమంది చెపుతారు.

కోడి బీచ్

కోడి బీచ్

మరవంతేకు వెళ్ళే పర్యాటకులు కోడి బీచ్ చూసి తీరాల్సిందే. కన్నడంలో దీనికి ఒడ్డు అని అర్ధం చెపుతారు. ఈ బీచ్ కు 20 కి.మీ. దూరంలో పట్టణం ఉంటుంది. ఈ బీచ్ కు వచ్చే వారు స్విమ్మింగ్, ఇతర నీటి సంబంధిత ఆటలు ఆడి ఎంతో విశ్రాంతి పొందుతారు.

చిత్రకృప : Kavya Bhat

ఒట్టినానె

ఒట్టినానె

మరావంతే బీచ్ సమీపంలోగల కొండల ప్రక్కన ఒట్టినానే ప్రదేశం ఉంటుంది. ఇక్కడనుండి సూర్యాస్తమయం చూస్తే చాలాబాగుంటుంది. క్షితిజ నేచర్ రిసార్ట్ మరియు బీచ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

చిత్రకృప : Niraj Rajmohan

వర్షాకాలం

వర్షాకాలం

పర్యాటకులు బైందూర్ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం కూడా చూసి ఆనందిస్తారు. ఈ ప్రదేశం చూసేందుకు వర్షాకాలం చాలా బాగుంటుంది. ఆ సమయంలో అటవీ పూలు చక్కగా వికసించి ప్రాంతం అంతా అందంగా కనపడుతుంది.

చిత్రకృప : Raghavendra Nayak Muddur

మధుర అనుభూతులు

మధుర అనుభూతులు

బీచ్ లో కల అంతు లేని ఇసుక ప్రదేశం, చల్లటి గాలినిచ్చే సముద్రం, తాటి చెట్లు వంటివి ఈ ప్రాంతంలో మీకు ఎంతో ప్రశాంతతనిచ్చి జీవితంలో మరువలేని మధుర అనుభూతులు పంచుతాయి.

చిత్రకృప : Riju K Follow

శీతాకాలం

శీతాకాలం

మరవంతే పట్టణంలో కోస్తాతీర వాతావరణం ఉంటుంది. శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం. సముద్రంలో స్విమ్మింగ్ చేసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Niraj Rajmohan

మరవంతే బీచ్ ఇలా చేరండి !!

మరవంతే బీచ్ ఇలా చేరండి !!

వాయు మార్గం : మరవంతే సమీపాన 110 కి.మీ ల దూరంలో మంగళూరు విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో బీచ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : 18 కి. మీ ల దూరంలో కుందాపుర స్టేషన్ కలదు. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులలో బీచ్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : గోకర్ణ, బెంగళూరు, గోవా, కుందాపుర, ఉడుపి, మంగళూరు మరియు ఇతర ప్రాంతాల నుంచి మరవంతే కు ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : vivek raj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X