Search
  • Follow NativePlanet
Share
» »చీకటి - వెలుగుల రంగేళి ...మాహి బీచ్ !

చీకటి - వెలుగుల రంగేళి ...మాహి బీచ్ !

మహి దక్షిణ భారతదేశం లో పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం లో ఉన్న ఒక పట్టణం. ఇది కేవలం 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. మహి, కేరళకు మూడు వైపులా చుట్టుముట్టబడి ఉండటంవలన, ఆ రాష్ట్ర ప్రభావం ఇక్కడి భాష మరియు ఆహారపు అలవాట్ల మీద ఉన్నది.దేశవ్యాప్తంగా అత్యధిక అక్షరాస్యత ఉన్న మున్సిపాలిటీలను మహి పట్టణం కలిగి ఉన్నది. ఈ పట్టణం 1954 వరకు విదేశీ (ఫ్రెంచ్) పాలనలో ఉన్నది మరియు ఫ్రెంచ్ సంస్కృతి శేషాలు ఇక్కడి ప్రజలలో మరియు నిర్మాణకళలో చూడవొచ్చు. 1855 లో నిర్మించిన గవర్నమెంట్ హౌస్ దీనికి ఒక ప్రధాన ఉదాహరణ.

సూర్యాస్తమయం

సూర్యాస్తమయం

పాండిచేరి లోని మాహి బీచ్ సూర్యోదయ మరియు సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి. పాండిచ్చేరి చేరిన పర్యాటకులు పగలంతా ఎక్కడ తిరిగినా సాయంత్రం అయ్యేసరికి మాహి బీచ్ చేరి సూర్యాస్తమయం ఆనందిస్తారు.

Photos Courtesy : www.wikipedia.org

ప్రార్ధనా కేంద్రం

ప్రార్ధనా కేంద్రం

మహి పల్లి లేదా చర్చి, ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఒక మతపరమైన ప్రార్ధనాకేంద్రం; దీనిలో పరిసర ప్రాంతాలు నుండి క్రైస్తవులు వొచ్చి ప్రార్థనలు జరుపుతారు. చర్చి ప్రవేశ ద్వారం చక్కని చెక్కడాలు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది.

Photos Courtesy : mahe.gov.in .in

మయ్యాలి నది ఒడ్డు

మయ్యాలి నది ఒడ్డు

ఇక్కడ సంవత్సరం పొడుగునా పర్యాటకులు పట్టణం యొక్క నిర్మల ప్రకృతి దృశ్యాలను ఆనందించటం చూడవొచ్చు. ప్రత్యేకించి సూర్యాస్తమయ దృశ్యం మయ్యాలి నది ఒడ్డున బాగుంటుంది. సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది.

Photos Courtesy : mahe.gov

ప్రకృతి దృశ్యాల పరవశం

ప్రకృతి దృశ్యాల పరవశం

ఇక్కడ ఉన్నమహి బోట్ హౌస్, స్పీడ్ బోట్స్, పెడల్ బోట్లు మరియు కాయక్ లతో ఒక ప్రధాన ఆకర్షణగా ఉన్నది. ఇక్కడ సంవత్సరం పొడుగునా పర్యాటకులు పట్టణం యొక్క నిర్మల ప్రకృతి దృశ్యాలను రైల్వే బ్రిడ్జి నుండి చూసి ఆనందించ వొచ్చు.

Photos Courtesy : mahe.gov.in

సూర్యోదయ పులకింతలు

సూర్యోదయ పులకింతలు

మహీ లో పర్యాటకులు తప్పక చూడ దగిన దృశ్యం సూర్యోదయం. ఉదయపు వేళలో ప్రకృతి దృశ్యాలు పులకింప చేస్తాయి.
మహి సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది.మహి చేరుకోవడం ఎలా?మహి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు అనుసంధించబడి ఉన్నది.
Photos Courtesy : mahe.gov.in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X