Search
  • Follow NativePlanet
Share
» »అందర్నీ భయపెడుతున్న రైల్వేస్టేషన్..!

అందర్నీ భయపెడుతున్న రైల్వేస్టేషన్..!

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు వెస్ట్ బెంగాల్ లోని పురిలియా ప్రాంతంలో మావోయిస్టులు కూడే చోటు అని చెప్పబడే బేగన్ కొడోర్ రైల్వేస్టేషన్ లో పనిచేయడానికి నిరాకారిస్తున్నారట.

By Venkatakarunasri

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు వెస్ట్ బెంగాల్ లోని పురిలియా ప్రాంతంలో మావోయిస్టులు కూడే చోటు అని చెప్పబడే బేగన్ కొడోర్ రైల్వేస్టేషన్ లో పనిచేయడానికి నిరాకారిస్తున్నారట. కారణం ఆ రైల్వే స్టేషన్ లో తెల్ల చీర కట్టుకున్న ఒక దయ్యం సంచరిస్తోందట.

వెస్ట్ బెంగాల్ లో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు !!వెస్ట్ బెంగాల్ లో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు !!

42 సంవత్సారాల తరువాత పోయిన సంవత్సరం తిరిగి తెరిచిన ఈ రైల్వే స్టేషన్లో ప్రైవేట్ గా టికెట్లు అమ్ముకునే హక్కు పొందిన డలూ మహోట్ అనే అతను మాత్రం పనిచేస్తున్నాడు.

అందర్నీ భయపెడుతున్న రైల్వేస్టేషన్..!

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

బేగన్ కొడోర్ రైల్వేస్టేషన్..!

బేగన్ కొడోర్ రైల్వేస్టేషన్..!

వెస్ట్ బెంగాల్ లో ఉన్న పురిలియా జిల్లా హెడ్ క్వాటర్స్ కు 43 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేగన్ కొడోర్ రైల్వే స్టేషన్ను 1967 లో మూసివేసేరు. కారణం, ఆ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఒక రోజు తెల్ల చీర కట్టుకున్న ఒక దయ్యం ఒక ప్యాసెంజర్ రైలు వెనుక పరిగెత్తటం చూసేడట.

PC:youtube

రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్

రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్

ఆ మరుసటి రోజు ఆ రైల్వే ఉద్యోగి చనిపోయేడట......ఈ సంఘటన ఎటువంటి భయాందోళన కలిగించిందంటే ఆ రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ తో సహా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ ఆ రైల్వే స్టేషన్ను వదలి పెట్టి వెళ్ళిపోయేరట.

బిందు : భారత్ - భూటాన్ సరిహద్దు ప్రదేశం !!

PC:youtube

ప్యాసింజర్ రైళ్ళు

ప్యాసింజర్ రైళ్ళు

ఆ స్టేషన్ మార్గంగా వెడుతూ, ఆ స్టేషన్లో ఆగవలసిన ప్యాసింజర్ రైళ్ళు కూడా ఆ రోజు తరువాత నుండి ఆ స్టేషన్లో ఆగకుండా వెడుతున్నాయట. దీని వలన ఆ ప్రాంతములోని ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులకు గురి అయ్యేరట.

PC:youtube

ప్రయాణీకులతో రద్దీగా సందడిగా

ప్రయాణీకులతో రద్దీగా సందడిగా

ఏదైనా రైల్వేస్టేషన్ అంటే అంతా ప్రయాణీకులతో రద్దీగా సందడిగా వుంటుంది. కానీ నేను చెప్పే ఈ రైల్వేస్టేషన్ అన్నిటికన్నా భిన్నమైనది.

PC:youtube

పురులియా జిల్లా

పురులియా జిల్లా

ఆ రైల్వేస్టేషన్ అంటే అందరికీ గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతాయి. తెల్లచీర కట్టుకుని రైలు వెంట పరుగెత్తే దెయ్యం అందరికీ గుర్తుకువస్తుంది. ఇది బెంగాల్ లో పురులియా జిల్లాకి దాదాపు 40కి.మీ దూరంలో వున్న బేగన్ కొడోర్ రైల్వేస్టేషన్.

PC:youtube

ధైర్యం

ధైర్యం

రైల్వేస్టేషన్ లో తెల్ల చీర కట్టుకుని ఒక దెయ్యం రైళ్ళ వెంట పరుగెడుతుందని అందరూ అంటుంటారు. ఆ రైల్వేస్టేషన్ లో ఏ ఉద్యోగి పని చేయటానికి ధైర్యం చేయక ఉద్యోగాలు వదులుకుని వెళ్తున్నారు.

PC:youtube

రాత్రి విధులు

రాత్రి విధులు

అక్కడ ఒకరోజు ఒక ఉద్యోగి రాత్రి విధులు నిర్వహిస్తుండగా ఆ రైల్వేస్టేషన్ లో రైలు ఆగింది. మళ్ళీ ఆ రైలు స్టార్టు అయ్యింది.

సాగర్ ఐలాండ్ - ద్వీపంలోనే స్వర్గం !

PC:youtube

ఒక స్త్రీ రైలు వెనకాల పరుగెత్తడం

ఒక స్త్రీ రైలు వెనకాల పరుగెత్తడం

విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆ రైలు వైపు చూస్తున్న సమయంలో ఆ రైలు వెనకాల జుట్టు విరబోసుకొని తెల్లచీర కట్టుకున్న ఒక స్త్రీ రైలు వెనకాల పరుగెత్తడం గమనించాడు.

డార్జీలింగ్ -భారతదేశ 'టీ' స్వర్గం !

PC:youtube

ఉద్యోగి గుండె గుభేల్ మంది.

ఉద్యోగి గుండె గుభేల్ మంది.

ఎవరో ప్రయాణీకురాలు పరుగెడుతుందని ఆపడానికి ట్రై చేసాడు. వెంటనే ఆమె మాయమయ్యింది. అంతే ఆ ఉద్యోగి గుండె గుభేల్ మంది.

PC:youtube

దెయ్యం కనిపించడంతో

దెయ్యం కనిపించడంతో

ఆ షాక్ కు తట్టుకోలేక ఆ ఉద్యోగి మరుసటి రోజు మరణించాడు. అదే విధంగా చాలామందికి ఆ దెయ్యం కనిపించడంతో జనం కూడా ఆ స్టేషన్ కి వెళ్ళటం మానేశారు.

PC:youtube

1967లో ఆ స్టేషన్ ను పూర్తిగా మూసివేసారు

1967లో ఆ స్టేషన్ ను పూర్తిగా మూసివేసారు

ఉద్యోగులు కూడా అక్కడ చేయటానికి నిరాకరించారు. దాంతో 1967లో ఆ స్టేషన్ ను పూర్తిగా మూసివేసారు. మళ్ళీ 2009లో మమతాబెనర్జీ పరిపాలనలో ఆ రైల్వేస్టేషన్ ను తెరిచారు. కానీ ఏ ఉద్యోగి అక్కడ పనిచేయటానికి ముందుకు రాకపోవటంతో అక్కడ ఒక ప్రయివేట్ ఏజంట్ ను నియమించారు.

PC:youtube

రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులు పగలు మాత్రమే వుంటారు.

రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులు పగలు మాత్రమే వుంటారు.

అక్కడ అన్ని పనులు ఆ ప్రైవేట్ ఏజంట్ చూసుకుంటున్నాడు. ఆ రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులు పగలు మాత్రమే వుంటారు.

దీపావళి - వివిధ రాష్ట్రాల వేడుకలు !

PC:youtube

మిస్టరీ గానే మిగిలిపోయింది.

మిస్టరీ గానే మిగిలిపోయింది.

రాత్రి అయితే ఎవరూ వుండరు. కానీ రైల్వే అధికారులు ఇదంతా పుకార్లని నిజం కాదని అంటున్నారు. కానీ జనాల్లో ఆ భయం మాత్రం పోలేదు. ఇది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.

తారాపీఠ్ - తాంత్రిక శక్తులు గల ఆలయం !!

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X