అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

విశాఖ సాగరతీరాలు.. మీ కోసం..

Written by: Venkata Karunasri Nalluru
Updated: Friday, May 5, 2017, 11:21 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

సాయంకాలానా.. సాగరతీరాన.. సంధ్యాసూర్యుడిలా నువ్వూనేను.. అంటూ చిరంజీవి ఖైదీ నెం150లో పాడుకున్నట్లు మనం కూడా వేసవికాలంలో సాయంత్రం సాగరతీరంలో సేదతీరితే ఉల్లాసంగా వుంటుంది కదూ.... అందుకే మీకోసం మీమందిస్తున్నాం విశాఖ సాగరతీరాలు..

విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు. దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి.

విశాఖపట్నంలో సాగరతీరాలు

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. రామకృష్ణ బీచ్

విశాఖపట్నంలో ఉన్న బీచ్ లలో తూర్పు తీరంలో వున్న రామకృష్ణ బీచ్ ప్రముఖమైనది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం కాషాయరంగులో ఉండి మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది.

pc: Veluru.nagarjuna

2. లాసన్ యొక్క బే బీచ్

రామకృష్ణ బీచ్ మరియు దాని జంట బీచ్ అయిన లాసన్ యొక్క బే బీచ్ చుస్తే అత్యద్భుతమైన అందాన్ని ఇస్తాయి. బీచ్ దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

pc: Veluru.nagarjuna

3.చూడవలసిన ప్రదేశాలు

1971 ఇండో పాక్ యుద్ధం సైనికులు గుడి, వదు పార్క్, సబ్మెరైన్ మ్యూజియం, మత్స్యదర్శిని మరియు యుద్ద శిలాస్థూపం, కాళి ఆలయము, బోట్ లో ప్రయాణము, నీటి సర్ఫింగ్ మరియు వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి.

pc:Adityamadhav83

4. సముద్ర స్నానం

రామకృష్ణ బీచ్ లో సముద్ర స్నానం చేయటానికి అనుమతి ఉంది. ఇవన్నీ ఉండుట వల్ల బీచ్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నది.

pc:Priyadarshi Ranjan

5.యారాడ బీచ్

యారాడ బీచ్ వైజాగ్ నగరానికి చాలా దగ్గరలో వున్న బీచ్. బీచ్ కి మూడు వైపులా పచ్చని కొండలు మరియు నాలుగో వైపున బంగాళాఖాతం వుంది.

pc:Veluru.nagarjuna

6. అందమైన సూర్యాస్తమయం

ఈ సముద్ర తీరంలో ఒక అందమైన సూర్యాస్తమయంను చూడవచ్చు. బీచ్ పచ్చదనం మరియు బంగారు రంగు ఇసుకతో ఉంటుంది. ఇక్కడ ప్రశాంతత ఎక్కువుగా ఉంటుంది. ఈ బీచ్ ను చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారు.

pc: Adityamadhav83

7. సినిమా షూటింగ్స్

నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ అనేక సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. సాయంకాలం వేళ ఇక్కడ తిరగడం ఒక ప్రత్యేకమైన అనుభూతి.

pc: Rajib Ghosh

8. ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్

ఇక్కడ మనం ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ తూర్పు కొండల నడుమ వైజాగ్ నగరంలో చూడవచ్చును.

pc:Adityamadhav83

9. అందాల నగరం విశాఖపట్నం

సాగర తీరాన ప్రకృతి ఒడిలొ ఒదిగిన అందాల నగరం విశాఖపట్నం. విశాఖ నగరానికి వైజాగ్, వాల్తేరు అనే పేర్లు కలవు. విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత రెండవ అతి పెద్ద నగరం. చుట్టూ పచ్చని కొండలు, సాగర తీరం ఈ రెండూ ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తాయి.

pc:Amit Chattopadhyay

 

10. సహజ సిద్ద నౌకాశ్రయం

ఇక్కడ సహజ సిద్దంగా ఏర్పడిన నౌకాశ్రయం దేశంలోని పెద్ద నౌకాశ్రయాలలో ఒకటి. అతి పెద్దదైన స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడే కలదు.

pc:Veluru.nagarjuna

 

11. కైలాసగిరి

కైలాసగిరి ప్రాంతం వైజాగ్ లో అందమైన పిక్నిక్ ప్రదేశం. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై వున్నది. ఇక్కడ నుండి సముద్ర తీరం చాలా బాగా కనబడుతుంది. శివుడు, పార్వతిల విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవే కాకుండా పిల్లలకు పార్క్ రోప్ వే మొదలయిన ఎన్నో ఉన్నాయి.

pc: Sankara Subramanian

 

12. రామకృష్ణా బీచ్

కైలాసగిరి తర్వాత మరో చూడదగిన ప్రాంతం రామకృష్ణా బీచ్. దీనినే ఆర్.కె బీచ్ అని కూడా అంటారు. ఇక్కడ అనేక సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. సాయంకాలం వేళ ఇక్కడ తిరగడం ఒక ప్రత్యేకమైన అనుభూతి.

pc:ManojKRacherla

 

13. రిషి కొండ బీచ్

రిషికొండ బీచ్ వైజాగ్ నగరానికి 8 కిమీ దూరంలో ఉంది. ఇది కూడా మంచి టూరిష్ట్ స్పాట్. ఇది . ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పున్నమి రిసార్ట్ ని ఏర్పాటు చేసారు.

pc: Rajib Ghosh

14. ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్

ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ తూర్పు కొండల నడుమ వైజాగ్ నగరం నందు ఏర్పాటు చేసారు. ఈ పార్క్ ప్రపంచంలోని పెద్ద పార్క్ లలో ఒకటి. ఇక్కడ మనం రకరకాలైన జంతువులను, పక్షులను చూడవచ్చు.

pc: Adityamadhav83

15. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం

ఈ ఆలయం వైజాగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఈ అలయం చాలా ప్రాచీనమైనది. లక్ష్మీనరసింహస్వామినే సింహాద్రి అప్పన్నగా స్థానికులు పిలుస్తారు. ఈ అలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో కొండ మీద ఉంది. హిరణ్యకసిపుడిని సంహరించిన అనంతరం ప్రహ్లాదుడు ఇక్కడ స్వామి వారిని ప్రతీష్టించాడని అంటారు. ఇక్కడ చైత్రమాసంలో రథోత్సవాలను నిర్వహిస్తారు. ఇక్కడికి చేరుకొవడానికి వైజాగ్ నుండి అర్.టి.సి వారు బస్సు సర్వీసులన్ను నడుపుచున్నారు. బస చెయ్యడానికి కాటేజ్ లు కూడా కలవు.

pc:Adityamadhav83

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

English summary

Best Beaches In Vizag

Visakhapatnam is the largest city in Andhra Pradesh. It is located on the coast of Bay of Bengal in the north eastern region of the state.
Please Wait while comments are loading...