Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతికి భారీ భూకంపం రానుందా !

తిరుపతికి భారీ భూకంపం రానుందా !

తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఏకైక నగరము మరియు ఆంధ్ర ప్రదేశ్లో 4 వ అతిపెద్ధ నగరం .తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి నగరానికి విమాన, రైలు, రహదారి సౌకర్యాలు ఉన్నాయి.

By Venkatakarunasri

తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఏకైక నగరము మరియు ఆంధ్ర ప్రదేశ్లో 4 వ అతిపెద్ధ నగరం .తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి నగరానికి విమాన, రైలు, రహదారి సౌకర్యాలు ఉన్నాయి. ఈ నగరం విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550 కి.మీ, బెంగళూరుకు 256 కి.మీ., చెన్నైకు 140 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా 'తిరు', 'పతి' అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో 'తిరు' అంటే గౌరవప్రదమైన అనీ, 'పతి' అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం 'గౌరవనీయుడైన పతి' అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు.

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది. అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది.

PC: Matteo

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది.

PC:youtube

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది. తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.

PC: Nenu sai

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

మన తిరుపతికి భూకంపం వచ్చేప్రమాదం వుందని ఐ.ఐ.టి రూర్కే విద్యార్ధులు తెలిపారు. అసలు భూకంపం ఎందుకొస్తుందో ఫస్ట్ తెలుసుకుందాం. మన భూమి 4పొరలుగా ఏర్పడింది.వీటిల్లో లోపలి నుండి ఫస్ట్ ది ఇన్నర్ కోర్ అని, ఔటర్ కోర్ అని, థర్డ్ ది మాంటల్ అని,ఫోర్త్ ది క్రస్ట్ అని పిలుస్తారు.

PC:youtube

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

సింపుల్ గా చెప్పాలంటే మనభూమి 7నుంచి8మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ అనే ఫలకలతో కవర్ అయివుంటుంది.ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానితోఒకటి బౌండరీస్ ఏర్పరుచుకుని వుంటాయి.ముందుగా మనం 4లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా.ఆ లేయర్స్ లో ఏర్పడే ప్రెజర్ వల్ల ఈ టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూవుంటాయి.

PC:youtube

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

ఇవి ఎంతస్లోగా కదులుతాయంటే పర్ ఇయర్ కి 5నుంచి 10సెం.మీ ల లోపలే కదులుతాయి. ఈ కదలికలు రాపిడులు,రుద్దుకోవటం వల్ల భూకంపాలు ఎవరెస్ట్ వంటి పర్వతాలు, అగ్నిపర్వతాలువంటివి ఏర్పడతాయి. అసలు ఈ భూకంపాన్ని మన సైంటిస్ట్ లు తీవ్రతను బట్టి 4జోన్ లుగా విభజించారు.

PC:rajaraman sundaram

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

మన ఆంధ్ర, తెలంగాణ జోన్ 2, జోన్ 3 పరిధిలోకివస్తుంది. భూకంపతీవ్రతను కొలిచే యంత్రాలని సిస్మోగ్రాఫ్ అని, సిస్మో స్కోప్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలువచ్చే ప్రదేశాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు.

PC:youtube

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

దాదాపు 80శాతం భూకంపాలు ఈ ప్రదేశంలోనే సంభవిస్తుంటాయి. కాబట్టి ఈ భూకంపం ఎలా పుడుతుందో తెలుసుకున్నాంకదా. మన తిరుపతికి భూకంపం ఎక్కడ వస్తుంది?ఎలా వస్తుందో తెలుసుకుందాం.

PC: rajaraman sundaram

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

ముందుగా మనం టెక్టానిక్ ప్లేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. తమిళనాడులోని తరంగంబాడి ప్రాంతాలలో టెక్టానిక్ ప్లేట్స్ బౌండరీస్ వున్నాయి. కాబట్టి ఈ ప్లేట్స్ డీకొట్టడం వల్ల భూకంపాలు వస్తాయని,ఒకవేళ అక్కడ భూకంపం సంభవిస్తే 200కిమీల పరిధిలోని స్థావరాలు ధ్వంసంకావచ్చని ఐఐటీ విద్యార్ధులు హెచ్చరించారు.ఈ పరిధిలోకి తిరుపతి, చెన్నైవంటి నగరాలు వస్తాయని వాళ్ళుతెలిపారు.

PC:Simeyrajesh

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

పండుగలు, ఉత్సవాల నగరం

తిరుపతి కేవలం ధార్మిక కేంద్రమే కాదు, గొప్ప సాంస్కృతిక కేంద్రం కూడా. ఇక్కడ జరిగే ఉత్సవాలు, పండుగలకు తిరుపతి ప్రసిద్ది. మే లో జరిగే గంగమ్మ జాతర బాగా ప్రసిద్ది చెందిన పండుగ. అసాధారణమైన వేడుకలకు ఈ పండుగ పెట్టింది పేరు. ఈ పండుగప్పుడు, భక్తులు మారువేషాల్లో గుడి వీధుల్లో తిరిగితే దుష్ట శక్తులనుంచి రక్షణ వుంతునదని నమ్ముతారు.

PC:KiranMattewada

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

ఇలా నడిచాక వాళ్ళు గంధం పూసుకుని, తలకు మల్లెల దండలు చుట్టుకుని గుళ్ళోకి వెళ్తారు. దేవత మట్టి విగ్రహాన్ని పగులగోత్తడంతో జాతర ముగుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు దూరప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. చంద్రగిరి కోట లో నిర్వహించే విజయనగర ఉత్సవం, రాయలసీమ నృత్య, ఆహార పండుగలు ఇక్కడ జరిగే ఇతర ప్రధాన పండుగలు.

PC:Bhaskaranaidu

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

చూడాల్సిన ఆకర్షణలు

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు.

PC:Bharathramvs

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు. చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే. తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది.

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది. చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు.

PC:LOVEofZ

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

వాతావరణం - రవాణా సౌకర్యాలు

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది. ఇక్కడ వేసవి చాలా వేడిగా వుంది అసౌకర్యంగా వుంటుంది కనుక, ఆ సమయంలో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది. వర్షాలు వేసవి నుంచి ఉపశమనం ఇస్తాయి, తేలిక పాటి వర్షాలు తిరుపతి అందాన్ని ఇనుమడింప చేస్తాయి. తిరుపతి ప్రధానంగా గుళ్ళు వుండే నగరం కనుక, చాలా పవిత్రంగా భావించబడుతుంది

PC: Matteo

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

కనుక, యాత్రికులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సంప్రదాయ దుస్తులు ధరించండి, టోపీ, కేప్ లు పెట్టుకోకండి. ఇక్కడి పూలు దేవుడి కైకంకర్యానికే వాడాలి కనుక తలలో పెట్టుకోకండి. మాంసం మద్యం పూర్తీగా దొరకవు, వాడకం నిషేధం కూడా. ఫోన్ లు, కెమెరాలు లాంటి గాడ్జెట్ లు గుడిలోకి అనుమతించబడవు. ధర్మం, సంస్కృతి ప్రేమించే ప్రతి పర్యాటకుడు తప్పక చూసి తీరవలసిన ప్రాంతం తిరుపతి.

PC:రవిచంద్ర

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

సరైన సమయం

సంవత్సరంలో వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో తిరుపతిని సందర్శించడం ఉత్తమం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు తిరుపతి సందర్శనకు అనువైన పరిస్థితులను అందిస్తాయి. అయితే, జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగే ప్రధాన పండుగ బ్రహ్మోత్సవ సమయంలో యాత్రికులు తిరుపతిని సందర్శించడం ఉత్తమం.

PC:Nvvchar

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

 తిరుపతికి భూకంప హెచ్చరిక !

తిరుపతికి భూకంప హెచ్చరిక !

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X