Search
  • Follow NativePlanet
Share
» »హోలీ వేడుకలు ఇండియా లో ఎక్కడ బాగా జరుగుతాయి?

హోలీ వేడుకలు ఇండియా లో ఎక్కడ బాగా జరుగుతాయి?

హోలీ పండుగను మార్చ్ నెలలో ఇండియా లోనే కాదు, విదేశాలలో కూడా అనేక చోట్ల జరుపుకుంటారు. హోలీ వేడుకలు వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో జరుపుతారు. మరి ఈ హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంతో వైభవోపేతంగా ఇండియా లో ఎక్కడ జరుగుతాయి ? అనేది మీకు మా నేటివ్ ప్లానెట్ అందిస్తోంది. హోలీ అనేది హిందువుల ఒక పురాతన పండుగ. చెడు పై మంచి సాధించిన విజయ చిహ్నంగా దీనిని జరుపుతారు. పురాణాల మేరకు శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడిని హోల్లిక అనే రాక్షసి చంపబోగా, ఆ రాక్షసిని వధించి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. ఆ హోలిక రాక్షసి శరీరాన్ని తగుల పెట్టటమే నేటి హోల్లిక దహనంగా చెపుతారు. మరుసటి రోజు హోలీ పండుగ చేసుకుంటారు.

ఈ పండుగ సాధారణంగా వింటర్ సీజన్ పూర్తి అయి పంటల కొత్త సీసన్ లో మొదలులో వస్తుంది. హోలీ గురించిన వివరాలు, అతి పురాతన అంటే 4 వ శతాబ్దంనాటి గ్రంధాలలో, కాళిదాసు రచించినదశ కుమార చరిత మొదలైన వాటిలో కూడా కలవు. వివిధ రంగులు చల్లుకోవటం, రంగుల నీళ్ళను ఒకరిపై మరి ఒకరు చల్లుకోవటం ఈ పండుగ వేడుకలలో ప్రధానమైన అంశం. ఇండియాలో హోలీ బాగా జరిగే ప్రదేశాలు చూద్దాం.

లాట్ మార్ హోలీ - బర్సానా

లాట్ మార్ హోలీ - బర్సానా

ఉత్తర ప్రదేశ్ లోని బర్సానా విలేజ్ లో దీనిని లాట్ మార్ హోలీ అనే పేరుతో జరుపుతారు. ఈ సమయంలో బర్సానా విలేజ్ గ్రామ మహిళలు పొరుగునే కల నంద గావ్ విలేజ్ లోని పురుషులను లాటీ లతో కొడతారు.

లాట్ మార్ హోలీ - బర్సానా

లాట్ మార్ హోలీ - బర్సానా

ఇతిహాసం మేరకు, శ్రీ కృష్ణుడు ఈ గ్రామం సందర్శించి, తన ప్రియురాలు రాధ ను ఆమె స్నేహితులను చిలిపిగా వేధించాడని చెపుతారు. ఈ కారణంగా ఈ గ్రామ మహిళలు ఆనాడు కృష్ణుడి గ్రామం అయిన నందగావ్ లోని పురుషలను కొట్టారని చెపుతారు. మహిళలు కర్రలతో పురుషులను కొట్టబోగా, పురుషులు వాటినుండి తమను రక్షించు కుంటారు.

బాద్షా కి సవారి , రాజస్తాన్

బాద్షా కి సవారి , రాజస్తాన్

రాజస్తాన్ లోని బేవార్ ప్రదేశంలో ఈ రోజున స్వీట్ లు పంచుకుంటారు. మొఘల్ పాలకుడు అక్బర్, తన ఆస్తానంలోని తోదర్ మల్లుడిని ఒక రోజుకు చక్రవర్తిని చేయగా, తోడరమల్ ఆ రోజున తనకు కనపడిన వారందరకు స్వీట్ లు పంచి పెట్టాడని చెపుతూ అదే విధంగా నేటికీ స్వీట్ లు, మనీ పంచుకుంటారు. వేలాది ప్రజలు ఈ ఊరేగింపులో పాల్గొని ఆనందిస్తారు.

Pic Credit: greeno777

జైపూర్ లో హోలీ

జైపూర్ లో హోలీ

జైపూర్ టవున్ లో హోలీ సమయంలో ఒక ఏనుగుల ఉత్సవం జరుపుతారు. ఏనుగులకు అనేక నగలు, రంగుల వస్త్రాలు, రంగులు వేసి అలంకరిస్తారు. హోలీ రోజున వీటిని వీధులలో ఊరేగిస్తారు.

కోరా మార్ హోలీ , రాజస్తాన్

కోరా మార్ హోలీ , రాజస్తాన్

రాజస్తాన్ లోని బర్సానా గ్రామంలో పురుషులు మహిళలపై రంగులు, రంగు నీరు చల్లగా, వారిని ఎదిరించి ధైర్యంగా పోరాడతారు. దీనిని పురుషులు ఇష్టపడతారు.

మథుర

మథుర

శ్రీకృష్ణుడు పుట్టిన మధుర ప్రదేశంలో సుమారు 40 రోజుల పాటు హోలీ వేడుకలు జరుపుతారు. మధుర లోని బృందావనంలో శ్రీ కృష్ణుడు తన బాల్యంలో ఈ ఆటలను ఆడాడని చెపుతారు.

మధుర

మధుర

ఈ ప్రదేశంలోని టెంపుల్ లో శ్రీకృష్ణుడి జన్మాష్టమి మరియు బెక్ బీహారి టెంపుల్ లోని వేడుకలు బాగా జరుగుతాయి.

ఇండియా వెలుపల హోలీ పండుగ వేడుకలు

ఇండియా వెలుపల హోలీ పండుగ వేడుకలు

హోలీ పండుగను ఇండియా లోనే కాదు. సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలలోను, కొన్ని యురోపియన్ దేశాలలోను కల భారతీయులు జరుపుకుంటారు.
అమెరికా లోని కొన్ని యూనివర్సిటీ లు నార్త్ కరోలిన మరియు యూనివర్సిటీ అఫ్ ఉతా వంటివాటిలో విద్యార్ధులు హోలీ వేడుకలను విస్తృతంగా జరుపుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X