Search
  • Follow NativePlanet
Share
» »సమ్మర్ లో నార్త్ ఇండియా టూర్ !

సమ్మర్ లో నార్త్ ఇండియా టూర్ !

వేసవులు వచ్చేసాయి. పిల్లలకు సెలవులు ఇచ్చేసారు. వేసవి వేడి నుండి విముక్తి పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్ళాలి. మరి ఈ సమ్మర్ కు నార్త్ ఇండియా వెళితే ఎలా వుంటుంది ? నార్త్ ఇండియా లో అద్భుతంగా ఆనందించ దాగిన కొన్ని ప్రదేశాలు ఇక్కడ పొందు పరుస్తున్నాము. మీ ప్రియమైన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆనందించండి.

హాట్ సమ్మర్ లో కూల్ ప్రదేశాలు !

 కాశ్మీర్

కాశ్మీర్

మండే ఎండల్లో, మంచు తో నిండిన కాశ్మీర్ కు మించిన ప్లేస్ ఏమి వుంటుంది ? కాశ్మీర్ జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. ఈ ప్రదేశం ఎపుడూ 25 డిగ్రీల ఉష్ణోగ్రతకు మించదు. దేశంలోని అనేక ప్రదేశాల కనే, ఈ ప్రదేశం ఎంతో చల్లగా వుంటుంది.

కేదార్నాథ్

కేదార్నాథ్

ఈ వేసవిలో నార్త్ ఇండియా వెళ్లేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్ మరో మంచి ప్రదేశం. వేసవిలో ఈ ప్రదేశ సగటు ఉష్ణోగ్రత 17 డిగ్రీలకు మించదు. ఇదే సమయంలో మీరు ప్రసిద్ధ కేదార్నాథ్ టెంపుల్ కూడా చూడవచ్చు.

మనాలి

మనాలి

వేసవిలో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి కి వెళ్ళడం ఒక అపురూప అనుభూతి ఇస్తుంది. మీరు చేయాలనుకునే ట్రెక్కింగ్ మరియు సిఘ్త్ సీయింగ్ లకు ఈ సమయం ఆహ్లాదకరంగా వుంటుంది.

శ్రీనగర్

శ్రీనగర్

ఆహ్లాదకర వాతావరణంలో సరసులలో ఒక బోటు విహారం చేయడం ఆనందకరంగా వుంటుంది. కనుక ఇది తప్పక చూడండి. ఇక్కడ ఉష్ణోగ్రత వేసవిలో ఎపుడూ 33 డిగ్రీలకు మించదు. కనుక నార్త్ ఇండియా లో వేసవిలో ఈ ప్రదేశం తప్పక ఆనందించ దగినది.

గంగోత్రి

గంగోత్రి

గంగోత్రి ప్రదేశం ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశి జిల్లా లో కలదు. హిందువుల పుణ్య క్షేత్రం కూడాను. సమ్మర్ అంతా ఇక్కడ ఆహ్లాదకరంగా వుంటుంది.

సిమ్లా

సిమ్లా

సిమ్లా ప్రదేశాన్ని కొంతమంది మంచు ముక్కాలా ఆట కొరకు సందర్సిన్చగా మరి కొందరు ఇక్కడ కల అద్భుత దృశ్యాలను చూసేందు కు వస్తారు. ఉష్ణోగ్రతలు తక్కువగా వుండే ఈ సమయం మీకు ట్రెక్కింగ్ మరియు సైట్ సీయింగ్ లకు మంచి సమయం.

లెహ్

లెహ్

జమ్మూ & కాశ్మీర్ లోని లెహ్ ప్రదేశం వేసవిలో చల్లగా వుంటుంది. ఉష్ణోగ్రతలు 20 - 30 డిగ్రీల మధ్య మారుతూ వుంటాయి. ఈ ప్రదేశం చూసేందుకు వేసవి ఉత్తమ సమయం.

ముస్సూరీ

ముస్సూరీ

వేసవిలో నార్త్ ఇండియా పర్యటనలో ఉత్తరాఖండ్ లోని ముస్సూరీ బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీకు ఎన్నో సైట్ సీఇంగ్ ఎంపికలు కలవు. ఇక్కడ ఉష్నోగ్రత గరిష్టం గా ఎపుడూ 27 డిగ్రీలు మించదు.
Photo Courtesy: Paul Hamilton

కాంగ్రా

కాంగ్రా

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రదేశాన్ని దేవా భూమి అంటారు. దీని గురించి మహాభారతం లో కూడా కలదు. అందమైన ఈ ప్రదేశం లో మీకు ఎన్నో సరస్సులు, టెంపుల్స్, ట్రెక్ మార్గాలు కలవు. వేసవి ఆహ్లాదకరంగా వుంది ట్రెక్కింగ్ కు బాగుంటుంది.

లాన్స్ డౌన్

లాన్స్ డౌన్

ఉత్తరాఖండ్ లో వేసవి లో సందర్శనకు లాన్స్ డౌన్ మరొక మంచి ప్రదేశం. ఇక్కడ మీకు టెంపుల్స్ మరియు ఇతర పర్యాటక ఆకర్షణలు కలవు. బ్రిటిష్ కాలంలో ఇది ఒక స్వాతంత్ర సమారా యోధుల ప్రదేశం. ఇక్కడ కల వార్ మేమోరిఅల్స్ మీకు గత చరిత్ర గుర్తు చేస్తాయి. ఈ ప్రదర్శనకు వేసవి ఉత్తమ సమయం.

మనికారాన్

మనికారాన్

మనికారాన్ ప్రదేశం హిమాచల్ ప్రదేశ లో కలదు. మనికరాన్ ఒక ప్రసిద్ధ హిందూ మరియు సిక్కుల పుణ్య క్షేత్రం. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు 6 నుండి 16 డిగ్రీల మధ్య మారుతూంటాయి. మిగిలిన సమయాలలో మరింత తక్కువగా కూడా వుంటాయి.

ఆల్మోరా

ఆల్మోరా

వేసవులలో నార్త్ ఇండియా సందర్శనలో ఉత్తరాఖండ్ లోని అల్మోర మంచి ప్రదేశం. అద్భుతమైన ఈ హిల్ స్టేషన్ నుండి మీరు హిమాలయ దృశ్యాలు చూడవచ్చు. వేసవులు ఇక్కడ ఆహ్లాదకరంగా వుండి పర్యటనకు అనుకూలంగా వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X