Search
  • Follow NativePlanet
Share
» »చిఖల్ దార లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

చిఖల్ దార లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

By Mohammad

చిఖల్ దార వన్య జంతువుల సంరక్షణాలయానికి పేరుగాంచినది. సముద్ర మట్టానికి 1120 మీటర్ల ఎత్తులో ఉన్న చిఖల్ దార, మహారాష్ట్ర లోని అమరావతి (మన అమరావతి కాదు) జిల్లాలో ఉన్నది. ఈ ప్రాంతంలో చాలా వరకు భూభాగం కాఫీ తోటలతో నిండి ఉంటుంది. చిఖల్ దార అనే ప్రదేశాన్ని మొట్టమొదట క్రీ.శ. 1823 వ సంవత్సరంలో అప్పటి హైదరాబాద్ మిలిటరీ విభాగానికి చెందిన రాబిన్ సన్ అనే కెప్టెన్ కనుగొన్నాడు.

పౌరాణిక కథ

చిఖల్ దార వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఒకటుంది. పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో విరాటనగర్ లో సంవత్సర కాలం నివాసం ఉంటారు. అప్పుడు ఆ రాజ్య రాజైన విరాట రాజు బావమరిది కన్ను ద్రౌపది మీద పడుతుంది. ఆది గమనించిన భీముడు అతన్ని వధించి అతని శరీరాన్ని చిఖల్ దార వద్ద ఉన్న లోయలోకి బలంగా విసిరేస్తాడు. 'చిఖల్' అంటే కీచకుడు అని, 'దార' అంటే లోతైన లోయ అని అర్థం. ఈ ప్రదేశానికి శ్రీ కృష్ణుడు రుక్మిణీ దేవిని కూడా తీసుకువచ్చినట్లు కథనం కూడా ఉంది.

ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్ లో పాండవులు నివసించిన గుహలు !

చిఖల్ దార లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

చిఖల్ దార గురించి వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక వన్య జంతువుల స్వర్గం. ఈ ప్రదేశం నిండా ఆకాశంలో సంచరించే పక్షులు, వివిధ రకాల జంతువులు, వృక్షాలు ఉండి ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నది. చరిత్ర మీద ఆసక్తి కలవారు పురాతన నామాల కోట మరియు గవిల్ ఘర్ కోటలను చూడటం మరిచిపోవద్దు ..! చిఖల్ దార సందర్శనకు అనువైన సమయం శీతాకాలం. ఆ సమయంలో చేసే వినోద విహారాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.

నామాల కోట

నామాల కోట

నామాల కోట వెనక గొప్ప చారిత్రక నేపధ్యమే ఉంది. దీనిని వాతావరణం మొదలైన అంశాల మీద శ్రద్ధ వహించి నిర్మించినారు. నామాల కోట దట్టమైన అడవులు, కొండల మధ్యలో ఉండి సముద్రమట్టానికి 973 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కోట నిర్మాణానికి కారకులు ఏ రాజవంశీయులో ఇప్పటీకీ ప్రశ్నార్థకమే.

చిత్ర కృప : Pralhad sabe

గవిల్ ఘర్, చిఖల్ దార

గవిల్ ఘర్, చిఖల్ దార

గవిల్ ఘర్ కోట చిఖల్ దార ప్రదేశంలో కలదు. దీనిని క్రీ.శ. 12 వ శతాబ్ధంలో గవాలి రాజు నిర్మించినాడు. కోట ప్రవేశంలో గల బారా దర్వాజ్ తప్పక చూడాలి. కోట లోకి ప్రవేశించాలంటే ఈ ప్రధాన ద్వారం గుండా లోనికి వెళ్ళాలి.

చిత్ర కృప : Rajesh Shende

బీర్ లేక్, చిఖల్ దార

బీర్ లేక్, చిఖల్ దార

బీర్ లేక్ అంటే అదేదో అక్కడ మందు దొరికే ఏరియా అనుకోని గ్లాస్ పట్టుకొని పోయేరూ ..! అక్కడ ఏమీ దొరకదు నీళ్ళు తప్ప. ఇదొక మానవ నిర్మిత సరస్సు. ఈ సరస్సును బ్రిటీష్ వారు సుమారు 125 సంవత్సరాల క్రితం అగ్గిరాయితో నిర్మించారు. సరస్సు కు సమీపంలో చూడటానికి ఒక తోట కూడా ఉంది.

చిత్ర కృప : Rajesh Shende

పంచ్ బోల్ పాయింట్, చిఖల్ దార

పంచ్ బోల్ పాయింట్, చిఖల్ దార

పంచ్ బోల్ పాయింట్, బీర్ సరస్సు నుండి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో కలదు. దీని చుట్టుప్రక్కల గల ప్రదేశ అందాలను తిలకించటానికి పర్యాటకులు వస్తుంటారు. దీని చుట్టూ కాఫీ తోటలు, 5 కొండలు కలిసి ఏర్పరచిన అందమైన లోయ కలదు. పంచ్ బోల్ కు ఆ పేరేలా వచ్చిందంటే, మీరు గనక అక్కడికి వెళ్ళి చప్పట్లు కొడితే, 5 సార్లు ప్రతిధ్యనిస్తుంది.

చిత్ర కృప : Manoj Yadav

మ్యూజియంలు, చిఖల్ ధార

మ్యూజియంలు, చిఖల్ ధార

చిఖల్ దార లో రెండు ప్రధాన మ్యూజియంలు కలవు. అక్కడ వివిధ రకాల జంతువుల, వృక్షజాతుల నమూనాలు పర్యాటకులు చూచేందుకు లభ్యంగా కలవు. అరుదైన, అంతరించిపోతున్న శిలాజాలాలను కూడా చూడవచ్చు. సమీపంలో యోగా ట్రైనింగ్ సెంటర్ కూడా కలదు.

చిత్ర కృప : Kaushik Narasimhan

భీమ్ కుండ్ - కీచక దార, చిఖల్ దార

భీమ్ కుండ్ - కీచక దార, చిఖల్ దార

భీమ్ కుండ్ - కీచక్ దార ప్రదేశం మతపరంగా ప్రాధాన్యత కలిగి ఉంది. అల్లాడో గ్రామానికి సమీపంలోని భీమ్ కుండ్ సుమారు 3,500 అడుగుల లోతు కలిగి ఉంటుంది. ఇతిహాసం మేరకు పాండవులలో ఒకడైన భీముడు ఇక్కడే కీచకుడిని చంపి శరీరాన్ని ఇక్కడి లోయలోకి పడవేశాడని చెపుతారు. ఆ కారణంగానే ఈ భీమ్ కుండ్ ఏర్పడింది.

చిత్ర కృప : Kumar Chitrang

బకదారి మరియు కలాల్ కుండ్, చిఖల్ దార

బకదారి మరియు కలాల్ కుండ్, చిఖల్ దార

భీమ్ కుండ్ ప్రదేశానికి కాస్త సమీపంలో రెండు గంభీరమైన జలపాతాలు ఉన్నాయి. వాటి పేర్లు బకదారి మరియు కలాల్ కుండ్. వీటిని చూడాలనుకొనే వారు లోయలో ప్రవహించే ఆద్ నంది నుండి (5 కి.మీ.) కూడా చూడవచ్చు. కలాల్ కుండ్ జలపాతం చూడటానికి కిలోమీటర్ ఎత్తు నుండి పడుతున్నట్లు అనిపించినా బకదారి జలపాతం మామూలు జలపాతం వలె అనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడి దృశ్యాలు రమణీయంగా ఉండి పర్యాటకులను ఆనందింపజేస్తాయి.

చిత్ర కృప : Rajesh Shende

టైగర్ రిజర్వ్ ప్రాంతాలు

టైగర్ రిజర్వ్ ప్రాంతాలు

చిఖల్ దార వన్య జంతువుల కు ఆవాసంగా ఉన్నది. ఈ ప్రదేశం నిండా వివిధ రకాల పక్షులు, జంతువులు, వివిధ రకాల వృక్షాలు వుండి ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : sameers_sawant12

చిఖల్ దార శాంక్చురీ

చిఖల్ దార శాంక్చురీ

చిఖల్ దార శాంక్చురీ లో ఫ్లయింగ్ స్క్విరల్, మౌజ్ జింక, పందికొక్కు, లంగూర్, చౌసింగా, నీలం ఎద్దు, ఇండియన్ బైసన్, అడవి కుక్క, చిరుత, అడవి పంది, మొరిగే జింక, ఎలుగుబంటి మరియు పులి వంటి జంతువులు అనేకం కలవు. వృక్షాలలో టేకు మరియు బాంబూ మహువా, ధఓడా, కుసుం చెట్లు అనేకం కలవు.

చిత్ర కృప : Dr Kallol Banerjee

అదనపు ఆకర్షణలు

అదనపు ఆకర్షణలు

చిఖల్ దార యొక్క ఇతర ఆకర్షణ ప్రదేశాలు దేవి పాయింట్, ప్రాస్పెక్ట్ పాయింట్ మరియు హరికేన్ పాయింట్. ఈ పాయింట్ ల నుండి కూడా ప్రదేశ అందాల్ని ప్రత్యెక్షంగా వీక్షించవచ్చు.

చిత్ర కృప : sameers_sawant12

చిఖల్ దార ఎలా చేరుకోవాలంటే ..

చిఖల్ దార ఎలా చేరుకోవాలంటే ..

చిఖల్ దార కు వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాయు మార్గం

చిఖల్ దార కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకోలా విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి చిఖల్ దార చేరుకోవడానికి అనేక క్యాబ్ లు కలవు. ధర సాధారణంగానే ఉంటుంది.

రైలు మార్గం

చిఖల్ దార కు సమీప రైల్వే స్టేషన్ 110 కి. మీ. దూరంలో బద్ నేరా స్టేషన్. దేశంలోని అన్ని ప్రధాన నగరాల, పట్టణాల నుండి బద్ నేరా కు రైళ్లు నడుస్తుంటాయి. అక్కడి నుండి ట్యాక్సీ అద్దెకు తీసుకొని చిఖల్ దార చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

మహారాష్ట్ర లోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చిఖల్ దార కు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుస్తుంటాయి. సమీప పట్టాణాలైన అమరావతి, ఖాండ్వా , వార్ధ మొదలైన ప్రదేశాల నుండి బస్సులు, ప్రవేట్ వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Rajesh Shende

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X