Search
  • Follow NativePlanet
Share
» »చూపు తిప్పుకొని హిల్ స్టేషన్ ... ఖండాలా !

చూపు తిప్పుకొని హిల్ స్టేషన్ ... ఖండాలా !

By Mohammad

కనుచూపు మేర పచ్చదనం తప్ప ఇంకేమీ కనిపించని అద్భుత ప్రదేశం ఖండాలా. ఇది భారతదేశంలోని అద్భుత హిల్ స్టేషన్లలో ఒకటి. చుట్టూ సహ్యాద్రి పర్వతాలు, ఎత్తైన కొండలతో, కళ్ళుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సోయగాలతో ' ఖండాలా' పర్యాటకుల మనసు దోచేసుకుంటుంది. ముంబై నుండి 101 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 625 మీటర్ల ఎత్తులో ఉన్న ఖండాలాలో ట్రెక్కింగ్ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తిని కనబరుస్తుంటారు.

ప్రకృతి ప్రేమికులకు, కొత్త జంటలకు, యవ్వన వయస్కులకు స్వర్గధామంలా అనిపించే ఈ ప్రాంతం అద్భుత అందాలకు మచ్చుతునకగా ఉంది. గతంలో ఖండాలా ఛత్రపతి శివాజీ ఏలుబడిలో భాగంగా ఉండేది. ఇక్కడ సందర్శించవలసిన అద్భుత సైట్ సీఇంగ్ ప్రదేశాలను ఒకసారి గమనిస్తే ...!

భుషి సరస్సు

భుషి సరస్సు

ప్రకృతిసౌందర్య ప్రేమికులు తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం భుషి సరస్సు. దీని నిర్మలమైన ప్రశాంత పరిసరాలు, స్వచ్చమైన నీరు పర్యాటకుల విశ్రాంతికి అనువైన అనేక అవకాశాలను కల్గిస్తాయి. ఉపశమనం కల్గించే చిరస్మరణీయ అనుభవం కొరకు తుగాలి లేక్, లోనవాల లేక్, వాల్వన్ డాం లను తప్పకుండ చూడండి.

చిత్ర కృప : Shmilyshy

కునే ఫాల్స్

కునే ఫాల్స్

ఖండాలా లోని కునే ఫాల్స్ ఒక ప్రధాన ఆకర్షణ. 100 కిలోమీటర్ల ఎత్తు నుండి పడే గంభీరమైన కునే జలపాతం చూడడం ఏ ఒక్కరు మర్చిపోకూడదు. లోనవల ఖండాలా మధ్యలో గల ఈ జలపాతంలో పర్యాటకులను జలకాలాటలకు అనుమతిస్తారు.రివర్సింగ్ స్టేషన్ రివర్సింగ్ స్టేషన్ ఖండాలా లోని ఒక అద్భుతమైన ప్రాంతం.

చిత్ర కృప : Alosh Bennett

కర్ల, భజ గుహలు

కర్ల, భజ గుహలు

పర్వతకేంద్రం నుండి కేవలం 16 కిలోమీటర్ల దూరం లో కర్ల - భజ గుహలు ఖండాలాలో గల అనేక యాత్ర విశేషాల్లో ఒకటి. ఇక్కడి అపారమైన పురాతనసౌందర్యం క్రీ.పూ. 2 శతాబ్దం నాటిది. ఇవి బౌద్ధ హీనయాన శాఖ కు చెందిన పురాతన బౌద్ధరాతి గుహాలయాలకు శ్రేష్ఠమైన ఉదాహరణలు.

చిత్ర కృప : Dinesh Valke

లోహఘడ్ ఫోర్ట్

లోహఘడ్ ఫోర్ట్

లోహఘడ్ అంటే లోహపు కోట అని అర్ధం వచ్చే ఈ కోట లోనావాలా లోని సహ్యాద్రి శ్రేణుల్లో వుంది. 1050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో వున్న ఈ కోటను ఛత్రపతి శివాజీ మహారాజు విస్తృతంగా ఉపయోగించాడు. మీకు శిల్ప కళ, చరిత్ర, పురావస్తు రంగాల్లో ఆసక్తి వుంటే, ఈ ప్రదేశాన్ని వదులుకోకండి.

చిత్ర కృప : vivek Joshi

రై ఉడ్

రై ఉడ్

పెద్ద పెద్ద, పొడవైన చెట్లతో నిండిన పెద్ద అందమైన తోట రై ఉడ్. ఒక ఇంగ్లీష్ అధికారి మిస్టర్ రై పేరున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని కొంత మంది భావన. దశాబ్దాల వయస్సు కల్గిన అనేక వృక్షాలు ఈ పార్క్ లో ఉన్నాయి. పిల్లల ఆటల స్థలాలు, పురాతన దేవాలయం చూడదగ్గవి. శివాజీ పార్క్ కూడా చూడదగ్గది.

చిత్ర కృప : Velvett Country Khandala

టైగర్స్ లీప్

టైగర్స్ లీప్

ఖండాలా లోని మైమరిపించే ప్రాంతం ది టైగర్స్ లీప్. ఖండాలా లోని అనేక ఆకర్షణీయ ప్రాంతాలలో ఒకటైన ఈ లోయను జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక పులి లోయ మీదకు దూకుతున్నట్లుగా అనిపించడమే ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం.

చిత్ర కృప : Kothariutkarsh88

అమృతాంజన్ పాయింట్

అమృతాంజన్ పాయింట్

ఖండలఘాట్ ప్రారంభoలో మొదటి వాలులోని అంచున గల అమృతాంజన్ పాయింట్ మరొక చూదగిన ప్రదేశం. ఇక్కడ నుండి దగ్గరలోని ఉత్కంఠభరిత దృశ్యాలను చూడవచ్చు. ఈ పాయింట్ నుండి లోయలోని అందమైన దృశ్యాలు, డ్యూక్స్ నోస్ దృశ్యాలను చూడవచ్చు.

చిత్ర కృప : Alewis2388

మంకీ హిల్

మంకీ హిల్

ఖండాలా లోని మంకి హిల్ స్థానిక పర్యాటకులకు అభిమాన యాత్ర స్థలము. ఖపోలి పట్టణానికి పైన రైల్వే ట్రాక్స్ కు ఉత్తరాన గల పెద్ద చదునైన ఈ ప్రాంతానికి ఖోపోలి నుండి లేదా బోర్ఘాట్ రివర్సింగ్ స్టేషన్ నుండి గాని చేరవచ్చు.

చిత్ర కృప : Ashish Gupta

మౌంటెన్ ట్రెక్కింగ్

మౌంటెన్ ట్రెక్కింగ్

రాళ్ళను ఎక్కే సాహాసాన్ని చేయదలుచుకుంటే మీరు ఖండాలా లో ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. డ్యూక్స్ నోస్ పీక్, కర్ల కొండలు ఎక్కి డ్యూక్ నోస్ పై నుండి విశాలమైన గ్రామ ప్రాంతాలకు చెందిన మైమరపించే అందాలను చూడవచ్చు.

చిత్ర కృప : Alosh Bennett

ఖండాలా ఎలా చేరుకొవాలి?

ఖండాలా ఎలా చేరుకొవాలి?

వాయు మార్గం : 66 కిలోమీటర్ల దూరంలో పూణే విమానాశ్రయం, 110 కి. మీ ల దూరంలో ముంబై విమానాశ్రయం కలదు.
రైలు మార్గం : ఖండాలా కు సమీపాన లోనావాలా రైల్వే స్టేషన్ కలదు.
రోడ్డు మార్గం : ముంబై, పూణే ల అనునది ఖండాలా కు ప్రతిరోజూ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Chaitanyagymnast2009

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X