Search
  • Follow NativePlanet
Share
» »తాడిపత్రి - అత్యద్భుతమైన దేవాలయాలు !!

తాడిపత్రి - అత్యద్భుతమైన దేవాలయాలు !!

పూర్వం తాడిపత్రి ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని, తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు.

By Mohammad

తాడిపత్రి అనంతపురం జిల్లాకు చెందిన ముఖ్య పట్టణం. పెన్నానది ఒడ్డున ఉన్నతాడిపత్రి దాని అత్యద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్ధి. క్రీ.శ. 16 వశతాబ్ధంలో నాయక రాజులచే నిర్మింపబడిన దేవాలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. వీటిని తాడిపత్రిని సందర్శించే ప్రతి పర్యాటకుడు దర్శించవలసిందే !!

మద్యం మాన్పించే ఉంతకల్లు పాండురంగ స్వామి !

తాడిపత్రి చరిత్రలోకి వెళితే ...

విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతము, విజయనగర సామ్రాజ్యములో అంతర్భాగము. మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది. దీనికి వేదకాలంలో 'భాస్కర క్షేత్రము' అనే పేరు కూడావుంది.

ఆ పేరెలా వచ్చింది ??

ఆ పేరెలా వచ్చింది ??

పూర్వం ఈ ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని, తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు.

చిత్రకృప : Sashank.bhogu

విద్యారణ్యస్వామి

విద్యారణ్యస్వామి

క్రీ.శ. 1350 ప్రాంతములోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు అను బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశముతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఈప్రాంతమును అభివ్ళద్ది గావించెను.

చిత్రకృప : Sashank.bhogu

ప్రసిద్ధి గాంచినవి

ప్రసిద్ధి గాంచినవి

తాడిపత్రిలో శ్రీబుగ్గరామలింగేశ్వరాలయం, శ్రీ చింతలవెంకటరమణస్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచిన ఆలయాలు. క్రీ.శ. 1460-1525 మధ్యలో ఇవి నిర్మించబడ్డాయి.

చిత్రకృప : Sashank.bhogu

శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం

శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం

బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయడు నిర్మించాడు.

చిత్రకృప : Sashank.bhogu

శ్రీ చింతలవెంకటరమణస్వామి ఆలయం

శ్రీ చింతలవెంకటరమణస్వామి ఆలయం

చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడైన తిమ్మానాయనిచే నిర్మాణమైనట్లు చరిత్రకారుల అధ్యయనం ద్వారా తెలుస్తున్నది.

చిత్రకృప : Chittichanu

శిల్ప సంపద

శిల్ప సంపద

శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం, శ్రీ చింతలవెంకటరమణస్వామి దేవాలయాలు అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ చూపరులకు నయనానందాన్ని కలిగిస్తూ భక్తులను భక్తి పారవశ్యములో ముంచివేస్తూ వుంటాయి.

చిత్రకృప : Sashank.bhogu

తాడిపత్రిలో గల ఇతర దేవాలయాలు

తాడిపత్రిలో గల ఇతర దేవాలయాలు

పై రెండు ఆలయాలే గాక శ్రీ వాసవి కన్యక పరమెశ్వరి అమ్మవారి ఆలయము, శ్రీ కోన రంగనాధ స్వామి అళ్వారుల ఆలయం, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము, శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయము, రాఘవేంద్రస్వామి ఆలయము, సాయి బాబా ఆలయము కూడా తాడిపత్రిలో గలవు. ఇక్కడికి సమీపంలో ఆలూరుకోనలో పురాతన ప్రాశస్తి కలిగిన రంగనాధ ఆలయం, ఓబుళేసు కోన ఆలయాలు గలవు.

చిత్రకృప : Dr Murali Mohan Gurram

బెలుం గుహలు

బెలుం గుహలు

తాడిపత్రి సమీపంలో చూడవలసిన పర్యాటక ప్రదేశం బెలుం గుహలు. బెలుం గుహలు తాడిపత్రి కి కేవలం 30 KM ల దూరంలో ఉన్నాయి. తాడిపత్రి - బనగానపల్లె ప్రధాన రోడ్డు మార్గంలో ఇవి కనిపిస్తాయి. తాడిపత్రి కి 10 కి.మీ. దూరంలో హాజీవలీ దర్గా, 15 కి. మీ. దూరంలో పప్పూరు గ్రామంలో శ్రీ అశ్వర్ద నారాయణ స్వామి, భీమలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందాయి.

బెలుం గుహల సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Mahesh Telkar

పరిశ్రమలు

పరిశ్రమలు

తాడిపత్రి కేవలం ఆలయాకే ప్రసిద్ధి అనుకుంటే పొరబడినట్లే. వందల సంఖ్యలో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు, పాలిష్ బండల ఫ్యాక్టరీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు ఇలా అనేకం ఉన్నాయి. పేరెన్నిక గల పెన్నా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు గలవు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా అనేకము ఉన్నాయి.

చిత్రకృప : penna cement plant

వసతి

వసతి

తాడిపత్రి ఒక పట్టణం కనుక వసతి సౌకర్యాలు పర్యాటకులకు తగిన విధంగా ఉంటాయి. హోటళ్ళు, లాడ్జీలు, డార్మిటరీలు మొదలైన వాటిలో గదులు దొరుకుతాయి.

చిత్రకృప : Rybread

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : పుట్టపర్తి(113 KM) , కడప (106 KM), బెంగళూరు(218 KM), హైదారాబాద్ (367 KM) , రేణిగుంట (238 KM).

రైలు మార్గం : తాడిపత్రి లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గోవా, గుంతకల్, కడప తదితర ప్రాంతాల నుండి స్టేషన్ మీదుగా అనేక ఎక్స్ ప్రెస్ రైళ్ళు వెళుతుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం : అనంతపురం, బెంగళూరు, తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు వస్తుంటాయి.

చిత్రకృప : Sashank.bhogu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X