Search
  • Follow NativePlanet
Share
» »గాంగ్ టక్ లో సందర్శించదగిన ప్రసిద్ధ ప్రదేశాలు

గాంగ్ టక్ లో సందర్శించదగిన ప్రసిద్ధ ప్రదేశాలు

సిక్కిం రాష్ట్ర రాజధాని అయిన గాంగ్ టక్ సందర్శించదగిన ప్రముఖ ప్రదేశాలలో ప్రధానమైనది. ఇక్కడ చూడదగిన కొన్ని ముఖ్య స్థలాల గురించిన వివరణలు ఇవ్వబడినది!

By Venkata Karunasri Nalluru

గాంగ్ టక్ ఈశాన్య భారతదేశంలో గల చాలా అందమైన నగరాలలో ఒకటి. సిక్కింలో గల గాంగ్ టక్ లో మంచుతో కప్పబడిన శిఖరాలు, నదులు మరియు పచ్చని లోయలు మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకెళుతుంది. ఈ స్థలం హిమాలయ ప్రాంతంలో ఒక గొప్ప ట్రెక్కింగ్ ప్రదేశంగా ఉంది.

గాంగ్ టక్ నగరం సంస్కృతి మరియు వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో గల బౌద్ధమత ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటిగా ఉన్నది. ఈ ప్రదేశం ఈశాన్య భారతదేశంలో అత్యంత సందర్శించదగిన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. ఇప్పుడు మనం గాంగ్ టక్ లో చూడదగిన కొన్ని ఉత్తమ స్థలాల గూర్చి తెలుసుకుందాం!

places to visit in gangtok

PC: Indrajit Das

బాబా హర్భజన్ సింగ్ మెమోరియల్ ఆలయం:

బాబా హర్భజన్ సింగ్ మెమోరియల్ ఆలయం జెలేప్ల మార్గము మరియు నాతుల మార్గముల మధ్య ఉన్న ప్రాంతంలో గల ప్రసిద్ధ తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. ఈ దేవస్థానం నిర్మాణం జరిగినప్పటి నుండి దీని నిర్వహణ మొత్తం భారత సైన్యం చూసుకొనుచున్నది. దీనిని హర్భజన్ సింగ్ కు అంకితం చేశారు. ఇతను 1962 లో ఇండో-చైనా యుద్ధంలో ఒక సిపాయి. 23 రెజిమెంట్ యుద్ధ సమయంలో ఇతను తప్పిపోయినాడు. ఆ తరువాత చనిపోయాడని తెలిసింది. ఇతని విగ్రహానికి కోరిన కోరికలను నెరవేర్చగలిగే శక్తులు ఉన్నాయని ఇక్కడి నమ్మకం.

డూ డ్రల్ కొర్టేన్ అనేది గాంగ్ టక్ లో ఒక స్థూపం. 1945 లో టిబెటన్ బుద్ధిజం యొక్క నైన్మ సంస్థ అధిపతిగా వున్న త్రుల్ షిక్ రింపోచే నిర్మించబడింది. ఇక్కడ గల ఒక భారీ స్థూపం చుట్టూతా 108 ప్రార్థన చక్రాలు వున్నాయి. వీటిని మణి లహ్కోర్ అని పిలుస్తారు. ఇక్కడ అనేక పవిత్ర పుస్తకాలు మరియు ఇతర మత విశేషాలను కనుగొనవచ్చును. ఈ స్థూపం దగ్గర చెడు ఆత్మలు దూరంగా వెళ్ళిపోతాయని నమ్ముతారు.

places to visit in gangtok

PC: Kothanda Srinivasan

ఎంచెయ్ మొనాస్టరీ:

సిక్కింలోని ఎంచెయ్ మొనాస్టరీ అత్యంత ప్రాచుర్యం పొందిన మఠాలలో ఒకటి. ఇది గాంగ్ టక్ లో గల ఒక కొండ శిఖరం పైన నిర్మించబడింది. ఈ మఠంలో ఒక తాంత్రిక మాస్టర్ అయిన గాలిలో ఎగిరే శక్తి గల డ్రుప్టోబ్ కార్పో అనే సన్యాసి ఉపదేశించినట్లు నమ్ముతారు. అతను ఆశ్రమంలో నివశించాడని మరియు ఇక్కడే సమాధి చెందాడని చెబుతారు.

ఇక్కడ బుద్ధ, గురు పద్మసంభవ మరియు లోకి షరియా అనే మూడు దేవతలను పూజిస్తారు.

places to visit in gangtok

PC: PP Yoonus

తీస్తా నది:

తీస్తా నది సిక్కింలో గల అనేక ప్రదేశాల గుండా ప్రవహించే నది. ఇక్కడ సిక్కింలో వైట్ వాటర్ రాఫ్టింగ్ సందర్శించదగినది. గాంగ్ టక్ సమీపంలో గల అనేక పట్టణాలు, పర్యాటకులకు మెల్లి ఆఫర్ గ్రూప్ వంటివి వాటర్ రాఫ్టింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇది ప్రకృతి మరియు సాహస ప్రియులకు ఒక గొప్ప ప్రదేశం.

గాంగ్ టక్ ఎలా చేరాలి?

గాంగ్ టక్ కు రోడ్డు, రైలు మరియు వాయు మార్గాల ద్వారా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి చేరుకోవచ్చు.

మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X