Search
  • Follow NativePlanet
Share
» »నరకంద - హరిత వనాల అద్భుతం!!

నరకంద - హరిత వనాల అద్భుతం!!

హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా, మానాలి, డల్హౌసీ వంటి పేర్లు మీకు తెలిసి ఉండవచ్చు. కానీ మీకు చెప్పబోయే ప్రదేశం మంచు క్రీడలకు ప్రసిద్ది చెందినది. ఇక్కడ ప్రతి సంవత్సరం మంచు క్రీడలు నిర్వహిస్తారు. ఇంతకు ఆ ప్రదేశ ఏమిటో తెలుసా?? నరకంద. నరకంద హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక అందమైన పర్యాటక కేంద్రం. మంచుతో కప్పబడిన మహోన్నత హిమాలయ పర్వత శ్రేణులు మరియు పర్వతదాల వద్ద ఉన్న హరిత వనాల యొక్క అద్భుత వీక్షణను నరకంద మనకందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడున్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా వీక్షిద్దాం పదండి.

ఫ్ర్రీ కూపన్లు : ఏర్ ఇండియా నుండి విద్యార్థులకు ప్రత్యేకమైన ఛార్జీలు

హాటు శిఖరం

హాటు శిఖరం

ముందుగా ఇక్కడున్న ప్రదేశాలలో ప్రధానంగా చూడవలసినది హాటు శిఖరం. హాటు శిఖరం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నరకంద పట్టణం లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 3300 మీటర్ల ఎత్తుతో, పట్టణం లోనే అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉన్న ఈ శిఖరం, హిమాలయ శ్రేణి, దాని మంచు పర్వతాలు, దట్టమైన దేవదారు అడవులు, ఆపిల్ తోటలు మరియు ఆకుపచ్చ వరి పొలాల విహంగ వీక్షణం అందిస్తుంది. నరకంద నుండి కేవలం 8 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ శిఖరం చేరడానికి హైకింగ్ ... ఏకైక మార్గం. శిఖరం మీద, సందర్శకులు విశ్రాంతి పొంది, సేదతీరే చోటు అందించే పి.డబల్యు.డి అతిథి గృహం మరియు ఒక చెరువు ఉన్నాయి.

Photo Courtesy : Kondephy

జలోరి కనుమ

జలోరి కనుమ

సముద్ర మట్టానికి 3550 మీటర్ల ఎత్తులో ఉన్న జలోరి కనుమ, హిమాచల్ ప్రదేశ్ లోని నరకంద వద్ద ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. నరకంద నుండి 90 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ కనుమను చేరటానికి, సందర్శకులు, సట్లెజ్ లోయ ద్వారా, కులు లోయ యొక్క లూరి,అని మరియు ఖనగ్ ల అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తారు. కనుమకు సమీపంలో, పచ్చ పచ్చని అడవుల నడుమ ఉన్న సరోల్సర్ సరస్సు, 30 నిమిషాల తేలిక నడకతో చేరుకోవచ్చు. ఈ కనుమ, కులు లోయను రాంపూర్, సిమ్లా మరియు కిన్నార్ లతో కలుపుతుంది. సందర్శకులు, రాష్ట్రంలోనే ఉత్తమ పర్వత బైకింగ్ అనుభవాన్ని అందించే కనుమ ద్వారా సిమ్లా నుండి మనాలి ప్రయాణించవచ్చు.

Photo Courtesy: Samrat Gupta

కొత్గఢ్ మరియు తానేదార్

కొత్గఢ్ మరియు తానేదార్

నరకంద నుండి 17 కి.మీ.ల దూరంలో, సముద్ర మట్టం కి 1830 మీటర్ల ఎత్తులో ఉన్న కొత్గఢ్ మరియు తానేదార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని రెండు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు.సట్లెజ్ నది ఎడమ తీరంలో ఉన్న కొత్గఢ్, గుర్రపు డెక్క ఆకారపు పురాతన లోయకై ప్రసిద్ధి చెందగా, తానేదార్ ఆపిల్ తోటలకు పేరుగాంచింది. ఈ రెండు ప్రదేశాలను, భారీ ఆపిల్ తోటలు మరియు పండ్లతోటల వల్ల, నరకంద యొక్క అత్యంత పచ్చని లోయలుగా భావిస్తారు. రసిద్ధ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్, తన 'లిస్పెత్' అనే కథానిక లో కొత్గఢ్ ని , "ఉత్తర కొండల దొరసాని" గా అభివర్ణించాడు. సందర్శకులు కొత్గఢ్ లోయ నుండి, కులు లోయ మరియు మహోన్నత హిమాలయాల మంచు పర్వతాల యొక్క అద్భుతమైన దృశ్యాలు చూడగలరు.

Photo Courtesy: Madhu Nair

స్కీయింగ్

స్కీయింగ్

స్కీయింగ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మంచుతో కూడిన వాలు ప్రాంతాలు గల నరకంద యొక్క పర్యాటకులలో ప్రాచుర్యం పొందిన శీతాకాలపు సాహస క్రీడ. నరకంద లో వివిధ కష్ట స్థాయిల వాలు ప్రాంతాలు ఉండటం వల్ల, ఆరంభకులకు మరియు అనుభవజ్ఞులైన స్కీయర్లకు కూడా తగిన వినోదం అందిస్తుంది. నరకంద యొక్క మంచుతో కప్పబడిన పర్వతం, సిమ్లా మరియు రాంపూర్ మధ్య విభజన స్థానంగా ఉంది.

Photo Courtesy: urmimala singh

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్ నరకందలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహస క్రీడలలో ఒకటి. హాటు శిఖరం మరియు నరకంద ను చక్కగా అనుసంధానించే ట్రెక్కింగ్ మార్గం, సందర్శకులలో ప్రసిద్ధి చెందింది. ట్రెక్కింగ్ మార్గాల చుట్టూ ఉన్న దేవదారు, సిందూర, ఫర్, పైన్, రోడోడెండ్రాన్, సిల్ మరియు స్ప్రూస్ చెట్ల తో కూడిన అడవులు, సహజ దృశ్యాన్ని సుసంపన్నం చేస్తాయి. యాత్రికులు, ప్రకృతి మధ్య నెలకొని ఉన్న జో బాగ్ పచ్చిక బయళ్ళ పై శిబిర నివాసం (క్యాంపు) ఏర్పాటు చేసుకుని సేదతీరవచ్చు.

Photo Courtesy: Self Drive Trips

మహామాయ ఆలయం

మహామాయ ఆలయం

సమయం మరియు మార్పు యొక్క హిందూ దేవత కాళి కి అంకితం చేయబడిన మహామాయ ఆలయం, హిమాచల్ ప్రదేశ్ లోని కచేరీ యొక్క ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. రాజభవనం లోపల సుందర్ నగర్ రాజు నిర్మించిన దీని నిర్మాణ శైలి కోటను పోలి ఉంటుంది. సముద్ర మట్టానికి 1810 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం యొక్క ప్రవేశ ద్వారం వెండి, కలప మరియు స్ఫట (అల్యూమినియం) పలకలు మొదలైన పదార్థాలతో తయారు చేయబడింది. ఆలయం యొక్క స్థానం, దీనిని ధ్యానం మరియు విశ్రాంతి కోసం సరైనదిగా చేస్తుంది.

Photo Courtesy: himachal.gov.co.in

స్టోక్స్ ఫారం

స్టోక్స్ ఫారం

స్టోక్స్ ఫారం, హిమాచల్ ప్రదేశ్ లో తానేదార్ వద్ద నరకంద చేరువలో ఉన్న ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ వ్యవసాయ భూమి, రుచికరమైన ఆపిళ్ళు విక్రయానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందినది. విస్తారమైన ప్రాంతంలో విస్తరించివున్న, ఈ వ్యవసాయ భూమిలో, సందర్శకులకు తాజా మరియు ఆకుపచ్చ వాతావరణం అందించే అనేక ఆపిల్ తోటలు ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రం వల్ల ప్రభావితం చెంది శామ్యూల్ స్టోక్స్ అనే అమెరికా జాతీయుడు 1904 లో భారతదేశం వచ్చి ఈ సేద్యం ప్రారంభించాడు.

Photo Courtesy: rawnak

నరకంద ఎలా వెళ్ళాలి??

నరకంద ఎలా వెళ్ళాలి??

వాయు మార్గం

నరకందకు సమీపాన జుబ్బార్ హట్టి దేశీయ విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం నుంచి నరకంద సుమారుగా 155 కి. మీ .దూరంలో ఉంది. సిమ్లా కూడా నరకందకు సమీపాన ఉన్న మరొక విమానాశ్రయం.

రైలు మార్గం

టాయ్ ట్రేన్స్ అని రైళ్లు ఉంటాయి. ఇవి సిమ్లా - కల్కా మధ్యలో నడుస్తాయి. ఈ రెండు ప్రాంతాల మధ్యలోనే నరకంద అనే ప్రాంతం ఉంది. కనుక మీరు ఈ విధంగా కూడా నరకంద చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

నరకంద ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 22 వెళుతుంది. కనుక బస్సు సౌకర్యంతో పాటుగా ప్రైవేట్ సౌకర్యాలు బాగానే ఉంటాయి.

Photo Courtesy: himachal.gov.co.in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X