Search
  • Follow NativePlanet
Share
» »అద్భుతమైన కళాకృతులు - పట్టడక్కాల్

అద్భుతమైన కళాకృతులు - పట్టడక్కాల్

పట్టడకాల్ దేవాలయాలలో అద్భుతమైన ఉత్తర మరియు దక్షిణ భారత దేశ ప్రాంతాల శిల్ప కళా శైలి గోచరిస్తుంది. ఈ రెండు శైలుల కలయికే విరూపాక్ష దేవాలయం.

By Venkatakarunasri

పట్టడకాల్ దేవాలయాలలో అద్భుతమైన ఉత్తర మరియు దక్షిణ భారత దేశ ప్రాంతాల శిల్ప కళా శైలి గోచరిస్తుంది. ఈ రెండు శైలుల కలయికే విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయాన్ని క్రీ. శ. 740 సంవత్సరంలో రాణి లకుమాదేవి నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. పల్లవ రాజులపై తన భర్త రెండవ విక్రమాదిత్యుడి ఘన విజయానికిగాను ఆమె ఈ దేవాలయం నిర్మించింది.

ఒకప్పుడు ఈ పట్టణంలో రాజులు నివసించేవారు. ఈ పట్టణం తొమ్మిది హిందూ దేవాలయాలకు, ఒక జైన మందిరానికి ప్రసిద్ధి. వీటిని చాళుక్య రాజులు క్రీ. శ. 7వ మరియు క్రీ. శ. 8వ శతాబ్దాలలో నిర్మించారు. ఈ దేవాలయాల శిల్పకళా వైభవం అద్భుతంగా ఉండి, ఈ ప్రదేశం అంతా కూడా ప్రపంచ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించింది.

పట్టడకాల్ కు ఒక్కసారి ప్రయాణం చేస్తేచాలు, దక్షిణ భారత దేశంలో చాళుక్యుల పాలనా కాలంనాటి వైభవం చూసినవారం అవుతాము. పట్టడకాల్ అంటే అర్ధం 'కెంపుల కిరీట నగరం' అని చెపుతారు. చాళుక్యుల పాలనాకాలంలో ఈ నగరం వైభవంతో తులతూగేది. పట్టడకాల్ పట్టణం మాలప్రభ నది పై బాగల్ కోట జిల్లాలో ఉంది.

గల్గనాధ దేవాలయం, పట్టడక్కాల్

గల్గనాధ దేవాలయం, పట్టడక్కాల్

గల్గనాధ దేవాలయం క్రీ. శ. 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం ఆవరణలో ప్రవేశించిన భక్తులు సుఖానస మరియు నవరంగ, మరియు ఒక శివలింగాన్ని చూడవచ్చు. గర్భగృహం చుట్టూ ఉన్న ప్రాంగణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రాంగణం వెలుపలి భాగంలో గోడలపై వివిధ రకాల చిత్రాలు చూడవచ్చు.

చిత్ర కృప : Mukul Banerjee

మల్లిఖార్జున దేవాలయం

మల్లిఖార్జున దేవాలయం

మల్లిఖార్జున దేవాలయం క్రీ. శ. 7వ శతాబ్రదంలో త్రైలోక్య మహాదేవి నిర్మించింది.. దీని నిర్మాణ శైలి ద్రవిడ శిల్ప కళా శైలి కలిగి ఉంటుంది. మండప స్తంభాలకు పురాణాలు, ఇతిహాసాలలోని ప్రధాన సంఘటనలు చెక్కబడ్డాయి. ఈ దేవాలయంలోని నంది మండపం మరో ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : G41rn8

జైన మందిరం

జైన మందిరం

స్ధానికంగా ఈ జైన మందిరాన్ని 'జైన నారాయణ' అని కూడా పిలుస్తారు. దీనిని క్రీ. శ. 9వ శతాబ్దంలో మన్య ఖేతకు చెందిన రాష్ట్ర కూటులు నిర్మాణం చేశారు. వీరు తమ నిర్మాణాలలో ద్రవిడ శైలి కళా చెక్కడాలను చేశారు. ఈ జైన దేవాలయం ఎంతో పటిష్టమైనదిగా అతి పెద్ద బలమైన రాళ్ళతో కట్టబడింది. పర్యాటకులు ఈ ప్రాంత సందర్శనలో దీనిని తప్పక చూడాలి.

చిత్ర కృప : Dineshkannambadi

జంబులింగేశ్వర దేవాలయం

జంబులింగేశ్వర దేవాలయం

జంబులింగేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఒక ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలోకి ప్రవేశించగానే భక్తులు మాత పార్వతిని, శివ భగవానుడిని, నందిని దర్శిస్తారు.

చిత్ర కృప : G41rn8

కాడ సిద్ధేశ్వర దేవాలయం

కాడ సిద్ధేశ్వర దేవాలయం

కాడ సిద్ధేశ్వర దేవాలయం సుమారు క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడింది. క్రిందిభాగం అయిదు దంతులు వేసి ఎత్తుగా నిర్మించారు. ఈ దేవాలయం లో శివుడు ఒక చేతిలో తన త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తాడు. పర్యాటకులు ఈ దేవాలయాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా వస్తారు.

చిత్ర కృప : Ismoon

పాపానాధ దేవాలయం

పాపానాధ దేవాలయం

పాపానాధ దేవాలయం, ముక్తేశ్వరుడి కొరకు నిర్మించబడిని చిన్న దేవాలయం. ఈ నిర్మాణం సుమారు క్రీ.శ. 740 సంవత్సరంలో చేశారు. హాలు లోపలిభాగ ప్రవేశంలో నంది మరియు వీరభద్ర విగ్రహాలుంటాయి. పర్యాటకులు ఈ దేవాలయంలో మంటపానికి ఆధారంగా కల 16 అతి పెద్ద స్తంభాలను కూడా గమనించవచ్చు.

చిత్ర కృప : Meesanjay

సంగమేశ్వర దేవాలయం

సంగమేశ్వర దేవాలయం

సంగమేశ్వర దేవాలయాన్ని గతంలో విజయేశ్వర దేవాలయం అనేవారు. దీనిని చాళుక్య రాజు విజయాదిత్య సత్యశ్రయ సర్కా క్రీ. శ. 733 లో నిర్మించాడు. ఈ నిర్మాణం ద్రవిడ శిల్ప శైలి కలిగి ఉంటుంది. లోపలి ప్రాకారం, హాల్, కలవు. బయటి ప్రాకారం ఉగ్రనరసింహ మరియు నటరాజ శిల్పాలను కలిగి ఉంటుంది.

చిత్ర కృప : Manjunath nikt

విరూపాక్ష దేవాలయం

విరూపాక్ష దేవాలయం

దేవాలయాన్ని సర్కి క్రీ. శ. 740 లో రాణి లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య 2 పల్లవులను ఓడించిన గుర్తుగా నిర్మించారు. దీనిని క్రీ. శ. 8వ శతాబ్దంలో నిర్మించారు. దేవాలయంలో హిందూ దేవతలైన ఉగ్రనరసింహ, నటరాజ, రావణనుగ్రహ, లింగోద్భవులను శిల్పాలుగా చూడవచ్చు.

చిత్ర కృప : Mukul Banerjee

శిల్పాల గ్యాలరీ మ్యూజియం

శిల్పాల గ్యాలరీ మ్యూజియం

పట్టడకాల్ లో వివిధ దేవాలయాలను దర్శించిన యాత్రికులు భూతనాధ దేవాలయం రోడ్డులో కల శిల్పాల మ్యూజియం కూడా చూడాలి. ఈ మ్యూజియంను భారత దేశ పురావస్తు శాఖ నిర్విస్తోంది. ఈ మ్యూజియంలో అరుదైన శిల్పాలు, చెక్కడాలు అతి ప్రాచీనమైనవి చూడవచ్చు.

చిత్ర కృప : Ashwin Kumar

పట్టడక్కాల్ ఎలా చేరుకోవాలి ?

పట్టడక్కాల్ ఎలా చేరుకోవాలి ?

బస్ / రోడ్డు ప్రయాణం

పర్యాటకులు బాదామి, ఐహోళే, భాగల్ కోట తదితర సమీప ప్రాంతాల నుండి పట్టడక్కాల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

పట్టడక్కాల్ సమీపాన బాదామి రైల్వే స్టాలోన్ కలదు (25 km).

విమాన మార్గం

బెల్గాం విమానాశ్రయం పట్టడక్కాల్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం (205 కి.మీ).

చిత్ర కృప : Ashwin Kumar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X