Search
  • Follow NativePlanet
Share
» » కొత్త రాష్ట్రం... కొత్త పర్యటనలు!!

కొత్త రాష్ట్రం... కొత్త పర్యటనలు!!

తెలంగాణా ప్రదేశం మొదటగా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధినది. నిజాముల కాలంలో మెదక్ మరియు వరంగల్ విభాగాలను కలిపి తెలంగాణా అని పిలిచే వారు. తర్వాతి కాలం లో ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేరింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా, ఇండియా లో 29 వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణా దాని సరిహద్దులను ఉత్తర మరియు నైరుతి లలో మహారాష్ట్ర తోను, ఈశాన్యం లో చత్తీస్ ఘర్ రాష్ట్రం తోను పడమర కర్ణాటక తోను, తూర్పు భాగంలో ఓడిశా రాష్ట్రం తోను సరిహద్దులు పంచు కుంటోంది.

దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్రం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. కన్నుల విందు చేసే వివిధ పర్యాటక ప్రదేశాలు కల హైదరాబాద్, భద్రాచలం దేవాలయం, వేయి స్తంభాల దేవాలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, సరస్వతి దేవాలయం వంటి అనేక దేవాలయాలు, వివిధ పర్యాటక ఆకర్షణలు ఇక్కడ కలవు.
తెలంగాణ లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు

అదిలాబాద్

అదిలాబాద్

ఆదిలాబాద్ కు ఆ పేరు పూర్వపు బిజాపూర్ పాలకుడైన మహమ్మద్ ఆదిల్ షా పేరు నుండి వచ్చింది. చారిత్రకంగా, ఆదిలాబాద్ వివిధ సంస్కృతులకు నిలయంగా వుంటుంది. ఈ ప్రాంతాన్ని ఉత్తర భారత దేశ వంశాలు, మొఘల్స్, మౌర్యాస్ మరియు సౌత్ ఇండియా వంశాలు శాతవాహనులు, చాళుక్యులు పాలించారు. ఇక్కడ కల బాసర అనే పట్టణంలో ప్రసిద్ధి చెందిన మాత సరస్వతి దేవి ఆలయం కలదు. దీని చుట్టూ అనేక ఎత్తైన కొండలు, దట్టమైన పచ్చటి అడవులు కలవు. ఆదిలాబాద్ ప్రదేశం మహాత్ములైన వేద వ్యాసుల వంటి ఋషుల కారణంగా ఒక పవిత్ర ప్రదేశంగా మార్చ బడినది. ఈ ప్రదేశంలో పారే గోదావరి నది చక్కటి జలపాతాలను, వివిధ రకాల వన్య జీవులను పరిరక్షిస్తోంది.

Photo Courtesy: Rajib Ghosh

హైదరాబాద్

హైదరాబాద్

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని. ఇండియా లోని అత్యధిక జనాభా కల రాష్ట్రాలలో ఒకటి. ఈ నగరం టాలీ వుడ్ గా పిలువబడే పరిశ్రమ అయిన అతి పెద్ద ఫిలిం తయారీ స్టూడియో రామోజీ ఫిలిం సిటీ మరియు ఇతర తెలుగు ఫిలిం పరిశ్రమలకు నిలయంగా వుంది. మొదటగా హైదరాబాద్ నగరం మూసి నది ఒడ్డున ఏర్పడింది. ఇది క్రమేనా విస్తరించి అక్కడ కల చారిత్రా త్మక నిర్మాణాలు చార్మినార్, మక్కా మసీద్ వంటి వాటి తో పాత బస్తీ గా పేరు పడింది.

Photo Courtesy: $udhakar

ఖమ్మం

ఖమ్మం

ఖమ్మం అనే పేరు ఈ ప్రదేశంలో కల ఒక స్థానిక కొండ అయిన స్థంభాద్రి అనే పేరు మీదుగా ఏర్పడింది. ఇక్కడ ఒక పురాతన నరసింహ స్వామి దేవాలయం కలదు. ఈ పట్టణం కృష్ణ నది ఉప శాఖ అయిన మున్నేరు అనే నది ఒడ్డున అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక పర్యాటక ఆకర్షణలు, ఖమ్మం కోట, పాపి కొండలు, లకారం సరస్సు వంటివి కలవు.

Photo Courtesy: Pavithrans

మెదక్

మెదక్


మెదక్ ఒక చారిత్రాత్మక పట్టణం. దీనిని మొదటగా సిద్దాపురం అనే వారు. మెదక్ లో కాకతీయుల కాలంనాటి ఒక పురాతన కోట వ్యూహాత్మకంగా ఒక కొండపై నిర్మించినది కలదు. ఇది కాకతీయ రాజుల వైభవం చాటుతుంది. దీనిలో అనేక దేవాలయాలు కలవు. మెదక్ లో కల చర్చి ఆసియా లో అతి పెద్దది మరియు ప్రపంచంలో వాటికన్ తర్వాత రెండవ చర్చి గా పెర్కొనబడుతుంది.

Photo Courtesy: David Marchant

నల్గొండ

నల్గొండ

నల్గొండ , నల్గొండ జిల్లాలో ఒక టవున్ మరియు మునిసిపాలిటి. నల్గొండ అనే పదానికి అర్ధం , నల్ల అంటే నలుపు అని, కొండ అంటే కొండలు అని చెపుతారు. ఇక్కడ ట్రెక్కింగ్ కు అనేక మార్గాలు కలవు. ఇక్కడ కల దర్గా అనేకమంది ముస్లిం లను ఆకర్షిస్తుంది. ఇక్కడ కల నాగార్జున సాగర్ డాం దక్షిణ ఇండియా లో పెద్దది. దీనికి 26 గెట్ లు కలవు. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నల్గొండ పట్టణం నుండి 80 కి. మీ. ల దూరంలో కలదు.

Photo Courtesy: Avsnarayan

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రం లో ఒక పట్టణం మరియు మునిసిపల్ కార్పొరేషన్. నిజామాబాద్ ను పూర్వం ఇందూరు లేదా ఇంద్రపురి అని పిలిచేవారు. దీనిని రాష్ట్ర కూట వంశానికి చెందిన రాజు ఇంద్ర వల్లభ పంత్య వర్ష ఇంద్ర సోమ పాలించాడు. అశోక్ సాగర్ అనే సరస్సు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇక్కడ ఒక చక్కటి తోట మరియు సరస్సు మధ్యలో 18 అడుగుల ఎత్తైన సరస్వతి మాత విగ్రహం కలదు. ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి టెంపుల్ ఇక్కడకు 35 కి. మీ. ల దూరంలో కలదు. దక్షిణ ఇండియా లో సరస్వతి దేవాలయం బాసర లో మాత్రమే కలదు.

Photo Courtesy: Rizwanmahai

వరంగల్

వరంగల్

వరంగల్ పట్టణాన్ని ఓరుగల్లు నగరం అని కూడా అంటారు. ఇది వరంగల్ జిల్లాలో ఒక మునిసిపల్ కార్పొరేషన్. కాకతీయుల రాజుల కాలంలో ఇక్కడ తెలుగు సంస్క్రతి, సాహిత్యం వైభవోపేతంగా సాగింది. ఒకప్పుడు వైభవోపేతంగా సాగిన ఈ రాజుల పాలనలో నిర్మించబడిన అతి గొప్ప దేవాలయాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కల సరస్సులు కూడా గత పట్టణ వైభవాలను చాటుతాయి.

Photo Courtesy: randhir

ఆహారాలు

ఆహారాలు

తెలంగాణ రాష్ట్ర పజలు ఏమి తింటారు ? వీరికి ప్రధానంగా రెండు రకాల వంటలు కలవు. అవి ఒకటి తెలుగు వంటలు కాగా, రెండవది ఘాటైన సుగంధ ద్రవ్యాలు కలిగిన హైదరాబాది వంటలు . ఈ వంటలలో తెలుగు రుచులతో పాటు అరబ్, టర్కిష్ మరియు మొగలాయి వంటల రుచులు కూడా మిళితం అయి వుంటాయి. ఇక్కడ మీకు దొరికే హైదరాబాది దం బిరియాని అద్భుత రుచి కలిగి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వంటకంగా పేరు పడింది.

Photo Courtesy: Garrett Ziegler

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X