Search
  • Follow NativePlanet
Share
» »వాగమోన్ - కొత్త జంటలకు ఇక స్వర్గమే !!

వాగమోన్ - కొత్త జంటలకు ఇక స్వర్గమే !!

కేరళ ... ఈ పేరు వింటే చాలు పర్యాటకులకు పచ్చని ప్రదేశాలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్ల వరుసల బీచ్ లు, బ్యాక్ వాటర్స్ లో బోట్ విహారాలు, ఆయుర్వేద మసాజ్ లు, సుగుంధ ద్రవ్యాలు, తేయాకు తోటలు ... ఇంకా ఇలా ఎన్నో ఆకర్షణలు గుర్తుకువస్తాయి.

కేరళ రాష్ట్రం తో మనకు గట్టి సంబంధమే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రజలు ముమ్ముట్టి, మోహన్ లాల్ తరువాత ఎక్కువగా అల్లు అర్జున్ నే ఆదరిస్తారు. ఈ రాష్ట్రంలో మన టాలీవూడ్ సినిమా షూటింగ్ లు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఉదాహరణకి పవన్ కల్యాణ్ నటించిన పంజా, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, రవితేజ నటించిన నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్, ప్రభాస్ నటించిన బాహుబలి ... ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది.

వాగమోన్ కేరళ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పర్వత ప్రదేశం(హిల్ స్టేషన్). ఇది పడమటి కనుమలు విస్తరించిన కొట్టాయం, ఇడుక్కి జిల్లాల సరిహద్దులో ఉన్నది. ఈ ప్రదేశం పర్యాటకులకి ఎంతో ఇష్టం, ప్రత్యేకించి కొత్తగా పెళ్లి చేసుకొనివచ్చిన హనీమూన్ జంటలకి, ఏకాంతం కోరుకోనే యాత్రికులకి ఆసక్తికరంగా ఉంటుంది. ఆకుపచ్చని మైదానాలు, నీలం రంగు కొండలు, గలగల పారే నదులు, సెలయెర్లు, ఉవ్వెత్తు నుంచి ఎగిసిపడే జలపాతాలు, కాలుష్యరహితమైన గాలి ... ఇవన్ని కలిసి వాగమోన్ కు మరింత అందాన్ని చేకూర్చాయి. ఎన్నో ప్రకృతి ప్రదేశాలు, సినిమా షూటింగ్ ప్రదేశాలు, రిశార్ట్‌లు కలిగిన వాగమోన్ అందాలు ఒకసారి పరిశీలిస్తే ...

ఇది కూడా చదవండి : వాగమోన్ చేరితే ఏ ఏ ప్రదేశాలను చూడాలి (సంక్షిప్తంగా) !

కురిసుమల హిల్, వాగమోన్

కురిసుమల హిల్, వాగమోన్

వాగమోన్ కి 10 కి. మీ. దూరంలో, కురిసుమల హిల్ కలదు. దీనిని మౌంటెన్ ఆఫ్ ది హోలీ క్రాస్ అని కూడా అంటారు. ఈ కొండ క్రిస్టియన్లకు ప్రముఖ యాత్రా స్థలం కాబట్టే క్రిస్మస్ మరియు గుడ్ ఫ్రైడే వేడుకలకు సమీప ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు.

చిత్ర కృప : telugu native planet

కురిసుమల హిల్, వాగమోన్

కురిసుమల హిల్, వాగమోన్

కురిసుమల కొండ చుట్టూ దట్టమైన అడవులు, తేయాకు తోటలు విస్తరించడం వల్ల కొండలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. కొండ మీదికి వెళ్ళేటప్పుడు ఐరోపా శిల్ప శైలిలో నిర్మించబడిన ఒక పురాతన ఇల్లు మరియు మానవ నిర్మిత సరస్సు చూడవచ్చు.

చిత్ర కృప : Vibha Raj

మురుగన్ పారా, వాగమోన్

మురుగన్ పారా, వాగమోన్

మురుగన్ పారా కురిసుమల కొండ కి సమీపంలో ఉన్నది. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి చాలామంది ట్రెక్కింగ్, కేంపింగ్ మరియు పారాగ్లైడింగ్ ల కొరకు వస్తుంటారు. ఇక్కడి సమీపంలో గల సుబ్రమణ్యం స్వామి(మురుగన్) వారి ఆలయం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని రాళ్ళ నుండి అందంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు మురుగన్ దర్శనానికి వస్తుంటారు.

చిత్ర కృప : kmurugeshbabu

తంగల్ పేరా, వాగమోన్

తంగల్ పేరా, వాగమోన్

వాగమోన్ పేరుపొందిన మరొక మత పరమైన ఆకర్షణ గల ప్రదేశం తంగల్ పేరా. ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రజలు ఇక్కడికి వస్తారు. షేక్ ఫరియుద్దీన్ సమాధి అవశేషాలు కల ఒక పెద్ద రాయి ఇక్కడ కలదు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఉరుసు ఉత్సవాల సందర్భంలో దీనిని సందర్శిస్తుంటారు.

చిత్ర కృప : Rateesh Upendran

గుహలు, వాగమోన్

గుహలు, వాగమోన్

తంగల్ పేరా కి సమీపంలో చాలా పురాతన గుహ ఒకటి కలదు. మన పూర్వీకులు ఇక్కడే ఉండేవారట ..! తంగల్ పేరా ను చూసి ఈ గుహలో అడుగు పెడితే మీరు మరో లోకంలో అడుగుపెట్టినట్లు అనుకుంటారు. ఆ గుహలు అంత అందంగా ఉంటాయ్ మరి ..!

చిత్ర కృప : Surjith SM

వాగమోన్ సరస్సు, వాగమోన్

వాగమోన్ సరస్సు, వాగమోన్

వాగమోన్ లో గల మరొక అందమైన పర్యాటక ఆకర్షణ వాగమోన్ సరస్సు. ఇక్కడ ఉన్న అందమైన పచ్చటి ప్రదేశాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. అందమైన పువ్వులు, సరస్సు వెనక ఉండే కొండలు ఈ సరస్సు అందాల్ని మరింత రెట్టింపు చేశాయి.

చిత్ర కృప : Vibha Raj

వాగమోన్ సరస్సు, వాగమోన్

వాగమోన్ సరస్సు, వాగమోన్

వాగమోన్ సరస్సులో పర్యాటకులు బోట్ విహారం చేస్తూ చుట్టుప్రక్కల గల సుందర దృశ్యాలను చూడవచ్చు. ఈ సరస్సు పిక్నిక్ లకు, వారాంతపు సెలవులకు విశ్రాంతి ప్రదేశం. ఈ ప్రదేశంలో సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. మరి మీ ఇష్టమైన సినిమా హీరో, హీరోయిన్ చూసి సెల్ఫీలు తీసుకోండి.

చిత్ర కృప : kmurugeshbabu

డైరీ ఫారం, వాగమోన్

డైరీ ఫారం, వాగమోన్

డైరీ ఫారం లు కురిసుమల కొండ మీదికి ఎక్కెటప్పుడు కనిపిస్తాయి. ఈ డైరీలను కొండ మీది కురిసుమల ఆశ్రమ సన్యాసులు నిర్వహిస్తుంటారు. ఈ ప్రదేశం ఒక చిన్నపాటి గ్రామంలా అగుపిస్తుంది. ప్రశాంతతను ఇష్టపడేవారు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటారు.

చిత్ర కృప : Anulal

కురిసుమల ఆశ్రమం, వాగమోన్

కురిసుమల ఆశ్రమం, వాగమోన్

కురుసుమల ఆశ్రమం కురిసుమల కొండ మీద ఉనండి. ఇది క్యాథలిక్ లకు మరియు గాంధీ ఫిలాసఫీ లు నమ్మే వారికి పవిత్రమైనది. ఈ ఆశ్రమాన్ని అన్ని మతాల వారు సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న ప్రార్థనా మందిరంలో ప్రతి రోజు ప్రార్థన మరియు ధ్యానం చేస్తుంటారు.

చిత్ర కృప : Vanischenu

ముందకాయం ఘాట్ , వాగమోన్

ముందకాయం ఘాట్ , వాగమోన్

వాగమోన్ కి 8 కి. మీ. దూరంలో ఉన్న ముందకాయం ఘాట్ అద్భుతమైన సూర్యాస్తమం మరియు బర్డ్ వాచింగ్ లకు చక్కని ప్రదేశం. ఒంటరితనం కోరుకోనే వారు, ప్రకృతి ప్రియులు ఈ ప్రదేశాన్ని తరచూ సందర్శిస్తుంటారు.

చిత్ర కృప : Tony Jose

ముందకాయం ఘాట్ , వాగమోన్

ముందకాయం ఘాట్ , వాగమోన్

ముందకాయం ఘాట్ లో అప్పుడప్పుడు పారా గ్లైడింగ్ క్రీడలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఈ ప్రదేశానికి సాహసయత్రికులు వస్తుంటారు. వారి రాకతో ఒక్కసారి ఆ ప్రదేశం మొత్తం కోలాహలంగా మారుతుంది.

చిత్ర కృప : Vibha Raj

ఆత్మహత్యల స్థలం, వాగమోన్

ఆత్మహత్యల స్థలం, వాగమోన్

అవును ..! మీరు విన్నది నిజమే. ఈ ప్రదేశం ఆత్మహత్యల స్థలం. వాగమోన్ లో మూన్ పారా గా పిలవబడే ఈ ప్రదేశం సుసైడ్ పాయింట్ గా ప్రసిద్ధి చెందినది. సినిమాలలో చాలా వరకు ఈ ప్రదేశాన్ని చూసే ఉంటారు. ఈ స్థలం వి- ఆకారంలో ఉంటుంది. ఎంతో ఎత్తుగా ఉండే ఈ ప్రదేశం నుండి కిందకు చూస్తే ఒళ్ళు గగుర్పొడుతుంది.

చిత్ర కృప : Hari Krishnan

ఆత్మహత్యల స్థలం, వాగమోన్

ఆత్మహత్యల స్థలం, వాగమోన్

ఈ ఆత్మహత్యల స్థలంలో మీరు .సుసైడైతే చేసుకోరులే గానీ ... కొండ మీదికి ట్రెక్కింగ్ చేయండి చాలు. ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది అయితే కొండ మీదికి ఒక్కసారి వెళితే మళ్లీ కిందికి దిగాలని అనిపించదు అంత హాయిగా ఉంటుంది ఈ ప్రదేశం. సుందర ప్రదేశాలు, చల్లని గాలులు మీరు పడిన శ్రమను మరిపిస్తాయి.

చిత్ర కృప : Manoj Kesavan

ట్రెక్కింగ్, వాగమోన్

ట్రెక్కింగ్, వాగమోన్

పర్యాటకులు వాగమోన్ లో ట్రెక్కింగ్ చేయక ఉండలేరు ముఖ్యంగా సాహసికులు. పచ్చటి కొండలు, రకరకాల అందమైన రంగురంగుల పూవులు, వివిధ రకాలైన తోటలు, చిన్న చిన్న నీటి ప్రవాహాలు, సెలయెర్లు, జలపాతాలు ఇవన్నీ ఒక ఎత్తైతే, వాటి పక్కన నడక, కాళ్లకు చల్లని నీటి ప్రవాహం ఇలా ఇవన్నీ మీకు మారుపురాని అనుభూతులను కలిగిస్తాయి.

చిత్ర కృప : Anulal

వాగమోన్ జలపాతాలు, వాగమోన్

వాగమోన్ జలపాతాలు, వాగమోన్

వాగమోన్ జలపాతాలు ఇక్కడి సరస్సుల నుండి వెలువడే చిన్న ప్రవాహం అన్నమాట. ఈ ప్రవాహం కింద ఉన్న లోయలోకి పడటం చూడదగ్గ అంశం. గుట్టల మీద పడి అక్కడి నుండి దట్టమైన అడవులలోకి కలిసిపోతుంది. ఈ జలపాతాలకు వెళ్లే మార్గం ట్రెక్కర్లకు ఒక మారుపురాని అనుభూతి. ఒక్కమాటలో చెప్పాలంటే వాగమోన్ జలపాతాలను చూస్తే ఇక ఎప్పటికీ మరిచిపోరు ..!

చిత్ర కృప : surya kiran surya kiran

పీర్ మేడ్, వాగమోన్

పీర్ మేడ్, వాగమోన్

వాగమోన్ కి 27 కి. మీ. దూరంలో ఉన్న పీర్ మేడ్ ప్రదేశం పశ్చిమ కనుమల్లో విస్తరించి సముద్రమట్టానికి 915 కి. మీ. దూరంలో ఉన్నది. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, శృంగార భరితమైన వాతావరణం ఇక్కడి వారిని ఏదో లోకానికి తీసుకెళ్తుంది. కాసింత రిలాక్స్ కోరుకొనేవారు స్వచ్ఛమైన ఆయుర్వేద మసాజ్ లు చేయించుకోవచ్చు.

చిత్ర కృప : jain k john

కుట్టికానం, వాగమోన్

కుట్టికానం, వాగమోన్

కుట్టికానం సముద్రమట్టానికి 3500 అడుగుల ఎత్తున ఉండి, పర్యాటకులను ఆకర్షిస్తున్నది. హనీమూన్ జంటలకి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. ఇక్కడ హనీమూన్ జంటలు రొమాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది.

చిత్ర కృప : anishmisty

కుట్టికానం, వాగమోన్

కుట్టికానం, వాగమోన్

కుట్టికానం కొండ మీద ఉండే టీ, కాఫీ తోటలు, వలన్జంగానం జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ కొండ మీద ఉన్న పైన్ అడవుల్లో ఎన్నో సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. చాలా వరకు సినిమాల్లో రొమాంటిక్ పాటలు చిత్రీకరించడానికి ఈ ప్రదేశాన్ని వాడుకుంటారు.

చిత్ర కృప : Aravind Ajith

త్రిశంకు కొండలు , వాగమోన్

త్రిశంకు కొండలు , వాగమోన్

త్రిశంకు కొండలు పీర్ మేడ్ కు 4 కి. మీ. ల దూరం లో కలవు. ఈ కొండల నుండి కనపడే దృశ్యాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. చల్లని పిల్ల గాలుల మధ్య పర్యాటకులు తమ విశ్రాంతి సెలవులని ఎంతో ఆనందంగా గడపవచ్చు. ప్రత్యేకించి సూర్యాస్తమయం సమయం లో .. ఆకాశం లో కనబడే నారింజ రంగు ఎరుపు, ఆకర్షణీయ నీలం రంగు ఎంతో ముచ్చటగా వుంటాయి.

చిత్ర కృప : muralii nair

త్రిశంకు కొండలు , వాగమోన్

త్రిశంకు కొండలు , వాగమోన్

నిదానమైన ట్రెక్కింగ్ కు , చక్కని నడకకు త్రిశంకు కొండలు అనువైనవి. ఫ్యామిలీ టూర్లు, బైకింగ్ ట్రిప్పులు, ట్రెక్కింగ్ ట్రిప్పులు, ఒక రోజు ట్రిప్పులు, హనీమూన్ ట్రిప్పులు వేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ ప్రియులు కంటికి కనపడే అందమైన ప్రకృతి దృశ్యాలను తీస్తూ మరింత ఆనందిచవచ్చు.

చిత్ర కృప : Dhaval Momaya

సైక్లింగ్, వాగమోన్

సైక్లింగ్, వాగమోన్

పర్యాటకులు పీర్ మేడ్ లో లోతైన ప్రాంతాలను సైతం చూడవచ్చు. సైక్లింగ్, హార్స్ రైడింగ్ ల ను చేస్తూ చుట్టుప్రక్కల గల ప్రదేశ అందాలను తిలకించవచ్చు. ఇటువంటి క్రీడలు చేసేవారికి శీతాకాలం ఎంతో అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ చేసే వారు ఆహారం మరియు డ్రింకింగ్ వాటర్ తప్పనిసరిగా తీసుకెళ్ళటం మరిచిపోవద్దు ..!

చిత్ర కృప : Rajesh P Nayak

వాగమోన్ ఎలా చేరుకోవచ్చు ??

వాగమోన్ ఎలా చేరుకోవచ్చు ??

విమాన మార్గం

వాగమోన్ కి సమీపాన ఉన్న విమానాశ్రయం 107 కి. మీ. దూరంలో ఉన్న కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు విమానాలు నడుస్తుంటాయి. ఈ విమానాశ్రయం నుండి రెండున్నార గంటల్లో క్యాబ్ ద్వారా వాగమోన్ చేరుకోవచ్చు

రైలు మార్గం

వాగమోన్ కి సమీపాన గల రైల్వే స్టేషన్ 22 కి. మీ. దూరంలో ఉన్న కుట్టికానం రైల్వే స్టేషన్. ఇంకా పాలాయి(33 కి. మీ. దూరంలో), తోడు పూజా(39 కి. మీ. దూరంలో), కుమిలీ(45 కి. మీ. దూరంలో) మరియు కొట్టాయం (65 కి. మీ .దూరంలో) రైల్వే స్టేషన్ లు దగ్గరిలో కలవు.

రోడ్డు మార్గం

వాగమోన్ కు బస్సు సర్వీసులు బాగానే ఉన్నాయి కనుక సులభంగా చేరుకోవచ్చు. సమీప ప్రాంతాల నుండి వాగమోన్ కి బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

చిత్ర కృప : sajith_erattupetta

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X